ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఆంపియర్ వెహికల్స్ గత ఏడాది డిసెంబరులో సరికొత్త రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆంపియర్ రియో ఎంట్రీ లెవల్ లో రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.

సిటీలో తక్కువ దూరాలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా.. ఆటోలు, క్యాబ్‌ల మీద ఆధారపడకుండా వేళ్లేందుకు సహాయపడుతుంది. ఎంట్రీ లెవల్ పెట్రోల్ స్కూటర్లు, స్టైల్, పర్ఫామెన్స్ మరియు ధర వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను తయారు చేశారు. దీన్ని కొనేముందు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇవాళ్టి ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చదవాల్సిందే..!

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బెంగళూరులో సుమారుగా వారం రోజుల పాటూ నడిపి చూశాము. రియల్ లైఫ్‌లో దీని పర్ఫామెన్స్ ఎలా ఉందో గమనించాము. నేటి రివ్యూలో ఈ స్కూటర్ గురించి మా స్పష్టమైన అభిప్రాయం క్లుప్తంగా మీ కోసం..

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

డిజైన్ మరియు స్టైల్

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ సింపుల్ అండ్ కాంపాక్ట్ కొలతలు గల స్టైలిష్ లుకింగ్ స్కూటర్. ఫ్రంట్ నుండి చూస్తే, సింపుల్‌ లుక్‌లో పలుచగా ఉంటుంది. ఫ్రంట్ ఏప్రాన్ మీద షార్ప్ లుకింగ్ యాంగులర్ టర్న్ ఇండికేటర్స్ ఎంతో అట్రాక్టివ్‌గా ఉన్నాయి.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

హ్యాండిల్‌ బార్ నుండి కాస్త కిందకు వస్తే, పెద్ద పరిమాణంలో ఉన్న స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, మిలమిలా మెరిసే బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ స్కూటర్‌కు మంచి క్యారెక్టర్ తీసుకొచ్చాయి.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్లిమ్ముగా ఉంది. సైడ్ ప్యానల్స్ మీద ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

స్కూటర్ అడుగు భాగానికి వస్తే, పూర్తి స్థాయిలో బ్లాక్ కలర్ ఫినిషింగ్ గమనించవచ్చు. పిలియన్ రైడర్ గ్రాబ్ హ్యాండిల్స్, 10-ఇంచుల అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్ కలర్‌లో వచ్చాయి. రెడ్ అండ్ బ్లాక్ కలర్ హైలెట్స్ రియో ఎలైట్ స్కూటర్‌ను స్టైలిష్‌గా తీర్చిదిద్దాయి.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

స్కూటర్‌ను దూరం నుండి గమనిస్తే, ఫుట్ బోర్డు కింద ఇంజన్ స్థానంలో బ్యాటరీ ప్యాక్ గమనించవచ్చు. ఫుట్ బోర్డు కూడా ఎంతో విశాలంగా ఉంది. రైడర్‌కు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌ను చక్కటి ప్రదేశంలో అందించారు.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సింగల్ పీస్ లాంగ్ సీట్ అందించారు. దీని మీద ఇద్దరు ఎంతో సౌకర్యంగా ప్రయాణించవచ్చు. సీటుకు చివర్లో సింగల్ పీస్ హ్యాండిల్ కూడా అందించారు. ఎలక్ట్రిక్ మోటార్‌ను రియర్‌ వీల్‌కు అనుసంధానం చేస్తూ చక్రానికి పక్కనే ఏర్పాటు చేశారు. రియర్ డిజైన్ కూడా ఎలాంటి అనవసరపు డిజైన్ ఎలిమెంట్స్ లేకుండా సింపుల్‌గా డిజైన్ చేశారు.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

పవర్, పర్ఫామెన్స్ మరియు హ్యాండ్లింగ్

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 250-వాట్ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ కలదు, 48V-2-Ah లెడ్-యాసిడ్ లేదా 48V-24Ah లిథియం-అయాన్ బ్యాటరీ నుండి మోటార్‌కు విద్యుత్ అందుతుంది.

అయితే, మేము లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ గల స్కూటర్‌ను రివ్యూ కోసం నడిపాము. ఇందులోని బ్యాటరీలను బయటకి తీయలేము.. ఇంట్లో లేదా బయటి సర్వసాధారణంగా ఉండే త్రీ-పాయింట్ ప్లగ్ ద్వారా డైరక్టుగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఆపియర్ రియో ఎలైట్ లిథియం-అయాన్ బ్యాటరీ వెర్షన్ పరీక్షిస్తున్నపుడు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 5 నుండి 6 గంటల సమయం పట్టింది. అయితే, లెడ్-యాసిడ్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 8 నుండి 10 గంటల సమయం పడుతుంది.

రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ అవుట్‌పుట్ వివరాలను ఆంపియర్ వెహికల్స్ వెల్లడించలేదు. ఏదేమైనప్పటికీ, 250-వాట్ కెపాసిటీ ఎలక్ట్రిక్ మోటార్ గల ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25కిలోమీటర్లు. ఇందులో ఎలాంటి రైడింగ్ మోడ్స్ కూడా రాలేదు.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నపుడు రియల్ కండీషన్స్‌లో సింగల్ ఛార్జింగ్ మీద 50కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. లోడ్ కెపాసిటీ 75కిలోలు, గరిష్టంగా 120కిలోల వరకూ బరువును లాగగలదు.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

అతి ముఖ్యమైన అంశం, పర్ఫామెన్స్ మరియు హ్యాడ్లింగ్ విషయానికి వస్తే, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ గల స్కూటర్‌ను సుమారుగా 68కిలోమీటర్ల పాట రైడ్ చేశాము. సిటీ ట్రాఫిక్‌‌లో ఉన్నపుడు అత్యంత సులభంగా ట్రాఫిక్‌ను దాటిపోవచ్చు.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

లైట్ వెయిట్ స్కూటర్ కావడంతో ప్రతి కార్నర్‌లో వీలైనంత పవర్ సాధ్యమయ్యింది. కొలతల పరంగా చాలా సన్నగా ఉండటంతో ఇరుకైన ప్రదేశాలు మరియు ట్రాఫిక్‌లో కూడా చక్కగా దూసుకుపోవచ్చు. యాక్సిలరేషన్ రెస్పాన్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంది.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

సీట్ ఎంతో సాఫ్ట్‌గా మరియు సౌకర్యంగా ఉంది. ఎత్తైన ప్యాసింజర్లు కూడా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. లాంగ్ రైడింగ్‌తో వెళుతున్నపుడు కాళ్లు, మోకాళ్ల వద్ద ఎలాంటి నొప్పి లేకుండా అన్ని రకాల హైట్ ఉన్న ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఫుట్‌బోర్డు డిజైన్ చాలా హెల్ప్ అవుతుంది.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. సస్పెన్షన్ కొద్దిగా హార్డ్‌గా అనిపించింది, అంటే చిన్న చిన్న గుంతలు, స్పీడ్ బంపర్ల వద్ద ఈ ఫీల్ గుర్తించవచ్చు.

బ్రేకింగ్ కోసం రెండు చక్రాలకు 110మిమీ చుట్టుకొలత గల డ్రమ్ బ్రేకులు అందించారు. లైట్ వెయిట్ స్కూటర్‌కు ఈ బ్రేకింగ్ సరిపోతుంది. అయితే, డ్రమ్ బ్రేకులు ఇంకాస్త పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీలను ఫుట్‌బోర్డు కింద అమర్చినప్పటికీ, అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. భూమి నుంచి 130మిమీ ఎత్తు గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. దీంతో ఎలాంటి ఎత్తు పల్లాలనైనా సునాయసంగా అధిగమిస్తుంది.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఫీచర్లు, రంగులు మరియు లభ్యత

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎన్నో ఫీచర్లు వచ్చాయి. అతి తక్కువ ధరల శ్రేణిలో నమ్మశక్యంగాని ఫీచర్లు ఉన్నాయి. పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, స్టైలిష్ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, USB-ఛార్జింగ్ పోర్ట్ మరియు విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఆంపియర్ వెహికల్స్ తమ రియో ఎలైట్ స్కూటర్‌ను నాలుగు విభిన్న రంగుల్లో అందిస్తోంది. అవి, గ్లోజీ రెడ్, గ్లోజీ బ్లాక్, గ్లోజీ బ్లూ మరియు గ్లోజీ వైట్. ప్రస్తుతానికైతే, రియో ఎలైట్ బెంగళూరులో మాత్రమే లభిస్తోంది, త్వరలో ఇతర నగరాల్లో కూడా లాంచ్ చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వారం రోజుల పాటు నడిపిన తర్వాత ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మా అభిప్రాయం ఏమిటంటే.. సిటీ అవసరాల కోసం ఇది బెస్ట్ ఛాయిస్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ కూడా. మైలేజ్ రేంజ్ తక్కువ కావడంతో డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.

ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేసిక్ మోడల్ ధర రూ. 45,099 ఎక్స్-షోరూమ్(బెంగళూరు)గా ఉంది. ఇంటి నుండి కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఇది అత్యుత్తమ ఎంపిక. స్కూటర్ నడపడం తెలియని వారు, ఫస్ట్ టైమ్ స్కూటర్ కొంటున్నారు మరియు లేడీస్ కూడా దీనిని ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Ampere Reo Elite Electric Scooter Review: A Starter-Pack To The Electric Scooter Segment In India. Read in Telugu.
Story first published: Saturday, February 1, 2020, 12:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X