రెట్టింపు పవర్ ఉత్పత్తి చేయగల రాయల్ ఎన్పీల్డ్ కాంటినెన్షియల్ జిటి

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెన్షియల్ జిటి. దేశీయంగా ఉన్న అనేక బైకులతో పోల్చితే అన్నింటి పరంగా చాలా విభిన్నమైనది. డిజైన్ మరియు పవర్ విషయంలో దీని స్థానమే వేరు. అయితే ఇది ప్రొడ్యూస్ చేసే పవర్‌ను రెట్టింపు చేయడానికి ఆస్ట్రేలియన్‌కు చెందిన ఓ సంస్థ దీనికి కొన్ని మోడిఫికేషన్స్ నిర్వహించింది. ఇంకేముంది రెట్టింపు పవర్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది.

ఆస్ట్రేలియాకు చెందిన మోటోమ్యాక్స్ అనే సంస్థ ఈ కాంటినెన్షియల్ జిటి మోటార్ సైకిల్‌లోని ఇంజన్‌కు సుజుకి జిమ్నీలోని టుర్బో ఛార్జర్‌ను అనుసంధానం చేసింది. ఇంకేముంది, సాధారణంగా ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ రెండింతలయ్యింది.

ప్రస్తుతం కాంటినెన్షియల్ జిటిలోని ఒరిజినల్ స్పెసిఫికేషన్స్ పరంగా 529బిహెచ్‌పి పవర్ మరియు 44ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. అయితే టుర్బో ఛార్జర్ అనుసంధానం తరువాత గరిష్టంగా 42బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తోంది.

ఆటోమ్యాక్స్ చేసిన ఇంజన్ మోడిఫికేషన్స్ సఫలం కావడంతో ఈ ప్రత్యేక కాంటినెన్షియల్ జిటి మోటార్ సైకిల్‌కు కాంటినెన్షియల్ జిటి టి అనే పేరును నామకరణం చేసింది. అదనంగా వచ్చి చేరిన టి అనగా టుర్బో ఛార్జర్.

ఇంజన్ మోడిఫికేషన్స్ పాటు ఇందులో గుర్తించదగ్గ మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి, ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రంట్ మడ్ గార్డ్ మరియు ఇంజన్‌కు వెనుక భాగంలోని చిన్న బాక్స్‌ను బ్రష్ మెటల్ పెయింట్ ఫినిషింగ్‌ చేయడం జరిగింది.

ఎగ్జాస్ట్ గొట్టం చుట్టూ చేతితో చుట్టబడిన చుట్టలు, తక్కువ ఎత్తులో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, హ్యాండిల్‌‌కు ఇరువైపులా కొత్త క్లిప్పులు, నూతనంగా డిజైన్ చేయబడిన సీటు ఇందులో గుర్తించవచ్చు.

మోటోమ్యాక్స్ సంస్థ ఈ రాయల్ ఎన్పీల్డ్ కాంటినెన్షియల్ జిటి టి మోటార్ సైకిల్‍‌ను ఆస్ట్రేలియా 31 డే కస్టమ్ బైక్ బిల్డ్ ఆఫ్ చాలెంజ్ అనే ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించింది. మరియు దీనిని కేవలం 60 గంటల్లో పూర్తిగా మోడిఫై చేసినట్లు ఆటోమ్యాక్స్ వెల్లడించింది.

కేఫ్ రేసర్లు రాయల్ ఎన్పీల్డ్ వారి కాంటినెన్షియల్ జిటి ని ఎంచుకోవడం ఇష్టం లేదా.... అయితే ట్రయంప్ వారి స్ట్రీప్ కప్ మోటార్ సైకిల్ ను చూడండి... దీని కోసం క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి...!!

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Turbocharged Royal Enfield Continental GT — Any Takers?
Please Wait while comments are loading...

Latest Photos