బజాజ్ డామినర్ 400 Vs కెటిఎమ్ 390 Vs రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్

Written By:

బజాజ్ తాజాగ విడుదల చేసిన డామినర్ 400 టూవీలర్ మార్కెట్లో మంచి ఉత్సాహాన్ని రేపిందని చెప్పవచ్చు. బజాజ్ పల్సర్ సిరీస్ తరహాలో తమ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ డామినర్ 400ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ మరియు కెటిఎమ్ మాత్రమే ఉన్న సెగ్మెంట్లోకి ఇప్పుడు డామినర్ 400 బైకు ఎంటర్ అయ్యింది.

ఈ మూడింటిలో ఏది బెస్ట్ అని తేల్చే ఈ కథనంలో వీటి గురించి పూర్తి వివరాలు క్లుప్తంగా...

బజాజ్ డామినర్ 400

కెటిఎమ్ 390 మోడల్‌తో పోల్చినపుడు ఈ డామినర్‌లో కెటిఎమ్‌లో వినియోగించిన ఇంజన్‌ కలదు. అత్యంత శక్తివంతమైన ఈ ఇంజన్ ఇప్పుడు స్పోర్ట్స్ క్రూయిజర్ స్టైల్లో పరిచయం అయ్యింది. ఇది కాస్త రాయల్ ఎన్ఫీల్డ్ కు ఇండియన్ రోడ్ల మీద గట్టి పోటీని సృష్టించనుంది. మరి ఈ మూండింటిలో ఏ బైకు ఉత్తమమో చూద్దాం రండి.

బజాజ్ డామినర్ 400

బజాజ్ డామినర్ 400

కోపంగా ఉన్నటువంటి ఆకారంలో కండలు తిరిగిన శరీరాకృతితో ధృడంగా ఉంటుంది ఈ డామినర్ 400. ఇందులో స్టైలింగ్ పరంగా చాలా వరకు పల్సర్ లక్షణాలున్నాయి. అయితే పల్సర్‌తో పోల్చితే చాలా వరకు పోలిక ఉండదు. ఇది ఒక స్పోర్ట్స్ క్రూయిజర్ ఉత్పత్తి. దూర ప్రాంత జర్నీలకు అనువుగా ఉండే విధమైన సీట్ డిజైన్ మరియు అప్ రైట్ హ్యాండిల్ బార్ కలదు.

కెటిఎమ్ 390 డ్యూక్

కెటిఎమ్ 390 డ్యూక్

కెటిఎమ్ ఈ 390 డ్యూక్ బైకును పూర్తిగా స్పోర్ట్స్ శైలిలో అభివృద్ది చేసింది. డిజైన్ పరంగా ఇండియన్ రోడ్లలోని అనేక పర్ఫామెన్స్ బైకులను డిజైన్ పరంగా ఈ కెటిఎమ్ 390 డ్యూక్ తీవ్రంగా డామినేట్ చేస్తోంది. పనితీరులో అసంతృప్తి లేకుండా మలుపుల్లో చక్కగా రైడింగ్ చేసేందుకు తక్కువ వీల్‌బేస్ కలదు. ప్రస్తుతం దీని ఇండియన్ రోడ్లు రేస్ ట్రాక్‌లుగా మారిపోయాయని చెప్పవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్

కోడి గ్రుడ్డు ఆకారంలో ఉన్న ఇంధన ట్యాంకుతో ఇది రెట్రో (పాత కాలం నాటి రూపాన్ని) కలిగి ఉంది. లోహపు మెటల్ గార్డ్స్, సైడ్ బాక్స్, గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు సింగల్ సీటు ద్వారా ఇది పూర్తిగా రెట్రో రూపాన్ని సంతరించుకుంది. ఈ క్రూయిజ్ శ్రేణి బైకు మీద రైడింగ్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. బహుశా ఇదే కారణం చేత కాబోలు ఇండియన్ విపరీతంగా ఈ రెట్రో మోడళ్లను ఎంచుకుంటున్నారు.

డిజైన్ పరంగా రేటింగ్

డిజైన్ పరంగా రేటింగ్

డిజైన్ అంశాల ఆధారంగా ఇవ్వబడిన రేటింగ్

  • బజాజ్ డామినర్ 400 7.5/1
  • కెటిఎమ్ 390 డ్యూక్ 8/10
  • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 8/10
బజాజ్ డామినర్ 400 ఫీచర్లు

బజాజ్ డామినర్ 400 ఫీచర్లు

సరైన ధరకు అత్యుత్తమ ఫీచర్లను తమ డామినర్ 400 బజాజ్ అందించింది. ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్, బిఎస్-IV ఇంజన్‌తో పాటు ఈ ఫీచర్‌ను కూడా తప్పనిసరి చేయనుంది ప్రభుత్వం. డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 43ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ షాక్ అబ్జార్వర్లు, ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేకులతో పాటు పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కంట్రోల్ కలదు.

కెటిఎమ్ 390 డ్యూక్ లోని ఫీచర్లు

కెటిఎమ్ 390 డ్యూక్ లోని ఫీచర్లు

కెటిఎమ్ ఈ 390 డ్యూక్ బైకు మొత్తాన్ని ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద నిర్మించింది. ఇందులో డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు, అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, వెనుక వైపున అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల మోనో షాక్ అబ్జార్వర్ మరియు అత్యుత్తమ పటిష్టత్వాన్ని కలిగి ఉండే మెట్జలర్ టైర్లు కలవు.

 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఫీచర్లు

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఫీచర్లు

ఇందులో ముందు వైపున డిస్క్ బ్రేకు, అనలాగ్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రిక్ మరియు కిక్ స్టార్టర్, కార్బోరేటర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పన్షన్ మరియు డ్యూయల్ గ్యాస్ సస్పెన్షన్ వ్యవస్థ కలదు. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వలేకపోయింది.

ఫీచర్ల పరంగా రేటింగ్

ఫీచర్ల పరంగా రేటింగ్

  • బజాజ్ డామినర్ 400 8/10
  • కెటిఎమ్ 390 డ్యూక్ 8/10
  • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 7.5/10
బజాజ్ డామినర్ 400

బజాజ్ డామినర్ 400

బజాజ్ డామినర్ 400 లో కెటిఎమ్ వారి 373.2సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇందులోని శక్తివంతమై సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

బజాజ్ ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇది కేవలం 8.23 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 148కిలోమీటర్లుగా ఉంది.

కెటిఎమ్ 390 డ్యూక్

కెటిఎమ్ 390 డ్యూక్

390 డ్యూక్ స్పోర్ట్స్ లుక్ గల బైకులో 373.2సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 43బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. దీని మొత్తం బరువు 149 కిలోలుగా ఉంది. బజాజ్ డామినర్ 400 తో పోల్చుకుంటే 33 కిలోలు తక్కువ బరువు ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ వివరాలు

డామినర్ మరియు కెటిఎమ్ ఒక తరహా ఇంజన్‌లను కలిగి ఉంటే రాయల్ ఎన్పీల్డ్‌ది మరో కోణం అని చెప్పాలి. పాత కాలం నాటి దీని డిజైన్ మరియు ఇందులోని ఇంజన్‌ వీటి విజయానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ఈ క్లాసిక్ బైకు ప్రస్తుతం 346సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇంజన్, గేర్‌బాక్స్ మరియు పవర్ పరంగా రేటింగ్స్

ఇంజన్, గేర్‌బాక్స్ మరియు పవర్ పరంగా రేటింగ్స్

  • బజాజ్ డామినర్ 400 7.5/10
  • కెటిఎమ్ 390 డ్యూక్ 8/10
  • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 8/10
బజాజ్ డామినర్ 400 ధర వివరాలు

బజాజ్ డామినర్ 400 ధర వివరాలు

బజాజ్ తమ డామినర్ 400 బైకు ఎబిఎస్ రహిత వేరియంట్ ధర రూ. 1.36 లక్షలు మరియు ఏబిఎస్ మోడల్ ధర రూ. 1.50 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

కెటిఎమ్ 390 డ్యూక్ ధర వివరాలు

కెటిఎమ్ 390 డ్యూక్ ధర వివరాలు

కెటిఎమ్ 390 డ్యూక్ వేరియంట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.96 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఇందులో ఏబిఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్

క్లాసిక్ శ్రేణిలోని 350 మోడల్ ధర రూ. 1.31 లక్షలు అదే విధంగా క్లాసిక్ 500 మోడల్ ధరల శ్రేణి 1.68 నుండి 1.79 లక్షల మధ్య ఉంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

తీర్పు

తీర్పు

ప్రస్తుతం పోటీగా ఉన్న ఈ మూడింటిలో కెటిఎమ్ 390 డ్యూక్ ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. అయితే ధర ఎక్కువ అనే ఆలోచన వచ్చినపుడు బజాజ్ డామినర్ 400 మరింత ఉత్తమం అనవచ్చు. రూ 1.50 లక్షల ప్రారంభ ధరతో ఏబిఎస్ మరియు విభిన్న ఫీచర్లతో నిండి ఉంది. కెటిఎమ్‌ డ్యూక్ 390 మోడల్‌కు ప్రత్యామ్నాయం ఎప్పటికీ డామినర్ 400 అను చెప్పవచ్చు.

తీర్పు

కెటిఎమ్ మరియు బజాజ్ వారి ఉత్పత్తులకు అత్యంత భిన్నమైనది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వారి క్లాసిక్. దీని డిజైన్ మరియు పనితీరు వంటి అంశాల పరంగా ప్రత్యేక కస్టమర్లు ఉన్నారు. మార్కెట్లో దాదాపు ఒకే సెగ్మెంట్లో ఉన్నప్పటికీ క్లాసిక్ ఎంపికదారులు ముమ్మాటికీ భిన్నమైనవారు. కాబట్టి హుందాతనాన్ని కోరుకునే వారి క్లాసిక్ ని నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.

 
English summary
Bajaj Dominar 400 vs KTM 390 vs Royal Enfield Classic — Who Will Dominate?
Please Wait while comments are loading...

Latest Photos