India
YouTube

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ పల్సర్ (Bajaj Pulsar), దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత మార్కెట్లో విడుదలై, బజాజ్ ఆటో కంపెనీకి ఓ గేమ్ ఛేంజర్‌ మోడల్ గా మారిన పాపులర్ టూవీలర్ బ్రాండ్ ఇది. పల్సర్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి రాక ముందు వరకు.. పల్సర్ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తూ తిరిగే ఓ న్యూట్రాన్ నక్షత్రం. అయితే, బజాజ్ పల్సర్ మార్కెట్లో ప్రారంభించబడిన తర్వాత, ఈ పేరు శాశ్వతంగా మోటార్‌సైక్లింగ్‌తో ముడిపడిపోయింది. బజాజ్ పల్సర్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటిగా మారింది.

ఈ 20 ఏళ్ల కాలంలో బజాజ్ ఆటో తమ పల్సర్ బ్రాండ్ లైనప్ లో అనేక కొత్త వెర్షన్లను మరియు వేరియంట్లను విడుదల చేస్తూ వచ్చింది. నిజానికి ఇప్పుడు బజాజ్ ఆటో నుండి అత్యధికంగా అమ్ముడవుతున్నవి కూడా ఈ పల్సర్ బ్రాండ్ టూవీలర్లే. సంవత్సరాలుగా, అనేక కొత్త పల్సర్ మోడల్‌లు ప్రారంభించబడ్డాయి మరియు ఈ మోటార్‌సైకిళ్లన్నీ కూడా వాటికవే స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. అయితే, 2021 అక్టోబర్‌లో పల్సర్ బ్రాండ్ లో అతిపెద్ద మార్పు వచ్చింది. ఆ సమయంలో బజాజ్ ఆటో భారత మార్కెట్లో పల్సర్ ఎన్250 మరియు పల్సర్ ఎఫ్250 బైక్ లను విడుదల చేసింది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

కాగా, ఇప్పుడు ఈ పెద్ద పల్సర్ బైక్ లను అనుసరించి కంపెనీ జూన్ 24, 2022 వ తేదీన చిన్న సామర్థ్యం గల పల్సర్‌ను విడుదల చేసింది. దాని పేరే బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160). కంపెనీ దీనిని మునుపటి పల్సర్ ఎన్ఎస్160 (PUlsar NS160)కి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చినట్లు ప్రచారం చేయబడింది. భారతదేశంలో ప్రస్తుతం అత్యంత పోటీతత్వ మోటార్‌సైక్లింగ్ సెగ్మెంట్‌లలో ఈ 160సీసీ సెగ్మెంట్ కూడా ఒకటి. ఈ లేటెస్ట్ బజాజ్ పల్సర్ ఎన్160 బైక్ ని మేము ఇటీవలే పూనే రోడ్లపై టెస్ట్ రైడ్ చేయడం జరిగింది. మరి ఈ మోటార్‌సైకిల్ ఏ సెగ్మెంట్‌కి సంబంధించినది? ఇది నిజంగా పల్సర్ ఎన్ఎస్160కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? దీనిని రైడ్ చేయడం ఎలా ఉంటుంది? వంటి అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ పల్సర్ ఎన్160 - డిజైన్ మరియు స్టైల్

ముందు చెప్పుకున్నట్లుగా పెద్ద పల్సర్ ఎన్250 నుండి స్పూర్తి పొంది ఈ చిన్న పల్సర్ ఎన్160ని తయారు చేశారు. ఈ రెండింటినీ పక్కపక్కనే ఉంచి చూస్తే, వీటిలో ఏది ఏ మోడల్ అని గుర్తు పట్టడం కష్టం. ఎందుకంటే ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే విధంగా కనిపిస్తాయి, వీటి డిజైన్ మరియు స్టైలింగ్‌లో పెద్ద తేడాలు లేవు. ప్లస్ పాయింట్ ఏంటంటే, పల్సర్ ఎన్160 కొనుగోలుదారులు పెద్ద క్వార్టర్-లీటర్ (250సీసీ) పల్సర్ మాదిరిగా ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా అదే డిజైన్‌ను తక్కువ ధరకే పొందుతారు, కాబట్టి కేవలం డిజైన్ కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వారు ఈ చిన్న పల్సర్ ను ఎంచుకోవచ్చు.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ పల్సర్ ఎన్160 ముందు భాగంలో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు కనుబొమ్మల తరహా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో ప్రత్యేకమైన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. పల్సర్ 250 బైక్ మాదిరిగానే పల్సర్ ఎన్160 కూడా విశిష్టమైన బాడీలైన్స్ మరియు అదే అగ్రెసివ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ కూడా పల్సర్ ఎన్250 నుండే సేకరించబడ్డాయి.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

పల్సర్ ఎన్160 హెడ్‌ల్యాంప్ యూనిట్ పైభాగంలో స్లిమ్ గా ఉండే ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉంటుంది మరియు ఇది పల్సర్ ఎన్250లో కూడా కనిపిస్తుంది. ఈ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో కూడా ఎలాంటి మార్పులు లేవు. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెడ్‌ల్యాంప్ ఒకే యూనిట్‌గా పెద్ద పల్సర్ ఎన్250తో సమానంగా ఉన్నందున ఇది ముందు వైపు నుండి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అయితే, రైడర్ కోణం నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ దాదాపుగా ఇన్ఫినిటీ డిస్‌ప్లే లాగా ఉన్నందున ఇది మరింత మెరుగ్గా కనిపిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు చక్కగా కనిపిస్తాయి మరియు ఇంధన ట్యాంక్‌పై బూడిద రంగు గ్రాఫిక్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మేము ఈ టెస్ట్ డ్రైవ్ లో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్‌ను నడిపాము మరియు ఇది కేవలం ఒక కలర్ ఆప్షన్‌ (బ్రూక్లిన్ బ్లాక్)లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ లోని వివిధ భాగాలలో సిల్వర్ అండ్ రెడ్ గీతలతో ఆసక్తికరమైన గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. పల్సర్ ఎన్160 మరియు N250 రెండు మోడళ్లను వేరు చేసే ఏకైక మార్పు కాదు వెనుక ప్యానెల్‌లోని బ్యాడ్జింగ్ మాత్రమే.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

వెనుకవైపు కూడా, మోటార్‌సైకిల్ క్లియర్-లెన్స్ తో కూడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌ ను కలిగి ఉంటుంది, ఇది కూడా పల్సర్ ఎన్250 మాదిరిగానే డిజైన్ ఎలిమెంట్స్ ను పొందుతుంది. నంబర్ ప్లేట్ మౌంట్‌లు, ఇండికేటర్లు మరియు రిఫ్లెక్టర్‌లు అన్నీ ఒకే యూనిట్‌పై అమర్చబడి ఉంటాయి. ఈ బైక్ లోని 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వాటి ప్రత్యేకమైన స్పోక్ ప్యాటర్న్‌తో ఈ మోటార్‌సైకిల్‌కు మరింత అందాన్ని తెచ్చి పెడుతాయి. డిజైన్ మరియు స్టైలింగ్ విభాగంలో ఇంజన్ కూడా కీలక పాత్రను పోషిస్తుంది. సిలిండర్‌లోని శీతలీకరణ రెక్కలు (కూలింగ్ వింగ్స్), ఎగ్జాస్ట్ అండర్‌బెల్లీ మౌంట్‌లో ఉన్నప్పుడు మెరుగైన శీతలీకరణలో సహాయపడేందుకు వేవ్ ప్యాటర్న్‌ను కలిగి ఉంటాయి.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ పల్సర్ ఎన్160 - ఫీచర్లు

పల్సర్ ఎన్160 ఒక స్పోర్టి కమ్యూటర్ మోటార్‌సైకిల్ అని బజాజ్ స్పష్టంగా పేర్కొంది. కాబట్టి, ఇది ప్రాథమిక ఫీచర్లను మాత్రమే పొందుతుంది. ముందుగా, మీరు ఈ బైక్ లో హెడ్‌ల్యాంప్, డే టైమ్ రన్నింగ్ లైట్లు మరియు టెయిల్ ల్యాంప్ లను పొందుతారు. అయితే, ఇందులోని టర్న్ ఇండికేటర్లు ఇప్పటికీ హాలోజన్ బల్బులను మాత్రమే కలిగి ఉంటాయి. కంపెనీ ఈ అంశాన్ని మెరుగుపరచి, హలోజెన్ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను అందించి ఉండొచ్చు.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

ఇక ఇందులో ప్రస్తావించదగిన తదుపరి ఫీచర్ అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. పల్సర్ ఎన్160 ఇప్పటికీ అనలాగ్ టాకోమీటర్‌ను కలిగి ఉన్న కొన్ని మోటార్‌సైకిళ్లలో ఒకటి మరియు ఇందులో ఇంజన్ రెవ్‌లతో పాటుగా కదిలే ఆ మీటర్ నీడిల్ ని చూడటం మోటార్‌సైకిల్‌ ఔత్సాహికులకు సంతోషాన్నిస్తుంది. అంతేకాకుండా, రైడర్ కు కావాల్సిన అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శించే చిన్న ఎల్‌సిడి స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

ఇది సాధారణ స్పీడోమీటర్, ఓడోమీటర్ మరియు ట్రిప్ మీటర్లను పొందుతుంది. అదనంగా, మీరు ఇందులో డిస్టెన్స్ టూ ఎంప్టీ మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ సూచికను కూడా చూడొచ్చు. ఇందులో రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి ఇంధన ట్యాంక్ ముందు USB ఛార్జింగ్ స్లాట్ ఉంటుంది. ఇవీ బజాజ్ పల్సర్ ఎన్160లో కనిపించే ప్రాథమిక ఫీచర్లు.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ పల్సర్ ఎన్160 - ఇంజన్ పనితీరు మరియు రైడింగ్ ఇంప్రెషన్స్

బజాజ్ పల్సర్ ఎన్160 165సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్ మరియు ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 165 సీసీ సామర్థ్యంతో దాని ప్రత్యర్థుల కంటే దాదాపు 5 క్యూబిక్ సెంటీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. ఈ ఇఁజన్ 8,750 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 15.7 బిహెచ్‌పి శక్తిని మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 14.65 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

స్టార్టర్ బటన్‌ను నొక్కగానే ఇంజన్ ఆన్ అవుతుంది, ఇంజన్ ఆన్ అయ్యే తీరు మరియు సైలెన్సర్ నుండి వచ్చే శబ్ధం మీకు మృదువైన అనుభూతిని అందిస్తుంది. ఇది ఇప్పటికీ పల్సర్‌లో కనిపించే సున్నితమైన ఇంజన్‌లలో ఒకటి మరియు మీరు రైడింగ్ ప్రారంభించినప్పుడు ఇది మరింత స్పష్టంగా తెలుస్తుంది. శక్తి మరియు టార్క్ గణాంకాలను పరిశీలిస్తే, ఇది అధిక ఇంజన్ వేగంతో వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, ఇది అధిక ఆర్‌పిఎమ్ ల వద్ద మంచి పనితీరును కనబరుస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ చెప్పినట్లుగా పల్సర్ ఎన్160 ఒక స్పోర్టి కమ్యూటర్ మోటార్‌సైకిల్. అంటే, దీని అర్థం ఇది ఎక్కువ భాగం పట్టణ వినియోగం కోసం తయారు చేయబడిన బైక్. ఈ ఇంజన్ లో-రేంజ్ తక్కువ వేగంతో ఉంటుంది, అయితే మిడ్-రేంజ్ మాత్రంగా వేగంగా అనిపిస్తుంది. ప్రత్యేకించి, 4,000 నుండి 6,000 ఆర్‌పిఎమ్ మధ్యలో రైడర్ కు మంచి ఉత్సాహాన్ని అందిస్తుంది. ఫలితంగా, ఈ మోటార్‌సైకిల్ గంటకు 50 నుండి 70 కిమీల మధ్యలో ప్రయాణించడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

మేము చాలా తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద రైడింగ్‌ని ప్రయత్నించాము మరియు ఇది 2,000 ఆర్‌పిఎమ్ కంటే తక్కువ నుండి క్లీన్ చేస్తుంది. ఇంజన్ వేగం మనం కోరుకున్నంత త్వరగా ఉండదు, ఇది వేగవంతం కావడానికి చాలా సమయం పడుతుంది. అయితే, మీరు ఓడోమీటర్ పై 6,000 ఆర్‌పిఎన్ ని తాకినప్పుడు దీని వేగం చాలా చురుకుగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

ఇంజన్ 3,000 ఆర్‌పిఎమ్ కంటే తక్కువ ఒత్తిడికి లోనవుతుంది కాబట్టి, ఈ మోటార్‌సైకిల్‌కు తక్కువ వేగంతో స్థిరమైన గేర్ మార్పులు అవసరమవుతాయి, ఇది కొంతమంది రైడర్లకు చాలా సంతోషకరంగా ఉండకపోవచ్చు. ఈ ఒక్క విషయాన్ని అటుంచితే, ఈ మోటార్‌సైకిల్ చాలా అద్భుతమైనదిగా ఉంటుంది.

బజాజ్ 85 శాతం టార్క్ విస్తృత ఆర్‌పిఎమ్ శ్రేణిలో అందుబాటులో ఉంచింది, కాబట్టి ఇది గొప్ప రైడ్ అనుభవాన్ని జోడిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 3వ, 4వ మరియు 5వ గేర్‌లలో పల్సర్ ఎన్160 గరిష్టంగా గంటకు 30కిమీ నుండి 70కిమీ వేగాన్ని చేరుకుంటుందని బజాజ్ పేర్కొంది. బజాజ్ చెప్పినట్లుగా ఇది అదే విధమైన పనితీరును కనబరిచింది. ఈ బైక్ సైలెన్సర్ చేసే శబ్ధం వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ పల్సర్ ఎన్160లో ఉన్న ఛాసిస్, సస్పెన్షన్ మరియు బ్రేక్‌లు పెద్ద ఎన్250లో ఉన్న వాటికి సమానంగానే ఉంటాయి. ఫలితంగా, ఈ బైక్ నిర్వహణ చాలా బాగుంటుంది. పల్సర్ ఎన్160 రైడ్ క్వాలిటీ మరియు హ్యాండ్లింగ్ కూడా దీనిని ఖచ్చితంగా సెగ్మెంట్‌లో అత్యుత్తమమైనదిగా నిలబెడుతాయి.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందువైపు 37మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనోషాక్ యూనిట్ ఉంటాయి. ఈ టెలిస్కోపిక్ ఫోర్కులు బెస్ట్ ఇన్ క్లాస్ గా నిలుస్తాయి మరియు ఎలాంటి రోడ్లపై అయినా మంచి పనితీరును అందిచేవిగా ఉంటాయి. సస్పెన్షన్ బాగా దృఢమైనదిగా అనిపిస్తుంది, మీరు ఈ బైక్ పై గతుకుల రోడ్డుపై ప్రయాణించినప్పుడు దీనిని చాలా ఎక్కువగా అనుభూతి చెందుతారు. అయితే, మా టెస్ట్ రైడ్ సమయంలో మాత్రం మాకు చాలా వరకు సౌకర్యవంతంగానే అనిపించింది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

ఈ బైక్ లోని సీటు చాలా మృదువైనది మరియు దాని కుషనింగ్ కూడా చాలా బాగుంది. సుదీర్ఘమైన రైడ్స్ లో కూడా ఇది మంచి సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే, దీనిపై రెండు గంటల కంటే ఎక్కువ సమయం గడపడం కాస్తంత కస్టంగా అనిపిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ ముందువైపు 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇది గ్రిమెకా నుండి గ్రహించిన బెస్ట్-ఇన్-క్లాస్ బ్రేకింగ్ హార్డ్‌వేర్ మరియు దీని పనితీరు మోటార్‌సైకిల్ ను రైడ్ చేస్తూ బ్రేక్ వేసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

రైడర్ల సౌలభ్యం మేరకు కంపెనీ ఇందులో సింగిల్-ఛానల్ ఏబిఎస్ మరియు డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్లను అందిస్తోంది. ఈ ఏబిఎస్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మేము పశ్చిమ ఘాట్ లో మంచి జోరు వర్షంలో కూడా పూణేలోని తడి ప్రాంతాల చుట్టూ ఈ మోటార్‌సైకిల్‌ను నడిపాము. మా ఈ టెస్ట్ డ్రైవ్ క్రమంలో ఈ బైక్ యొక్క ఏబిఎస్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడింది.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

ఇక ఇందులో చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, దీని టైర్ల గురించి. తడిసిన రోడ్లపై కూడా ఈ టైర్లు అద్భుతంగా పనిచేశాయి. బజాజ్‌ ఈ బైక్ ధరను తగ్గించడం కోసం ఇందులో ఎమ్ఆర్ఎఫ్ జాపర్ టైర్లను ఉపయోగించింది. ఇవి నాన్-రేడియల్‌గా ఉన్నప్పటికీ, అన్ని రకాల రోడ్లపై సమర్థవంతంగానే పనిచేశాయి. తడిసిన రోడ్లు మరియు ఇరుకైన ప్రదేశాలలో బజాజ్ పల్సర్ ఎన్160లో మరింత శక్తి అవసరమని మాకు అనిపించలేదు. హైవేలో అయితే, ఇది కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. అది మంచిదే, ఎందుకంటే ఇది స్పోర్టి కమ్యూటర్ కాబట్టి, ఇది నిజంగా హైవే వేగం కోసం ఉద్దేశించబడినది కాదు.

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

బజాజ్ పల్సర్ ఎన్160 - వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్లు

బజాజ్ పల్సర్ ఎన్160 రెండు వేరియంట్లలో మరియు మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ రెండు వేరియంట్‌లు వాటి మెకానికల్‌ల పరంగా ఒకేలా ఉంటాయి. కేవలం ఏబిఎస్ మరియు కలర్ ఆప్షన్లలో మాత్రమే తేడా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 సింగిల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది:

- కరేబియన్ బ్లూ

- రేసింగ్ రెడ్

- టెక్నో గ్రే

బజాజ్ పల్సర్ ఎన్160 డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు ఒకే ఒక కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది:

- బ్రూక్లిన్ బ్లాక్

బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) టెస్ట్ రైడ్ రివ్యూ.. ఇది నిజంగానే 'బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ బైక్'..

చివరిగా ఏం చెబుతారు..?

ఈ మోటార్‌సైకిల్ పొజిషనింగ్ గురించి బజాజ్ చాలా స్పష్టంగా ఉంది. ఈ బ్రాండ్ దీనిని ఒక స్పోర్టీ కమ్యూటర్ గా ప్రచారం చేస్తోంది. కాబట్టి, పల్సర్ ఎన్160 కూడా బజాజ్ తెలిపిన దాని ప్రకారం, ఓ అత్యుత్తమ స్పోర్టీ కమ్యూటర్ గా ఉంటుంది మరియు ఈ సెగ్మెంట్లోని ఇతర మోటార్‌సైకిళ్ల కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది. దీని డిజైన్ పెద్ద 250సీసీ పల్సర్ మాదిరిగా ఉంటుంది, చక్కగా రైడ్ చేస్తుంది మరియు దీని ఇంజన్ నిజంగా చాలా మృదువైనదిగా ఉంటుంది. ఓవరాల్‌గా పల్సర్ ఎన్160 ఓ మంచి ఆనందదాయకమైన మోటార్‌సైకిల్ అని చెప్పొచ్చు.

ఇటీవలి కాలంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 (Pulasr NS160) ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించలేకపోతోంది. ఈ కారణంగా, బజాజ్ ఆటో చివరికు ఎన్ఎస్160ని నిలిపివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Most Read Articles

English summary
Bajaj pulsar n 160 test ride review design features specs and first ride impressions
Story first published: Sunday, July 17, 2022, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X