అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లతో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలో ఉన్న క్లాసిక్ రేంజ్, కాంటినెన్షియల్ జిటి మరియు బుల్లెట్ ఇఎఫ్ఐ మోటార్ సైకిళ్లలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెనుక వైపున డిస్క్ బ్రేకులు వంటి జోడింపుతో అప్‌డేట్స్ నిర్వహించింది

By Anil

రాయల్ ఎన్ఫీల్డ్ యురో-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లతో తమ క్లాసిక్, బుల్లెట్ మరియు కాంటినెన్షియల్ జిటి బైకులకు అప్‌డేట్స్ నిర్వహించింది. అదే విధంగా అతి ముఖ్యమైన యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రియర్ డిస్క్ బ్రేకులను క్లాసిక్ మరియు బుల్లెట్ బైకుల్లో, కాంటినెన్షియల్ జిటిలో ఏబిఎస్ ఫీచర్ ను అందించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లో క్లాసిక్ 500 లోని డెసెర్ట్ స్టార్మ్, క్రోమ్, బ్యాటిల్ గ్రీన్, స్క్వాడ్రన్ బ్లూ మరియు 500 వేరియంట్లతో పాటు కాంటినెన్షియల్ జిటి మరియు బుల్లెట్ 500ఇఎఫ్ఐ మోటార్ సైకిళ్లను అందుబాటులో ఉంచింది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

వ్యయప్రయాసలతో ఈ మూడు మోడళ్లలో యురో-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను అందివ్వడంతో పాటు యూరోపియన్ శ్రేణిలోని ఉత్పత్తుల్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డిస్క్ బ్రేక్ అప్‌డేట్స్ నిర్వహించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ లోని అన్ని ఉత్పత్తుల్లో 2017 నుండి డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందివ్వనుంది. అయితే సంస్థ యొక్క మునుపటి డిజైన్, రియర్ డిస్క్ బ్రేక్ మరియు ఏబిఎస్ వంటి వాటిలో ఎలాంటి మార్పు ఉండదు.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే అవి ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ లలో ఎలాంటి మార్పు ఉండదు, అయితే నూతన ఉద్గార నియమాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం తమ శ్రేణిలో ఉన్న అన్ని బైకులను మరియు భవిష్యత్తులో విడుదల చేసే ఉత్పత్తులను ఉద్గార నియమాలకు లోబడిన ఇంజన్‍‌లను అందివ్వనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

ఏబిఎస్ మరియు రియర్ డిస్క్ బ్రేకులతో పరిచయం అయిన మోడళ్ల ధరలు ప్రస్తుత ధరల కన్నా స్వల్ప మేర పెరిగే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

2017 మార్చి నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని విభిన్నమైన వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లో ఏబిఎస్ మరియు రియర్ డిస్క్ బ్రేకులతో పరిచయం అయిన వాటిని దేశీయంగా విడుదల చేయనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ కేఫ్ రేసర్, క్రూయిజర్, రెట్రో స్ట్రీట్, స్టాండర్డ్ స్ట్రీట్ మరియు ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్లను అందిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

రాయల్ ఎన్ఫీల్డ్ 2017 మార్చి నాటికి దేశీయ విపణిలోకి శక్తివంతమైన కాంటినెన్షియల్ జిటి మోటార్ సైకిల్‌ను విడుదల చేయనుంది. సంస్థకు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనున్న కాంటినెన్షియల్ జిటి 750 ని ఇప్పటికే పలుమార్లు దేశీయ రహదారుల మీద రహస్యంగా పరీక్షించడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కాంటినెన్షియల్ జిటి 750 ని స్పెయిన్ లో కూడా పరీక్షించింది, ట్విన్ సిలిండర్ గల ఇందులో రెండు ఎగ్జాస్ట్ పైపులున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ భద్రత ఫీచర్లు

అడ్వెంచర్ రైడింగ్ కోసం లాంగ్ ట్రావెల్ మరియు ఆధునిక డిజైన్ హంగులతో బడ్జెట్ ధరలో ఉన్న మోటార్ సైకిల్ కోసం చూస్తున్నారా...? ఈ లక్షణాలతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మోడల్ బజాజ్ డామినర్ 400. దీనికి సంభందించిన ఫోటోలు మీకోసం....

Most Read Articles

English summary
Royal Enfield Unveils New Safety Features For Its Models In Europe
Story first published: Tuesday, January 17, 2017, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X