2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

భారతీయ మార్కెట్లో పెర్ఫార్మెన్స్ మోటారుసైకిళ్ళకు రోజురోజుకి డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలామంది వాహనతయారీదారులు కొత్త మరియు మరింత సమర్థవంతమైన మోటార్‌సైకిళ్లను తీసుకువస్తున్నారు. ఏదేమైనా ఇటీవల కాలంలో శక్తివంతమైన మరియు మంచి పర్ఫామెన్స్ కలిగిన మోటార్‌సైకిళ్లను పొందడానికి వాహనదారులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఇందులో మొదట 160 సిసి నుండి 200 సిసి వరకు ఉండే మోటార్‌సైకిళ్ళు ఉన్నాయి, ఈ విభాగంలో టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి వంటి మోటారు సైకిళ్ళు వస్తాయి. ఇవన్నీ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తాయి.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

టీవీఎస్ కంపెనీ తన కొత్త అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి బైక్ ని ఇటీవల విడుదల చేసింది. అయితే ఇది మొదట 2005 లో ప్రారంభించబడింది. మొదటి టివిఎస్ అపాచీ 147.5 సిసి, 13.5 బిహెచ్‌పి ఇంజిన్‌తో నడిచింది. ఈ గణాంకాలు ఆ సమయంలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడ్డాయి, కావున ఆ సమయంలో వాహనదారులు చాలా ఆనందించారు.

MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

అయితే దేశీయ మార్కెట్లో కాలక్రమేణా పర్ఫామెన్స్ మోటారుసైకిల్ మార్కెట్ పెరిగింది, ఈ సమయంలోనే మార్కెట్లో మరింత శక్తివంతమైన వాహనాలు విడుదలయ్యాయి. ఈ తరుణంలోనే టీవీఎస్ కూడా అపాచీ శ్రేణిలో మరింత శక్తివంతమైన మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇప్పుడు ఇది 160 సిసి విభాగంలో నిలిచింది.

ఇటీవల మేము ఈ కొత్త అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి బైక్ ను నగరంలో మరియు హైవేపై రైడ్ చేసాము. ఇప్పడు ఈ ఆర్‌టిఆర్ 160 4వి బైక్ యొక్క ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వాటిని గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం..

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

డిజైన్ అండ్ స్టైల్:

2019 లో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చినప్పటినుంచి అపాచీ డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా ఎటువంటి మార్పులు పొందలేదు. అయితే రానురాను కొన్ని మార్పులు సంతరించుకుంది.

అయితే ఇప్పుడు దీని డిజైన్ విషయానికి వస్తే, ఇది అప్ ఫ్రంట్ బూమేరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి పొజిషన్ లైట్లతో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ ఉంటుంది. హెడ్‌ల్యాంప్ యొక్క లో బీమ్ తో పాటు ఈ పొజిషన్ లైట్లు, డే టైమ్ రన్నింగ్ లైట్‌గా పనిచేస్తాయి మరియు ఎల్లప్పుడూ ఆన్ లోనే ఉంటాయి.

MOST READ:నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

హై-బీమ్ యాక్టివేట్ అయినప్పుడు, హెడ్‌ల్యాంప్ యొక్క ఎగువ మరియు దిగువ భాగాలు ఒకేసారి ట్యూన్ చేయబడతాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 యొక్క డిజైన్ మరియు మరియు స్టైల్ లో భాగంగా ఈ మోటారుసైకిల్ అంతటా షార్ప్ లైన్స్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ నుండి చూసినప్పుడు, చూపరులను మరింత ఆకర్షించడానికి అనుకూలంగా ఉండే ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఫ్యూయెల్ ట్యాంక్ అత్యంత డిజైన్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ ముందర కొంత పొడవుగా ఉండే భాగం ఉంటుంది. అంతే కూండా రైడర్ మోకాళ్ల దగ్గర ఫాక్స్ వెంట్స్ మరియు రేసింగ్ ఫ్లాగ్ గ్రాఫిక్స్ సైడ్స్ ఉన్నాయి. ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ ఆఫ్‌సెట్ చేయబడింది, ఫ్యూయెల్ ట్యాంక్ పొడవునా వైట్ కలర్ రేసింగ్ ట్రిప్స్ ఉంటాయి.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి 6-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, ఇవి ఫెటల్ డిస్కులతో కలిసి మరింత స్టైలిష్ గా ఉంటాయి. టీవీఎస్ మోటారుసైకిల్‌ను డబుల్ బారెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో అమర్చారు. ఈ బైక్ యొక్క వెనుక వైపున ఎల్‌ఈడీ టెయిల్ లాంప్ మరియు దిగువన టైర్ హగ్గర్ వంటివి ఉన్నాయి.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన రేసింగ్ రెడ్ కలర్ ఆప్షన్ లో ఉంది. ఎక్కువంది వినియోగదారులు ఈ కలర్ ఎక్కువగా ఇష్టపడతారు. కావున ఈ బైక్ కూడా ఈ కలర్ లోనే ఉంది. రేసింగ్ రెడ్ పెయింట్, వైట్ అండ్ బ్లాక్ గ్రాఫిక్‌లతో కలిపి ఉన్న సైడ్ ప్యానెల్లు ఈ మోటారుసైకిల్ ను చాలా ఆకర్షణీయంగా చేస్తుంది.

MOST READ:సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఇంపార్టెంట్ ఫీచర్స్:

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ మోటారుసైకిల్ కావడంతో దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ను పొందుతుంది, ఇది మెరుగైన పవర్ డెలివరీ మరియు గొప్ప త్రాటల్ రెస్పాన్స్ కలిగి ఉంటుంది. ఇంజిన్ నిజంగా చాలా పెప్పీగా అనిపిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ కొత్త మోటారుసైకిల్ సింగిల్-ఛానల్ ఎబిఎస్‌తో ఉంటుంది. ఈ బైక్ రేస్ ట్రాక్ లో అభివృద్ధి చేయబడిందని మరియు పరీక్షించబడిందని కూడా కంపెనీ పేర్కొంది. ఇందులో ఉన్న LCD స్క్రీన్ ఇన్స్ట్రుమెంటేషన్, అన్ని విధులను నిర్వహిస్తుంది. ఇది టాకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, గేర్ పొజిషన్, టైమ్ మొదలైనవాటిని చూపిస్తుంది. అంతేకాకుండా ఇది గంటకు 0-60కిమీ టైమర్ మరియు మోటారుసైకిల్ క్లాక్ చేసిన టాప్ స్పీడ్‌ను రికార్డ్ చేసే టాప్ స్పీడ్ క్లాకర్‌ను కూడా కలిగి ఉంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి బైక్ బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. కావున ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, 159.7 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 17.38 బిహెచ్‌పి పవర్ మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడుతుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ మోటారుసైకిల్ రేస్ ట్యూన్డ్ ఇంధన ఇంజెక్షన్ సిస్టమ్‌తో వస్తుంది, కావున ఇది మంచి త్రాటల్ రెస్పాన్స్ అందిస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసిన టాప్-స్పీడ్ గంటకు 114 కిమీ అయినప్పటికీ, టెస్ట్ డ్రైవ్ గంటకు 123 కిమీ వేగంతో చేరుతుంది. ఈ 160 సిసి మోడల్ బరువు 147 కేజీల వరకు ఉంటుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

మేము ఈ బైక్ రైడింగ్ సమయంలో కేవలం 4.4 సెకన్లలో గంటకు 0-60 కి.మీ వరకు డాష్ చేయగలిగాము. 'వన్-టచ్' స్టార్టర్ బటన్‌తో ప్రారంభించడం చాలా అద్భుతంగా ఉంది. డబుల్ బారెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఖచ్చితంగా ఇంజిన్‌ను మెరుగుపరుస్తుంది. అయితే ఇది తక్కువ సామర్థ్యం గల ఇంజిన్ అని శబ్దం ద్వారా చెప్పవచ్చు.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

కానీ రైడింగ్ సమయంలో ఇంజిన్ చాలా సున్నితంగా ఉంటుంది. కానీ ఇది సుమారు 4,500 ఆర్‌పిఎమ్ వరకు కఠినంగా ఉంటుంది. స్వీట్ స్పాట్ నిజంగా 4,500 ఆర్‌పిఎమ్ మార్కు పైన ఉంది, ఇక్కడే కఠినమైన ఇంజిన్ శబ్దం పోతుంది. నెమ్మదిగా కదిలేటప్పుడు లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు గ్లైడ్-త్రూ టెక్నాలజీ కూడా చాలా సహాయపడుతుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ బైక్ మొదటి గేర్‌లో గంటకు 7 కి.మీ, రెండవ గేర్‌లో గంటకు 12 కి.మీ మరియు మూడవ గేర్‌లో గంటకు 17 కి.మీ వరకు రైడ్ చేయవచ్చు, ఈ బైక్ నిజంగా చాలా అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

రైడింగ్ అండ్ హ్యాండ్లింగ్:

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి బైక్ రైడింగ్ మరియు హ్యాండింగ్ చేయడానికి అనుకూలమైనదిగా ఉంటుంది. ఇది 2005 లో మొట్టమొదటి అపాచీ 150 యొక్క ఆరంభం నుండి అద్భుతమైన నిర్వహణను అందిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త అపాచీ ఆర్టీఆర్ 160 4 వి కూడా దాని మునుపటి మోడల్ పైన ఆధారపడి ఉంటుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ బైక్ లో బాగా రూపొందించిన చాసిస్ మరియు సస్పెన్షన్‌ను తక్కువ నియంత్రణ బరువుతో కలపడం వల్ల కూడా రైడింగ్ చేయడానికి చాలా సులభంగా మరియు వాహనదారునికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సస్పెన్షన్ షో నుండి టెలిస్కోపిక్ ఫోర్క్ అప్ ఫ్రంట్ మరియు వెనుక వైపు మోనోషాక్ నిర్వహిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఇందులో అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ ఉండటం వల్ల ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ కేవలం రైడర్‌కి మాత్రమే కాకుండా పిలియన్‌కి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ చేయడానికి చాలా సౌకర్యవంతమైన బైక్ ఈ అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, టాప్ డిస్క్ బ్రేకులను వెర్షన్ ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లను అందిస్తుంది. బ్రేకింగ్ ముందు భాగంలో 270 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 200 మిమీ పెటల్ డిస్క్ కలిగి ఉంటుంది. ఇందులో బ్రేకింగ్ అద్భుతమైనది ఎటువంటి పరిస్థితిలో అయినా వెంటనే రెస్పాండ్ అవుతుంది, కావున రైడర్ నిస్సంకోచంగా రైడింగ్ చేయవచ్చు.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ మోటారుసైకిల్ సింగిల్-ఛానల్ ఎబిఎస్ యూనిట్‌తో అమర్చబడి ఉంటుంది మరియు ఇది ఫ్రంట్ ఎండ్ ఎప్పుడూ జారిపోకుండా చూస్తుంది. అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి 17 ఇంచెస్ 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ పై టీవీఎస్ రెమోరా టైర్లను కలిగి ఉంటుంది. ఈ టైర్లు టార్మాక్ మరియు కాంక్రీటుపై అద్భుతమైన స్థాయి పట్టును అందిస్తాయి.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

కంపెనీ ఫ్రంట్ ఎండ్ కోసం అదే బ్రేకింగ్ సెటప్‌తో డ్రమ్ బ్రేక్ అమర్చిన వేరియంట్‌ను కూడా విక్రయిస్తుంది. వెనుక వైపున ఉన్న డిస్క్ బ్రేక్ మాత్రమే 130 మిమీ డ్రమ్ బ్రేక్‌తో భర్తీ చేయబడుతుంది. అయితే దీనిని మేము రైడ్ చేయలేదు, కానీ ఇది బ్రేకింగ్ కెపాసిటీ అద్భుతంగానే ఉంటుందని భావిస్తున్నాము.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

వేరియంట్స్, కలర్స్ & ప్రైస్:

టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4 వి బైక్ మూడు కలర్ ఆప్సన్లలో లభిస్తుంది, అవి నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మరియు రేసింగ్ రెడ్ కలర్స్. ఈ మూడు కలర్ బైక్స్ ధరలు ఒకే విధంగా ఉంటాయి. ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

అందులో ఒకటి వెనుకవైపు 130 మి.మీ డ్రమ్ బ్రేక్‌తో వచ్చే డ్రమ్ బ్రేక్ వేరియంట్ మరియు రెండవది వెనుకవైపు 200 ఎంఎం పెటల్ డిస్క్ ఉన్న డిస్క్ బ్రేక్ వేరియంట్. ఇందులో మొదట వేరియంట్ ధర 1,06,215 రూపాయలు కాగా, రెండవ వేరియంట్ ధర 1,09,265 రూపాయల (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
2021 TVS Apache RTR 160 4V Detailed Review. Read in Telugu.
Story first published: Thursday, April 15, 2021, 12:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X