టోక్యో మోటార్ షో: నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న పాపులర్ స్పోర్ట్స్ కారు 'నిస్సాన్ జిటి-ఆర్'లో కంపెనీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న 43వ అంతర్జాతీయ టోక్యో మోటార్ షోలో నిస్సాన్ తమ 2015 వెర్షన్ జిటి-ఆర్ స్పోర్ట్ కారును విడుదల చేసింది.

నిస్సాన్ ఇందులో తమ పెర్ఫామెన్స్ విభాగం నిస్మోతో కలిగి అభివృద్ధి చేసిన ఓ స్టయిలిష్, హైపవర్ పెర్ఫామెన్స్ వెర్షన్ జిటి-ఆర్ నిస్మో మోడల్‌ను కంపెనీ ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచింది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నిస్సాన్ తమ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారును కూడా అధునాత టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసింది.

ఈ సరికొత్త 2015 నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

కొత్త 2015 నిస్సాన్ జిటి-ఆర్‌లో సస్పెన్షన్ సిస్టమ్, మెకానికల్ ట్యూనింగ్, యాక్టివ్ ఎలక్ట్రానిక్ ట్యూనింగ్ వంటి మార్పులు చేర్పులు చేశారు. అన్ని రోడ్లపై ప్రయాణానికి అనువుగా ఉండేలా కారును అభివృద్ధి చేశారు. అలాగే, మరింత సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డ్రైవ్‌ను ఆఫర్ చేసేలా కొత్త జిటి-ఆర్‌ను నిస్సాన్ తీర్చిదిద్దింది.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

ఈ అప్‌గ్రేడ్ ప్యాకేజ్‌లో భాగంగా, నిస్సాన్ తమ జిటి-ఆర్ కోసం కొత్త డన్‌లాంప్ ఎస్‌పి స్పోర్ట్ మ్యాక్స్ జిటి 600 డిఎస్ఎస్‌టి సిటిటి స్టాండర్డ టైర్లను ఆఫర్ చేస్తోంది.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

ఎంతటి స్పీడ్ వద్దనైనా సురక్షితమైన బ్రేకింగ్‌ను అందించేలా నిస్సాన్ జిటి-ఆర్ కారులో బ్రేకింగ్ సిస్టమ్‌ను మెరుగు పరచారు. అలాగే, సిటీలో తక్కువ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తున్నప్పుడు మంచి హ్యాండ్లింగ్ ఉండేలా స్టీరింగ్‌ను మెరుగుపరచారు.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

ఇంకా.. ఇందులో అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్ సిస్టమ్‌తో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్స్ ఓ ప్రధాన అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. ఇది మూడు విభిన్న రకాల ఎల్ఈడి లో బీమ్‌లను (లాంగ్ డిస్టన్స్ ఇల్యుమినేషన్, వైడ్ ఇల్యుమినేషన్‌లతో కలిపి) ఆఫర్ చేస్తుంది.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

వెనుక వైపు ఫోర్-రింగ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. మొత్తమ్మీద ఎక్స్టీరియర్‌లో చేసిన మార్పులను గమనిస్తే, ఇది మునుపటి వెర్షన్ కన్నా మెరుగ్గా అనిపిస్తుంది.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

ఎక్స్టీరియర్ బాడీ పెయింట్‌లో గోల్డ్ ఫ్లేక్ రెడ్ పెరల్ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో అతి సూక్ష్మమైన గోల్డ్ టింటెడ్ గ్లాస్ ఫ్లేక్‌లను రెడ్ పెయింట్‌లో మిక్స్ చేస్తారు. ఇది కారుక మంచి షైనింగ్‌తో కూడిన ఫినిషింగ్‌ను అందిస్తుంది.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

వెనుక వైపు కొత్త కార్బన్ ఫైబర్ రియర్ వింగ్‌ను ఆప్షనల్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇది తేలికగా ఉండి, స్పాయిలర్ మాదిరిగా పనిచేస్తుంది.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇది మూడు కొత్త కలర్ స్కీమ్‌లతో లభిస్తుంది. ప్రీమియం లెథర్ అండ్ స్పోర్టీ సీట్స్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్‌తో పాటు ఇతర ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ కొత్తగా అనిపిస్తాయి.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

అధిక స్పీడ్స్ వద్ద క్యాబిన్‌ లోపల శబ్ధాన్ని తగ్గించేందుకు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు.

నిస్సాన్ జిటి-ఆర్ ఫేస్‌లిఫ్ట్

కొత్త 2015 నిస్సాన్ జిటి-ఆర్ ఈ ఏడాది డిసెంబర్ నెలలో జపాన్ మార్కెట్లో విడుదల కానుంది, అనంతరం ఇతర గ్లోబల్ మార్కెట్లలో ఇది విడుదల కానుంది.

Most Read Articles

English summary
In all the excitement surrounding the extreme variety Nissan GT-R Nismo we should not forget about the plain vanilla GT-R which the automaker has upgraded for the coming year. While Nismo focused on improving the GT-R's performance on track, Nissan engineers have worked on making the regular GT-R a more balanced GT car all-round, which is now more comfortable during your trip to the grocery store, up a winding mountain pass or while cruising on the highway.
Story first published: Friday, November 22, 2013, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more