టోక్యో మోటార్ షోలో సుజుకి ఆవిష్కరించనున్న కాన్సెప్ట్స్

By Ravi

జపనీస్ ఆటో దిగ్గజం సుజుకి మోటార్ కార్పోరేషన్ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2013 టోక్యో మోటార్‌షోలో మూడు సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. అందులో మొదటది 'క్రాస్‌హైకర్' 2011లో సుజుకి ప్రదర్శించిన రెగినా/జి70 కాన్సెప్ట్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ క్రాస్‌హైకర్ డిజైన్ చేశారు.

సుజుకి క్రాస్‌హైకర్ కాన్సెప్ట్ వాహనంలో 1.0 లీటర్ ఇంజన్ ఉపయోగించనున్నారు. తేలికగా ఉండేలా ఈ వాహనాన్ని నిర్మించారు. దీని మొత్తం బరువు 810 కేజీలు. ఈ బరువు ఓ కాంపాక్ట్ కారు బరువుతో సమానం. ఈ ఇంజన్ తక్కువ కెపాసిటీ కలిగి ఉన్నప్పటికీ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్ మాదిరిగానే ఇది కూడా మంచి పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Suzuki iV4

సుజుకి ఎక్స్-లాండర్
నవంబర్ 20వ తేది నుంచి జరగనున్న 43 టోక్యో మోటార్ షోలో సుజుకి ఆవిష్కరించనున్న మరో కాన్సెప్ట్ వాహనం పేరు 'ఎక్స్-లాండర్'. చైనా మార్కెట్లో సుజుకి విక్రయిస్తున్న జిమ్నీ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని సుజుకి తమ ఎక్స్-లాండర్ మినీ-క్రాసోవర్ కాన్సెప్ట్‌ను తయారు చేసింది. ఇదొక హైబ్రిడ్ కారు. ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారులో 1.3 లీటర్ ఇంజన్ మరియు ఓ ఎలక్ట్రిక్ మోటార్ ఉండనుంది. ఈ ఇంజన్లు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి.

సుజుకి హస్ట్లర్
చివరిగా సుజుకి నుంచి రానున్న మూడవ కాన్సెప్ట్ వాహనం పేరు సుజుకి హస్ట్లర్. రెండు సీట్లు మాత్రమే కలిగిన ఈ మినీ సుజుకి కాన్సెప్ట్‌లలో కెల్లా విశిష్టంగా ఉండనుంది. ఓపెన్ టాప్ కలిగిన సుజుకి హస్ట్లర్‌తో ఓ మినీ కార్ సెగ్మెంట్‌ను పరిచయం చేయాలని సుజుకి యోచిస్తోంది. ఆధునిక లైఫ్‌‌స్టైల్‌కు అనుగుణంగా ఈ కారును డిజైన్ చేశారు. ఈ బుల్లి కారును ఎస్‌యూవీ స్టైల్‌లో అభివృద్ధి చేశారు. 2013 టోక్యో మోటార్ షోలో కూపే వెర్షన్ హస్ట్లర్‌తో పాటు ఐవి-4 కాన్సెప్ట్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించే ఆస్కారం ఉంది.
Most Read Articles

English summary
Japanese carmaker Suzuki Motor Corporation has announced its concept lineup for the upcoming 2013 Tokyo Motor Show. First in the line is Crosshiker and second concept is X-Lander and finally the third concept is Hustler.
Story first published: Monday, November 11, 2013, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X