భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్, నెలకు 2 లక్షలకు పైగా అమ్మకాలు సాధిస్తోం

By Anil

దేశీయంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న వాహనాలలో ద్విచక్ర వాహనాలు ఎక్కువ. తక్కువ పరిమాణం, పార్కింగ్ చేయడం సులభంగా ఉండటం, సిటి మరియు పల్లె ప్రాంతాలకు బాగా సరిపోవడం మరియు అధిక మైలేజ్ ఇవ్వడం మరియు సరైన ధరకు లభించడం వంటి ఎన్నో కారణాల వలన దేశీయంగా టూ వీలర్ల అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయి. ప్రతి నెల కూడా దాదాపుగా ఒకే విధమైన ఉత్పత్తులు టాప్-10 అమ్మకాలలో నిలిచేవి కాని గత నెల ఏప్రిల్ 2016 లో కొన్ని కొత్త ఉత్పత్తులు ఈ టాప్-10 జాబితాలో చోటు సాధించాయి.

గత నెలలో అత్యధికంగా అమ్మకాలు సాధించిన టాప్-10 టూ వీలర్లు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

10. బజాజ్ వి15

10. బజాజ్ వి15

భారత దేశపు యుద్ద నౌకను కరిగించి బజాజ్ మోటార్ సైకిల్స్ తయారు చేసిన వి15 బైకు విడుదలైన అతి తక్కువ కాలంలోనే టాప్-10 అమ్మకాల జాబితాలో చోటు సాధించింది. బజాజ్ గత నెలలో 24,057 యూనిట్ల అమ్మకాలు జరిపింది. తాజాగా దీనిని బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్‌ కూడా కొనుగోలు చేశారు.

09. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్

09. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్

రాయల్ ఎన్ఫీల్డ్ వారి క్లాసిక్ 350 బైకు ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. తొమ్మిదవ స్థానంలో ఉన్న ఈ క్లాసిక్ 350 బైకును రాయల్ ఎన్ఫీల్డ్ సుమారుగా 28,567 గా అమ్మేసింది. దీనిని సులభంగా రైడ్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

08. హోండా డ్రీమ్

08. హోండా డ్రీమ్

జపాన్‌కు చెందిన హోండా మోటార్ సైకిల్స్ సంస్థకు చెందిన డ్రీమ్ టూ వీలర్ తన కమ్యూటర్ సెగ్మెంట్లో ఉత్తమ బైకు అని ఋజువు చేసుకుంది. గడిచిన ఏప్రిల్ నెలలో సుమారుగా 32,503 యూనిట్లు అమ్ముడుపోయాయి.

07. బజాజ్ పల్సర్

07. బజాజ్ పల్సర్

బజాజ్ మోటార్ సైకిల్స్ పల్సర్‌ను ప్రారంభంలో 2001 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పల్సర్ అనే పేరుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం పల్సర్ పేరుతో చాలా వేరియంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ బజాజ్ సంస్థ ఈ పల్సర్ పేరుతో చాలా పెద్ద విజయాన్నే సాధించింది. బజాజ్ గడిచిన 2016 ఏప్రిల్ నెలలో 50,419 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

06. హోండా సిబి షైన్

06. హోండా సిబి షైన్

125 సీసీ సెగ్మెంట్లో హోండాకు చెందిన సిబి షైన్ తిరుగులేని అమ్మకాలు సాధిస్తోంది. గడిచిన 2016 ఏప్రిల్ నెలలో సుమారుగా 52,751 యూనిట్లు అమ్మకాలు జరిపి టాప్-10 జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.

05. బజాజ్ సిటి

05. బజాజ్ సిటి

టాప్-10 జాబితాలో బజాజ్‌కు చెందిన మూడవ ఉత్పత్తి బజాజ్ సిటి ఐదవ స్థానంలో నిలిచింది. ఇండియన్ మార్కెట్లో ఉన్న బజాజ్ బాక్సర్ స్థానంలోకి ప్రవేశించిన ఈ సిటి బైకు గడిచిన 2016 ఏప్రిల్ నెలలో 66,409 యూనిట్లు అమ్ముడుపోయాయి.

04. హీరో గ్లామర్

04. హీరో గ్లామర్

భారత దేశపు అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన హీరో గ్లామర్ ఉత్పత్తిని నాలుగవ స్థానంలో నిలిపింది. హోండా వారి డ్రీమ్ బైకుకు ప్రత్యక్ష పోటీగా నిలిచింది. గడిచిన 2016 ఏప్రిల్‌లో హీరో ఏకంగా 66,756 యూనిట్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 25 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

03. హీరో ప్యాసన్

03. హీరో ప్యాసన్

హీరో మోటోకార్ప్ వారి రెండవ ఉత్పత్తి ప్యాసన్ టాప్-10 జాబతాలో మూడవ స్థానంలో నిలిచింది. కొంచెం స్టైలిష్ మార్పులతో మార్కెట్లోకి వచ్చిన సరికొత్త ప్యాసన్ గడిచిన 2016 ఏప్రిల్ అమ్మకాల్లో 98,976 యూనిట్లు అమ్మకాలు సాధించింది. అయితే అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 1,19,491 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

02. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

02. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ భారత దేశపు రెండవ అతి అత్యధికంగా అమ్మకాలు సాధింస్తున్న మోడల్ మరియు హీరో వారి వరుసగా మూడవ ఉత్పత్తి ఈ స్థానంలో నిలించింది. హెచ్‌ఎఫ్ డీలక్స్ గడిచిన నెలలో 1,16,567 యూనిట్లు అమ్ముడుపోయాయి.

01. హీరో స్ల్పెండర్

01. హీరో స్ల్పెండర్

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ ఈ సారి కూడా హీరో సూపర్ స్ల్పెండరే నిలిచింది. గత నెలలో 2,23,248 యూనిట్లు అమ్మకాలు సాధించింది.

ఏప్రిల్ 2016 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టూ వీలర్లు

ఈ మాసంలో కార్లు కొనేవారికి అదిరే ఆఫర్లు ప్రకటించిన సంస్థలు

సంభరంలో రెనో క్విడ్, భాదపడుతున్న మారుతి ఆల్టో

Most Read Articles

English summary
Top 10 Selling Motorcycles In April 2016 – The Bajaj V15 Makes An Entry
Story first published: Saturday, May 21, 2016, 11:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X