2013 టోక్యో మోటార్ షోలో డిస్‌ప్లే కానున్న యమహా బైక్స్

By Ravi

ఇటీవలే ఇటలీలో ముగిసిన 2013 ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్ షోలో అనేక సరికొత్త మోటార్‌సైకిళ్లను, ద్విచక్ర వాహనాలను మనం చూశాం. ఇందులో కొన్ని భారత మార్కెట్‌కు కూడా రానున్నాయి. తాజాగా.. జపాన్‌లో జరగనున్న 2013 టోక్యో మోటార్ షో కోసం తయారీదారులు తమ సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతన్నారు.

ఈ నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ యమహా నాలుగు సరికొత్త కాన్సెప్ట్ వాహనాలను ఆవిష్కరించనుంది. ఇందులో ఒక కెఫే రేసర్ మోటార్‌సైకిల్ స్టయిల్‌తో పాటుగా మూడు ఫ్యూచరిస్టిక్ టూవీలర్స్ ఉన్నాయి. 2013 టోక్యో మోటార్ షో ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మరి ఆ స్టన్నింగ్ యమహా ఉత్పత్తులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

బోల్ట్ కెఫే

బోల్ట్ కెఫే

పురాతన కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిళ్లకు పునజ్జీవం కల్పిస్తూ యమహా 'బోల్ట్ కెఫే' పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్ వాహనాన్ని డిజైన్ చేసింది. పాపులర్ యమహా బోల్ట్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని దీనిని తీర్చిదిద్దారు. అయితే, బైక్ ప్రియులను నిరాశపరచే విషయం ఏటంటే, ఇది ప్రోటోటైప్‌గానే మిగిలిపోనుంది. ప్రొడక్షన్ దశకు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు.

పెస్1 (PES1)

పెస్1 (PES1)

ప్యాషన్ ఎలక్ట్రిక్ స్ట్రీట్ స్పోర్ట్‌గా పిలిచే ఈ ఫ్యూచరిస్టిక్ బైక్ ఓ లైట్‌వెయిట్ ఎలక్ట్రిక్ బైక్. ఇది బ్రష్‌లెస్ డిసి మోటార్ సాయంతో పరుగులు తీస్తుంది. ఈ మోటార్ లిథియం ఐయాన్ బ్యాటరీలతో పనిచేస్తుంది. దాదాపు 220 పౌండ్ల బరువు ఉండే ఈ బైక్‌లో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్సును ఉపయోగించారు.

పెడ్1 (PED1)

పెడ్1 (PED1)

పెస్1 బైక్‌కు సీక్వెల్ వెర్షనే ఇది. పెస్1 రెగ్యులర్ అర్బన్ బైక్ కాగా, పెడ్1 ఓ డర్ట్/ట్రైల్ బైక్ లాంటిది. ఇందులో కూడా ఆటోమేటిక్ / మ్యాన్యువల్ గేర్‌బాక్స్, స్వాపబల్ బ్యాటరీ హబ్‌లు ఉండనున్నాయి.

యమహా ఎవినో

యమహా ఎవినో

యమహా ఎవినో ఓ హైబ్రిడ్ స్కూటర్. భవిష్యత్తులో అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. ఇందులో ఐసిఈ పవర్‌ట్రైన్ ప్లస్ లిథియం ఐయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.

Most Read Articles

English summary
Yamaha has revealed its lineup for the 2013 Tokyo Motor Show, which is slated to kick off from November 22. Here’s specs and pictures of the concepts to be unveiled by the Yamaha.
Story first published: Tuesday, November 12, 2013, 15:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X