బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR 310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు TVS '2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో'లో కొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌ ప్రవేశపెట్టి ఒక సంచలనం సృష్టించింది. TVS కంపెనీ సరైన ఫెయిర్డ్ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఇది ఎంతో మంది వాహనప్రియులను ముగ్దుల్ని చేసింది.

2017 లో, TVS కంపెనీ తన Apache RR 310 బైక్ ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ Apache RR 310 బైక్ ని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో మేము దీనిని మొదటిసారి రైడ్ చేసినప్పుడు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కంపెనీ 2018, 2019 మరియు 2020 లో కూడా RR 310 బైక్ ని అప్‌డేట్ చేసింది.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

కంపెనీ ఇటీవల కొత్త 2021 Apache RR310 బైక్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉండటంతో పాటు, డైనమిక్ కిట్ & రేస్ కిట్ అనే రెండు కిట్‌లను కూడా పొందుతుంది. ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ బైక్ యొక్క వెనుక భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా ఉంది.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

2021 Apache RR310 రేస్‌ట్రాక్‌లో ఉన్నట్లు కనిపించేలా చేసే అనేక కస్టమైజేషన్ ఆప్సన్స్ పొందుతుంది. Apache RR310 యొక్క కొత్త కిట్‌లు ఎంత పెద్ద తేడాను కలిగి ఉన్నాయో తెలుసుకోవడానికి మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ వద్ద ఈ మోటార్‌సైకిల్‌ను రైడ్ చేసాము. ఈ కొత్త బైక్ గురించి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

TVS బిల్ట్-టు-ఆర్డర్ ప్లాట్‌ఫాం:

TVS యొక్క 'బిల్ట్-టు-ఆర్డర్ ప్లాట్‌ఫాం' అనేది ఫ్యాక్టరీ స్థాయిలో కస్టమైజేషన్ చేసుకోవడానికి అనుమతించబడుతుంది. ఇది వెబ్‌సైట్ ఆధారిత కాన్ఫిగరేటర్ ద్వారా లేదా TVS ARIVE స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పొందవచ్చు.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

ఈ కాన్ఫిగరేటర్‌లో, కొనుగోలుదారులు మోటార్‌సైకిల్‌ యొక్క గ్రాఫిక్‌లను ఎంచుకోవచ్చు, అంతే కాకుండా పర్సనలైజేషన్ రేస్ నెంబర్ కూడా జోడించవచ్చు. దీనితో పాటు కస్టమర్ యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం డైనమిక్ లేదా రేస్ కిట్‌ను ఎంచుకోవచ్చు. మీరు బైక్ యొక్క అల్లాయ్ వీల్స్ కలర్ కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. కావున మీరు ఇప్పుడు ఫ్యాక్టరీ నుండి మీకు కావలసిన మోటార్‌సైకిల్‌ను పొందవచ్చు. ఇది నిజంగా అద్భుతమైన ఆప్సన్.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

2021 TVS Apache RR 310 డిజైన్ అండ్ స్టైల్:

మేము 2021 TVS Apache RR 310 బైక్ ని ట్రాక్‌పై రైడ్ చేయడానికి ముందు, ఈ మోటార్ సైకిల్ లో కంపెనీ ఎలాంటి డిజైన్ చేసింది అని గమనించాము. మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో మేము ప్రయాణించాల్సిన Apache RR 310 మోటార్‌సైకిల్స్ అన్నీ రేస్ రెప్లికా లివరీలో అలంకరించబడ్డాయి, వీటిని బిల్ట్ టు ఆర్డర్ ప్లాట్‌ఫామ్ ద్వారా పొందవచ్చు.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

'రేస్ రెప్లికా లివరీ' అనేది టీవీఎస్ రేసింగ్ మరియు మోటార్‌స్పోర్ట్ అరేనాలో సాధించిన విజయాలకు గుర్తు. ఇది రెడ్, వైట్ మరియు బ్లూ కలర్ లో వస్తుంది. ఇవి TVS రేసింగ్ యొక్క అఫిషియల్ కలర్స్. మీరు ఈ మోటార్‌సైకిల్ గమనించినట్లయితే, ఇందులోని దాదాపు అన్నిబాడీ పార్ట్స్ ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ మరియు డెకాల్‌లను కలిగి ఉంటుంది.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

కొన్ని డెకల్స్‌లో TVS రేసింగ్, Apache, DOHC మరియు RR 310 వంటివి ఉన్నాయి. హెడ్‌ల్యాంప్ ఫెయిరింగ్‌లో, 'రేసింగ్ సిన్స్ 1982' అని చెప్పే ఈ అద్భుతమైన డెకాల్ ఉంది. రేసర్ కి సరైన రేస్ బైక్ అనుభూతిని ఇవ్వడానికి ఇవన్నీ ఉపయోపడతాయి. అంతే కాకుండా సాధారణ రోడ్లపై అందరి దృష్టిని ఆకర్షించడంలో సహాయపడతాయి. ఇందులో డెకాల్స్ మరియు కలర్ ఫుల్ గ్రాఫిక్స్‌ని గమనించినట్లయితే, ఇవి 2017 లో లాంచ్ అయినప్పటి నుండి చాలా వరకు మార్చబడలేదు అని తెలుస్తుంది.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

ఈ బైక్ యొక్క ముందు భాగంలో ఇప్పటికీ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో అందమైన బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. హెడ్‌ల్యాంప్ కింద రామ్ ఎయిర్ ఇన్టేక్ కూడా అలాగే ఉంచబడింది.హెడ్‌ల్యాంప్ పైన, ఇప్పటికీ పెద్ద విండ్‌స్క్రీన్ పొందుతారు మరియు ఇవన్నీ పెద్ద ఫెయిరింగ్‌లో చక్కగా కలిసిపోయాయి. ఇంజిన్ నుండి వేడి గాలిని బయటకు పంపే వెంట్‌లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంతహీ కాకుండా స్పోర్టి ఫ్యూయల్ ట్యాంక్ కూడా అలాగే ఉంది.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

ఇక్కడ కనిపించే ఫ్రేమ్ మరియు సబ్‌ఫ్రేమ్ ఇప్పటికీ మోటార్‌సైకిల్‌ను మెరుగ్గా కనిపించేలా చేయడంలో ఉపయోగపడుతున్నాయి. ఈ బైక్ యొక్క వెనుక భాగంలో ప్రత్యేకమైన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ ఉంటుంది.

మేము రైడ్ చేసిన ఈ మోటార్‌సైకిల్‌లో రేస్ కిట్‌తో పాటు డైనమిక్ కిట్ కూడా ఉంది. కాబట్టి, ఇది హయ్యర్ సెట్ నూర్డ్ ఫుట్‌పెగ్‌లు, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌తో ఉన్నాయి. ఈ బైక్ మరింత దూకుడుగా ఉండే హ్యాండిల్‌బార్‌ను కూడా పొందుతుంది. ఒక్కమాటలో చేప్పాలంటే కొత్త TVS Apache RR 310 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్:

TVS Apache RR 310 బైక్ అనేది రేస్ కిట్, డైనమిక్ కిట్ మరియు బిల్ట్ టు ఆర్డర్ ప్లాట్‌ఫారమ్ గురించి మాత్రమే కాదు. ఇది ఒక ప్రామాణిక మోటార్‌సైకిల్ కూడా, కావున ఇది అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే అప్డేటెడ్ చేయబడిన ఫీచర్స్ లో ఎక్కువ భాగం TFT ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో కనిపిస్తాయి. 2020 నుండి Apache RR 310 బైక్ 5.2 ఇంచెస్ కలర్ TFT స్క్రీన్‌తో వస్తుంది.

బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

ఇప్పుడు TVS కంపెనీ ఉపయోగకరమైన మరియు ఆచరణాత్మక ఫీచర్లను జోడించి, వాటన్నింటిని కూడా ఒకే స్క్రీన్‌లో చేర్చారు. కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో

 • డిజి డాక్స్
 • డైనమిక్ రెవ్ లిమిట్ ఇండికేటర్
 • డే ట్రిప్ మీటర్
 • ఓవర్ స్పీడ్ ఇండికేషన్, వంటివి ఉన్నాయి.
 • బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

  డిజి డాక్స్ అనేది వాహనం యొక్క డాక్యుమెంట్‌లను సిస్టమ్‌లో నిల్వ చేయడానికి అనుమతించే ఒక ఫీచర్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో నిల్వ చేయవచ్చు. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

  బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

  ఇంజిన్ కోల్డ్-స్టార్ట్ అయినప్పుడు, 'డైనమిక్ రెవ్ లిమిట్ ఇండికేటర్' ఇంజిన్ టెంపరేచర్ పెరిగే కొద్దీ స్క్రీన్‌లో ప్రదర్శించబడే రెవ్-లిమిట్‌ను పెంచుతుంది. ఇది ఇంజిన్ లైఫ్ టైమ్ పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఇంజిన్‌ను నేరుగా పరిమితం చేయదు, కానీ పరిమితి దాటకూడదని స్క్రీన్‌పై రైడర్‌కు సూచిస్తుంది.

  బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

  ఇందులోని 'డే ట్రిప్ మీటర్' అనేది రైడర్ ఒక రోజులో ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి అనుమతిస్తుంది. అదేవిధంగా 'ఓవర్ స్పీడ్ ఇండికేషన్' స్పీడ్ లిమిట్ దాటితే రైడర్‌ను హెచ్చరిస్తుంది. ఈ స్పీడ్ లిమిట్ కూడా రైడర్ ఎంచుకోవచ్చు. కావున ఇది స్పీడ్ రిస్టిక్టెడ్ జోన్‌లో ఎవరైనా రైడింగ్ చేస్తుంటే చాలా ఉపయోగకరమైన ఫీచర్.

  బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

  ఇక డైనమిక్ మరియు రేస్ కిట్ విషయానికి వస్తే,

  డైనమిక్ కిట్:

  • ఫుల్లీ అడ్జస్టబుల్ KYB అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ (20-స్టెప్ రీబౌండ్ & కంప్రెషన్ డంపింగ్; 15 మిమీ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్)
  • ఫుల్లీ అడ్జస్టబుల్ KYB KYB మోనోషాక్ (20-స్టెప్ రీబౌండ్ డంపింగ్; 15-దశల ప్రీ-లోడ్ అడ్జస్టబుల్)
  • బ్రాస్ కోటెడ్ (ఇత్తడి పూత)
  • యాంటీ రస్ట్ చైన్
  • బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

   రేస్ కిట్:

   • రేస్ ఎర్గోనామిక్ హ్యాండిల్‌బార్
   • పెరిగిన ఫుట్‌రెస్ట్ అసెంబ్లీ
   • నర్ల్ ఫుట్‌పెగ్స్ (Knurled Footpegs)
   • Apache RR 310 బైక్ ఈ అప్డేట్స్ మాత్రమే కాకుండా, రెయిన్, అర్బన్, స్పోర్ట్ మరియు రేస్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ బైక్ లోని TFT స్క్రీన్ ప్రతి మోడ్‌కి డిఫరెంట్ థీమ్‌ ఉంటుంది. అంతే కాకుండా రైడింగ్ మోడ్‌ని బట్టి పవర్ మరియు టార్క్‌లో పెరుగుదల/తగ్గుదల ఉంటుంది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    రైడింగ్ ఇంప్రెషన్స్:

    TVS Apache RR 310 రైడింగ్ చేయడానికి అద్భుతమైన బైక్. పెప్పీ ఇంజిన్ మరియు డైనమిక్ రైడింగ్ రోడ్డుపై మరియు రేస్‌ట్రాక్‌లో మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కంపెనీ దాని ప్రత్యర్థి బైకులలాగ అంకితమైన రైడింగ్ పొజిషన్‌ను అందించలేదు, కానీ సుదూర ప్రాంతాలలో ప్రయాణించడానికి అనుమతించింది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    ఒక మోటార్‌సైకిల్‌తో మూడు విభిన్న రైడింగ్ లక్షణాలను కలిగి ఉండవచ్చు, అయితే ఇది మీరు ఎంచుకున్న కిట్‌పై ఆధారపడి ఉంటుంది. డైనమిక్ కిట్ దానితో పాటు, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ని తీసుకువస్తుంది, మరియు వీటిని సరిగ్గా సెటప్ చేసినప్పుడు, ఇది రోడ్డుపై అద్భుతాలు సృష్టిస్తుంది.

    మేము రైడ్ చేసిన మోటార్‌సైకిల్‌లో రేస్ కిట్ మరియు డైనమిక్ కిట్ రెండూ ఉన్నాయి. ఇది రేస్‌ట్రాక్‌లో అద్భుతాలు చేయడానికి ఉద్దేశించబడింది, కావున ఇది మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకోగలిగింది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    మద్రాస్ మోటార్ రేస్‌ట్రాక్‌లో నిర్వహించిన రైడ్ సరళమైనది. ఈ బైక్ లో ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ మరియు కొత్త ప్యాకేజీల యొక్క ఇతర ఫీచర్లను విస్తృతమైన రీతిలో అనుభవించే విధంగా రూపొందించబడింది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    ఈ బైక్ స్టార్ట్ చేయగానే మంచి ధ్వనితో స్వాగతం పలుకుతుంది. అయితే ఈ మోటార్‌సైకిల్ 2017 లో తిరిగి ఉత్పత్తి చేసినప్పుడు, కఠినమైన ధ్వని నుండి కొంత ఉపశమనం కలిగించింది. రివ్‌లు పెరిగే కొద్దీ మోటార్‌సైకిల్ మరింత దూకుడుగా ధ్వనిస్తుంది మరియు ఇది చాలా వేగంగా మారుతుంది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    రేస్ కిట్‌లో లోయర్ హ్యాండిల్‌బార్ మరియు పెంచిన నర్ల్ ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. ఈ రెండు భాగాలు చేసే వ్యత్యాసం అపారమైనది. హ్యాండిల్‌బార్ సుమారు 5-డిగ్రీలు వెనక్కి లాగబడుతుంది మరియు చివర్లలో 8-డిగ్రీల వరకు తగ్గించబడుతుంది. ఇది మరింత టక్-ఇన్ భంగిమను అనుమతిస్తుంది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    పెరిగిన ఫుట్‌పెగ్‌లు మరింత దూకుడుగా ఉండే రైడింగ్ పొజిషన్‌ని మరియు ఫాన్సీ క్నీ డౌన్ చిత్రాలకు మరిన్ని అవకాశాలను అందిస్తాయి. ఈ రేస్ కిట్‌తో, రేస్‌ట్రాక్ కోసం అవసరమైన అంకితమైన రైడింగ్ స్థానం క్రమబద్ధీకరించబడింది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    TVS రేసింగ్ ఛాంపియన్‌షిప్ విజేత రైడర్లయిన 'కెవై అహ్మద్ మరియు జగన్ కుమార్' రెండు ల్యాప్‌ల ద్వారా మమ్మల్ని ట్రాక్‌లోకి తీసుకెళ్లారు. ఈ రెండు ల్యాప్‌లలో, కొత్త RR 310 సస్పెన్షన్ దాని డిఫాల్ట్ సెట్టింగ్‌లో ఉంది. RR 310 బైక్ అధిక వేగంతో మూలలను తీసుకోవడం సులభం అనిపించింది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    రెండు ల్యాప్‌లను పూర్తి చేసిన తర్వాత, మమ్మల్ని తిరిగి పిట్ లేన్ కి తీసుకువచ్చారు, అక్కడ సస్పెన్షన్ తిరిగి ఇవ్వబడింది. రేసింగ్ లో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు రీబౌండ్, కంప్రెషన్ మరియు ప్రీ-లోడ్ కోసం కొన్ని ముందుగా నిర్ణయించిన సెట్టింగ్‌లలో డయల్ చేసి మమ్మల్ని మళ్లీ పంపించారు.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    మేము పిట్ లేన్ నుండి బయటపడినప్పటి నుంచి వాటి మధ్య వ్యత్యాసం తెలిసింది. రేస్ సస్పెన్షన్ సెట్టింగ్‌పై నాలుగు ల్యాప్‌లను పూర్తి చేసిన తర్వాత, మేము మరోసారి పిట్స్‌లోకి ప్రవేశిస్తాము, మరియు సస్పెన్షన్ అడ్జస్టబుల్ ఎంత పెద్ద వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయో ఆలోచించడానికి మాకు సమయం ఇచ్చింది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    మేము తిరిగి ట్రాక్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి, TVS ఇంజనీర్లు ప్రతి రైడర్‌ యొక్క సెట్టింగులను డయల్ చేయడానికి ముందు సస్పెన్షన్‌ని ఎలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, అని అడిగారు. ఈసారి, బైక్ ఖచ్చితంగా అనిపించింది. హ్యాండ్లింగ్ స్పాట్‌లో ఉంది. ప్రీమియం మిచెలిన్ రోడ్ 5 టైర్ల ద్వారా హ్యాండ్లింగ్ మరింత మెరుగుపరచబడింది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    ఇంజిన్ ఎప్పటిలాగే రేస్‌ట్రాక్‌లో అద్భుతంగా పనిచేసింది. ఇది ఉత్పత్తి చేసే 34 బిహెచ్‌పి పవర్ మోటార్‌సైకిల్‌ను వేగవంతం చేస్తుంది. రైడింగ్ అద్భుతమైన అనుభూతిని ఆనందించేలా చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ త్వరగా మారిపోతుంది. స్లిప్పర్ క్లచ్ ఒక మూలలో ప్రవేశించినప్పుడు లైఫ్‌సేవర్ గా ఉంటుంది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    ప్రత్యర్ధులు:

    TVS Apache RR 310 నేరుగా Kawasaki Ninja 300 మరియు KTM RC390 వాటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. KTM India రాబోయే నెలల్లో అప్‌డేట్ చేయబడిన RC390 ని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు, అయితే TVS Apache RR310 తో పోల్చినప్పుడు దీని ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాము. ఇప్పుడు Apache RR 310 యొక్క కస్టమైజేషన్ మరింత మంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

    బైక్‌ రేసింగ్‌లో రారాజు.. '2021 Apache RR310' రివ్యూ; పర్ఫామెన్స్ అదుర్స్

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    కొంతకాలం క్రితం భారతీయ మార్కెట్లో 300 సిసి మోటార్‌సైకిల్‌పై ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను మనం ఊహించలేము. కానీ ఇప్పుడు కొత్త 2021 Apache RR 310 లో ఉన్నాయి. 2021 Apache RR 310 బైక్ నిజంగా రేస్‌ట్రాక్‌లో మనల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బైక్ అధునాతన ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ, ధర కూడా దాని ప్రత్యర్థుల కంటే తక్కువగానే ఉంది. కొత్త 2021 Apache RR 310 చాలా మెరుగ్గా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 tvs apache rr310 review dynamic race kits adjustable suspension performance engine upgrades
Story first published: Thursday, September 2, 2021, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X