బిఎస్-III టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం

Written By:

ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్‌టిఓ కార్యాలయాల్లో మార్చి 31, 2017 రోజున మరియు అంతకుమునుపు కొనుగోలు చేసిన బిఎస్-III టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ను కొనసాగించమని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు ఉత్తర్వల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో బిఎస్-III కార్లు మరియు బైకులను విక్రయించిన సంస్థలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు.

నిజానికి మార్చి 31, 2017 వరకు మాత్రమే బిఎస్-III వాహనాలను విక్రయించవచ్చు. ఆ తరువాత విక్రయాలు నిలిపివేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లో తీర్పునిచ్చింది. అయితే బిఎస్-III వాహనాల రిజిస్ట్రేషన్‌కు నిర్ణీత గడువును తెలపడంలో సుప్రీం కోర్టు ఆలస్యం చేసింది.

ఈ కారణంగా అప్పట్లో ఆర్‌టిఓ అధికారులు బిఎస్-III వాహనాల రిజిస్ట్రేషన్‌లను తాత్కాలికంగా వాయిదా వేశారు. తదుపరి కోర్టు వెల్లడించే రిజిస్ట్రేషన్ గడువు కోసం ఆర్‌టిఓ అధికారులు ఎదురు చూశారు.

బిఎస్-III వాహనాల విక్రయాలు మరియు రిజిస్ట్రేషన్‌కు గడువు మార్చి 31, 2017 గా సుప్రీం కోర్టు నిర్ణయించింది. అయితే గడువు అనంతరం కూడా కేవలం కేంద్ర రాజధాని పరిధిలో రిజిస్ట్రేషన్‌ జరగాల్సిన టూ వీలర్ల సంఖ్య 1000 యూనిట్లుగా ఉన్నట్లు తెలిసింది.

సరిగ్గా మార్చి 31 న మరియు అంతకు ముందు కొనుగోలు చేసిన మోటార్ సైకిళ్లను మాత్రమే వాటి ఇన్ వాయిస్ బిల్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆర్‌టిఓ అధికారులకు సుప్రీం కోర్టు సూచించింది.

ఇక్కడ ఆర్‌టిఓ అధికారులు మార్చి 31 మరియు అంతకు ముందు ఆన్ లైన్ పేమెంట్ చేశారా... లేదా.. మరియు ఆన్ లైన్ పేమెంట్ నమోదు చేసిన వ్యక్తి పేరు మీదే ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేశారా లేదా అనేది గుర్తించాల్సి ఉంటుంది.

గడువులోపు ఆన్ లైన్ పేమెంట్ మరియు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి సంభందించిన ఉల్లంఘనలకు ఆర్‌టిఓ అధికారులే భాద్యత తీసుకోవాల్సి ఉందని మరియు అలాంటి వాటిని మే 15, 2017 గడువు లోపు రిజిస్ట్రేషన్ నిర్వహించాలని కోర్టు ఉత్వర్వుల్లో పేర్కొంది.

నిజానికి ఆన్‌లైన్లో పేమెంట్ జరిపిన డీలర్లు అదే రోజున సర్వీస్ ట్యాక్స్ కూడా చెల్లిస్తారు, కానీ మార్చి 31 రోజున డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన కస్టమర్లకు సంభందించిన ట్యాక్స్‌ను డీలర్లు మరుసటి రోజు చెల్లిస్తారు. గడువు ముగిసిన తరువాత సర్వీస్ ట్యాక్స్ చెల్లించనట్లు పత్రాలు ఉండటంతో ఇలాంటి వాటికి రిజిస్ట్రేషన్ నిలిపివేశాయి ఆర్‌టిఓ కార్యాలయాలు.

ఆన్ లైన్లో సర్వీస్ ట్యాక్స్ పేమెంట్ చేయడానికి వీలులేకపోయిన డీలర్ల అంతా ఈ విషయం గురించి ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించడంతో, ఆన్ లైన్లో సర్వీస్ ట్యాక్స్ పేమెంట్ చేయడానికి కుదరని డీలర్లు మాత్రమే ఈ కొత్త ఆర్డర్‌కు అర్హులని ఉత్వర్వుల్లో పేర్కొంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, May 15, 2017, 16:00 [IST]
English summary
Read In Telugu Delhi Government Orders Registration Of BS-III Two-Wheelers
Please Wait while comments are loading...

Latest Photos