అప్రిలియా ఎస్ఆర్ 125 రివ్యూ: ప్రతి స్పోర్టివ్ రైడర్ స్కూటర్

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లోకి రెండేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ఇటాలియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం అప్రిలియా స్కూటర్ల సెగ్మెంట్లో స్పోర్టివ్ మోడళ్లను విడుదల చేస్తోంది. 2016 ఆటో ఎక్స్ పో 2016 వేదిక మీద మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన ఎస్ఆర్ 150(SR 150) స్కూటర్‌ను తాజాగా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

తరువాత తమ మొట్టమొదటి స్కూటర్ విజయంతో ఎస్ఆర్ 150 స్కూటర్ యొక్క స్పోర్టివ్ వెర్షన్‌లో 2017లో లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో ఉన్న స్కూటర్లలో అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన స్కూటర్ అప్రిలియా ఎస్ఆర్150.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఇతర పోటీదారుల ఉత్పత్తులకు ఎప్పటికప్పుడు గట్టి పోటీనిస్తోంది. ఇటాలియన్ దిగ్గజం అప్రిలియా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌ పో 2018లో సరికొత్త ఎస్ఆర్ 125(SR 125) స్కూటర్‌ను విడుదల చేసింది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేసి, మా అభిప్రాయాన్ని పాఠకులతో పంచుకునే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్ తెలుగుకు కల్పించింది. అప్రిలియా ఎస్ఆర్ 125 రివ్యూ రిపోర్ట్‌లో స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

కొత్తదనం ఏమిటి ?

మొదట్లో ఎస్ఆర్ 125 స్కూటర్‌‌ను ఎస్ఆర్ 150 అనుకొని తికమకపడతారు. ఇందుకు ప్ర ధాన కారణం, రెండు స్కూటర్లు డిజైన్ పరంగా చూడటానికి అచ్చం ఒకేలా ఉంటాయి. కానీ, 125 బ్యాడ్జింగ్ చూసేంత వరకు నమ్మరు.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

విడి భాగాలు డిజైన్, స్టైలింగ్ అన్నింటి పరంగా ఎస్ఆర్ 150 స్కూటర్‌నే పోలి ఉంటుంది. రెండింటి మధ్య ఉన్న ఉన్న తేడా వేరు వేరు ఇంజన్‌లు, బాడీ డీకాల్స్ మరియు కలర్ ఆప్షన్స్. బ్లూ మరియు సిల్వర్ రెండు విభిన్న రంగుల్లో ఎస్ఆర్ 125 లభిస్తోంది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్‌లో 14-అంగుళాల బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, విశాలమైన మరియు పటిష్టమైన గ్రిప్ గల వి రబ్బర్ టైర్లు ఉన్నాయి. ఇవి, అత్యంత కఠినమైన మలుపులను కూడా అత్యంత ధైర్యంతో ఎదుర్కోగలవు. ఎస్ఆర్125 స్కూటర్ ఓవరాల్ హ్యాండ్లింగ్ జెంట్స్ మరియు లేడీస్‌కు గొప్ప రైడింగ్ అనుభూతినిస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్‌లో అత్యుత్తమ హ్యాండ్లింగ్ కోసం ధృడమైన సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. అయితే, రోజంతా నాన్-స్టాప్‌గా స్కూటర్‌ను ఉపయోగించే వారికి ఎస్ఆర్ 125 ఎంపిక కాస్త మంచిది కాదని చెప్పవచ్చు. స్పీడ్ బంప్స్ ఎక్కువగా ఉన్న రోడ్ల మీద వెళితే నడుము నొప్పులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

భారత్‌లో సీటుకు వెనుక వైపున గ్రాబ్ రెయిల్ లేకుండా వచ్చిన ఏకైక మరియు మొట్టమొదటి స్కూటర్ అప్రిలియా ఎస్ఆర్125. గ్రాబ్ రెయిల్ లేనందుకు సీటుకు మధ్యలో ప్రత్యేకంగా స్ట్రాప్ ఇవ్వడం జరిగింది. పిలియన్ రైడర్ దీనిని పట్టుకోవచ్చు. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, ఎస్ఆర్150లో ఉన్న అదే ఇంస్ట్రుమెంట్ ప్యానల్ ఎస్ఆర్125లో వచ్చింది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

స్విచ్ గేర్ నాణ్యత ఆశించిన మేర లేదు, కానీ, ఇందులో ఉపయోగించిన ప్లాస్టిక్ మరీ అంత చెడ్డది అయితే కాదు. అప్రిలియా ఎస్ఆర్125 నీలం రంగులో బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు ఎరుపు రంగు బాడీ గ్రాఫిక్స్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది నిజంగా ఫార్మాలా వన్ మరియు మోటోజిపి రేసుల్లో ఉపయోగించిన స్కూటర్లను గుర్తుకు చేసింది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

అప్రిలియా ఎస్ఆర్125 ఇంజన్

సాంకేతికంగా ఎస్ఆర్125 స్కూటర్‌లో గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ 125సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇదే ఇంజన్ వెస్పా 125 ఎస్ స్కూటర్‌లో కూడా ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇది 9.5బిహెచ్‌పి పర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 10.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

అధిక ఇంజన్ వేగం, తేలికపాటి ఛాసిస్ మరియు సివిటి గేర్‌బాక్స్ వంటివి ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వడంలో సహకరిస్తారు. ఇది అక్షరాల నిజం, స్పీడ్ విషయానికి వస్తే, అప్రిలియా ఎస్ఆర్125 గరిష్ట వేగం గంటకు 115కిమీలుగా ఉంది. ఇంజన్ స్పీడ్ చాలా బాగానే ఉంటుంది, కానీ ఇంజన్ వేగం పెరిగేది అదుర్లు కుదుపులు బయటపడతాయి.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

బ్రేకింగ్ విధుల కోసం, ముందు వైపున డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది. ఎస్ఆర్150 స్కూటర్‌లో కూడా ఇదే బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. స్కూటర్ రైడ్ మొదట్లో బాగానే ఉంటుంది. కానీ, బ్రేకుల వేసేటపుడు మనం అనుకున్నదానికంటే చాలా తొందరగా ఆగుతుంది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ ధర రూ. 65,315 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. ఎస్ఆర్125 కూడా ఈ సెగ్మెంట్లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలిచింది. విపణిలో ఉన్న ఇతర 125 స్కూటర్లు సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, వెస్పా 125 మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

అప్రిలియా ఎస్ఆర్125 మరియు ఎస్ఆర్150 స్కూటర్లలో ఏది ఎంచుకోవాలనే అంశాన్ని మీకే వదిలేస్తున్నాను. శక్తివంతమైన, స్టైలిష్ మరియు స్పోర్టివ్ స్కూటర్ కావాలంటే 5,000 రుపాయలు ఎక్కువే అయినా పర్లేదు అనుకుంటే ఎస్ఆర్150 పర్ఫామెన్స్ స్కూటర్‌ను ఎంచుకోవచ్చు. ఐదు వేలు తగ్గుతుంది కదా అనుకుంటే ఎస్ఆర్125 ఎంచుకోవచ్చు.

అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ 150 (TVS NTorq 150 ) స్కూటర్ ఫస్ట్ రైడ్ రివ్యూ తెలుగులో

హోండా గ్రాజియా (Honda Grazia) ఫస్ట్ రైడ్ రివ్యూ: ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?

Most Read Articles

English summary
Read In Telugu: Aprilia SR125: First Ride Review — Sportily Marvellous In The Air
Story first published: Saturday, March 10, 2018, 16:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X