రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

మంచి పనితీరు కనబరిచే, అత్యుత్తమ ఫీచర్లతో మంచి మైలేజ్ ఇవ్వగల రెండు లక్షల్ల బడ్జెట్లో అందుబాటులో ఉండే బైకులు గురించి పూర్తి వివరాలు...ఇవాళ్టి స్టోరీలో

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద టూ వీలర్ మార్కెట్లో ఇండియా ఒకటి. ఇక్కడ అతి తక్కువ ధర నుండి గరిష్ట ధర వరకు బైకులు అందుబాటులో ఉంటాయి. అయితే మంచి ఫీచర్లు, మైలేజ్, అత్యుతమ పనితీరు కనబరిచే బైకుల మీద ఈ మధ్య యువత ఎక్కువగా ఇట్రెస్ట్ చూపుతోంది. అందుకోసం రెండు లక్షల్ బడ్జెట్లో దేశీయ టూ వీలర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ బైకులు గురించి పూర్తి వివరాలు.

1. కెటిఎమ్ డ్యూక్ 390

1. కెటిఎమ్ డ్యూక్ 390

దేశీయంగా పరిచయమైన ఆస్ట్రియన్‌కు చెందిన కెటిఎమ్ సంస్థలో బజాజ్ ఆటోకు 14.5 శాతం వాటా ఉంది. కెటిఎమ్ శ్రేణిలో ఉన్న డ్యూక్ 390 మోడల్ ధరకు తగ్గ విలువలను కలిగి ఉంది. సిటి మరియు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కోసం యువత దీనిని ఎక్కువగా ఎంచుకుంటోంది.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

సాంకేతికంగా కెటిఎమ్ డ్యూక్ 390 బైకులో 373.2సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇందులో శక్తివంతమైన ఇంజన్ ఉండటం ద్వారా ఇది గరిష్టంగా 43బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. దీని గరిష్ట వేగం గంటకు160 కిలోమీటర్లుగా ఉంది.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

కెటిఎమ్ డ్యూక్ 390 బైకు పదునైన, స్పోర్టివ్ ఆకారంలో ఉన్న హెడ్ లైట్ కలిగి ఉంది. తద్వారా డిజైన్ పరంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భద్రత యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు. ఇన్వర్టెడ్ ఫోర్క్స్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ కలదు.

కెటిఎమ్ డ్యూక్ 390 ప్రారంభ ధర రూ. 1.96 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

2. డిఎస్‌కె బెనెల్లీ టిఎన్‌టి 25

2. డిఎస్‌కె బెనెల్లీ టిఎన్‌టి 25

మార్కెట్లో మంచి కాక మీదున్న మరో స్టైలిష్ మరియు స్పోర్టివ్ బైకు బెనెల్లీ టిఎన్‌టి 25 మరియు ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో ఇదే అత్యుత్తమమైనది. ఇటాలీకి చెందిన పురాతణ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థలలో ఇదీ ఒకటి. ఇప్పడిప్పుడే దేశీయంగా తమ నెట్‌వర్క్‌ని విస్తరింపజేస్తోంది బెనెల్లీ.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

సాంకేతికంగా డిఎస్‌కె బెనెల్లీ టిఎన్‌టి 25 లో 249సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 28.16బిహెచ్‌పి పవర్ మరియు 21.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం ద్వారా పవర్ మరియు టార్క్ సరఫరా అవుతుంది.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

సిటి మరియు లాంగ్ డ్రైవ్ ల కోసం వీటిని ఎక్కువగా ఎంచుకుంటారు. బెనెల్లీ టిఎన్‌టి 25 గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మరియు ఇందులో 17-లీటర్ల గరిష్ట సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు.

డిఎస్‌కె బెనెల్లీ టిఎన్‌టి 25 ధర రూ. 1.80 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

03. కెటిఎమ్ ఆర్‌సి 200

03. కెటిఎమ్ ఆర్‌సి 200

కెటిఎమ్ డ్యూక్ రేంజ్ లో ఆర్‌సి 200 మోడల్ మంచి ఫలితాలను సాధించింది. దేశీయంగా రేసింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న యువత వీటిని ఎక్కువగా ఎంచుకుంటోంది.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

సాంకేతికంగా ఆర్‌సి200 బైకులో 199.5సీసీ సామర్థ్యంగల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 24.6బిహెచ్‌పి పవర్ మరియు 19.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

విడుదలకు సిద్దమయ్యే అన్ని బైకుల్లో కూడా అది వెళ్లే వేగానికి అధిక ప్రాదాన్యతనిస్తున్నారు. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల్లో ఈ అంశం మరీ ముఖ్యంగా ఉంది. ఈ కెటిఎమ్ ఆర్‌సి200 యొక్క గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లుగా ఉంది.

కెటిఎమ్ ఆర్‌సి 200 ధర రూ. 1.69 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

4. హోండా సిబిఆర్250ఆర్

4. హోండా సిబిఆర్250ఆర్

హోండా సిబిఆర్250ఆర్ బైకు స్పోర్ట్స్ టూరర్‌గా మంచి పేరుగాంచింది. విభిన్న అంతర్జాతీయ మార్కెట్లలలో విపరీతంగా అభిమానులను చూరగొన్న ఇది దీని శ్రేణిలో ఉన్న మిగతా వాటితో పోల్చితే మంచి విజయాన్ని అందుకుంది. ఈ స్పోర్ట్స్ బైకులో హోండా సిగ్నేచర్ డిజైన్‌ను అందించారు.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

సాంకేతికంగా హోండా సిబిఆర్250ఆర్ బైకులో 249సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 26.15బిహెచ్‌పి పవర్ మరియు 22.9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

హోండా సిబిఆర్250ఆర్ ప్రేమికులు దీనిని గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేయగలరు.

హోండా సిబిఆర్250ఆర్ లోని వివిధ రకాల వేరియంట్లను బట్టి ధరలు రూ. 1.60 లక్షల నుండి 1.90 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

5. యమహా వైజడ్‌ఎఫ్15ఎస్

5. యమహా వైజడ్‌ఎఫ్15ఎస్

యమహాకు భారతీయ అభిమానుల తాకిడి భారీగా ఉంది. స్పోర్టివ్ శైలిలో ఉండే తమ అన్ని ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. యమహా ఇండియన్ మార్కెట్లోకి మొదట్లో అందుబాటులోకి తెచ్చిన ఆర్15 భారీ విజయాన్ని సాధించింది.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

యమహా లైనప్‌లో ఉన్న ఆర్15 మరియు ఆర్15ఎస్ రెండింటిలో కూడా అదే శక్తివంతమైన 149సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 16.8బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఆర్15ఎస్ శ్రేణిలోని బైకుల్లో ఇసియు అనే టెక్నాలజీని పరిచయం చేశారు. తద్వారా మైలేజ్ కాస్త ఎక్కువగా ఉంది.

  • యమహా ఆర్15 శ్రేణి ధరలు రూ. 1.15 లక్షల నుండి 1.18 లక్షల వరకు మరియు ఆర్15ఎస్ ధర రూ. 1.15 లక్షలుగా ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి).
  • 6. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

    6. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

    అడ్వెంచర్ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోకి ఎట్రీ లెవల్ అడ్వెంచర్ బైకు హిమాలయన్ ను విడుదల చేసింది. దేశీయంగా అందుబాటులో ఉన్న ఏకైక ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకు ఇదే.

    రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

    అడ్వెంచర్ సంభందిత అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గరిష్టంగా 180ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, ముందు మరియు వెనుక వైపున పొడవాటి సస్పెన్షన్ సిస్టమ్ కలదు. హై వే మీద కాకుండా మట్టి రోడ్ల మీద దీనిని రైడింగ్ చేసినపుడు అడ్వెంచర్ అనుభవాన్ని సులభంగా పొందుతారు.

    రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

    సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ బైకులో 411సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని గరిష్ట వేగం గంటకు130 కిలోమీటర్లుగా ఉంది.

    ధర రూ. 1.56 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

    7. మహీంద్రా మోజో టూరర్ ఎడిషన్

    7. మహీంద్రా మోజో టూరర్ ఎడిషన్

    అడ్వెంచర్ బైకులో సెగ్మెంట్లో ఉన్న మరో ఉత్పత్తి మహీంద్రా మోజో. దూర ప్రాంత ప్రయాణాలకి, అడ్వంచర్ యాంత్రలకు మోజో పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. మహీంద్రా టూ వీలర్స్ ఈ మోజో ను పూర్తి స్థాయిలో అడ్వెంచర్ లక్షణాలతో అభివృద్ది చేసింది.

    రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

    సాంకేతికంగా మహీంద్రా మోజో అడ్వెంచర్ బైకులో 295సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, సింగల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 27బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయునుయ

    రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

    ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసందానం చేశారు. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. అవి, పిరెల్లీ టైర్లు, ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్, డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంటేషన్, ఫాగ్ ల్యాంప్స్ కలవు. లాంగ్ ట్రావెల్ కోసం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.

    ధర రూ. 1.89 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

    8. రాయల్ ఎన్పీల్డ్ థండర్‌బర్డ్ 500

    8. రాయల్ ఎన్పీల్డ్ థండర్‌బర్డ్ 500

    ఇండియాలో ఉన్న ఉత్తమ క్రూయిజ్ బైకుల్లో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500. దీని డిజైన్ మరియు నిర్మాణ శైలి పరంగా చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో ఉన్న అత్యుత్తమ బైకు అని చెప్పవచ్చు.

    రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

    సాంకేతికంగా ఇందులో 499సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 27.2బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. దీని గరిష్ట వేగం గంటకు 120కిలోమీటర్లుగా ఉంది.

    రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

    గతంలో ఉన్న థండర్‌బర్డ్ లక్షణాలతో సరికొత్త రూపంలో పరిచయం అయిన తరువాత మంచి ఆదరణ పొందింది. ఇందులో గత కాలం నాటి డిజైన్ లక్షణాలతో పాటు డిజిటల్ ఇంస్ట్రుమెంటేషన్, డిస్క్ బ్రేకులు, క్రూయిజ్ శైలిలో ఉన్న హ్యాండిల్ బార్ వంటివి కలవు.

    ధర రూ. 1.80 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

    చివరగా

    చివరగా

    రెండు లక్షల బడ్జెట్ ధరతో అడ్వెంచర్ మరియు స్పోర్ట్స్ తరహాలో ఉండే ఈ బైకులు ద్వారా దూర ప్రాంత ప్రయాణాలు మరియు సిటి రైడింగ్ అవసరాల కోసం బాగా ఉపయోపడుతాయి. మరింత ఎక్కవ ధర ఉండే స్పోర్ట్స్ బైకులతో పోటీ పడుతూ అత్యుత్తమ ఇంజన్ పనితీరును కనబరచడంలో వీటికివే సాటి...

    రెండు లక్షల బడ్జెట్లో బెస్ట్ బైకులు

    • ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి ? వివరంగా...!!
    • అక్టోబర్ లో అత్యధిక విక్రయాలు జరిపిన టూ వీలర్ కంపెనీలు
    • క్లింబర్, రేసర్ అంటూ రెనో క్విడ్ లో మరిన్ని వేరియంట్లు

Most Read Articles

English summary
Best Bikes Under 2 Lakh — Heady Mix Of Value And Performance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X