డెట్రాయిట్ ఆటో షోలో ప్రిసిషన్ కాన్సెప్ట్ కారును ప్రవేశపెట్టిన అకురా

Written By:

జపాన్ ఆధారిత సంస్థ హోండా మోటార్స్ వారి ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న అకురా ప్రస్తుతం 2016 డెట్రాయిట్ ఆటో షో లో తమ ప్రిసిషన్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది.

అకురా వారు ప్రదర్శించిన ఈ కాన్సెప్ట్ కారు మునుపటి కారు కన్నా ఎంతో బోల్డ్ గా ఉంది. అయితే ప్రస్తుతం వీరు ప్రవేశపెట్టిన కారు డిజైన్ అకురా వారి భవిష్యత్తు డిజైన్‌గా చెలామణి అవుతుందని ఈ సందర్బంగా వారు వివరించారు. అకురా అన్ని భవిష్యత్తు కార్లు ఈ డిజైన్‌లోనే రానున్నాయి.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు

ఈ కారుకు ముందు భాగంలో గల రేజర్ షార్ప్ హెడ్‌ల్యాంప్స్ డైమండ్ పెంటాగాన్ గ్రిల్ కు ఇరువైపులా ఉన్నాయి. కాన్సెప్ట్ కారు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంది. దీనికి 21-అంగుళాలు గల చక్రాలు కలవు. వెనుకవైపున రెండు ఎగ్జాస్ట్ టెయిల్ పైపులను కలిగి ఉంది.
(గమనిక : ప్రిసిషన్ కాన్సెప్ట్ కారుకు చెందిన ఎటువంటి సాంకేతిక వివరాలు అకురా వారు వెల్లడించలేదు )

English summary
2016 Detroit Auto Show : Acura Reveals Precision Concept
Story first published: Wednesday, January 13, 2016, 17:17 [IST]
Please Wait while comments are loading...

Latest Photos