మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఎట్టకేలకు మేము చివరికి ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ తో మా ప్రయాణం ముగింపుకు చేరుకుంది. మేము ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎక్కువ ట్రాఫిక్ లో మరియు తక్కువగా ఉన్న ట్రాఫిక్ లో దాదాపు ఒక నెలరోజులకు పైగా రైడింగ్ చేస్తున్నాము. ఈవీ జీనియా నిజంగా చాలా అద్భుతంగా ఉంది, అంతే కాకుండా వాహనదారులు చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఈవీ జీనియా డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. వాహనదారులకు ఈ స్కూటర్ పై కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఈవీ జీనియాలోని అన్ని డిజైన్ అంశాలు, ఫీచర్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడ క్లిక్ చేయండి. వాహనదారులను ఎంతగానో ఆకర్షిస్తున్న ఈ కొత్త ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

పవర్ట్రెయిన్ :

ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎలా ప్రయాణించాలో అనే విషయాన్నీ గురించి మేము మీకు చెప్పే ముందు, మొదట టెక్నీకల్ అంశాలను గురించి చూద్దాం.. ఈవీ జీనియా 250 వాట్స్ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 60 వి 20 ఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడింది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

రైడింగ్ ఇంప్రెషన్స్ :

ఈవీ జీనియాపై ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా చేస్తుంది. ఇది ఒక సారి పుల్ ఛార్జ్ అయిన తరువాత దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే టెస్టింగ్ సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సగటున 60 కిలోమీటర్ల పరిధిని అందించగలిగింది. కంపెనీ పేర్కొన్న విధంగానే ఇది నిజంగా మమ్మల్ని చాలా ఆకట్టుకుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

25 కి.మీ / గం టాప్ స్పీడ్ అంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈవీ జీనియా తక్కువ-స్పీడ్ కేటగిరీ పరిధిలోకి వస్తుంది. ఇది చిన్న 250 వాట్స్ ఎలక్ట్రిక్ మోటారుతో ఉంది ఏ రిజిస్ట్రేషన్ ప్లేట్ అవసరంలేకుండా మినహాయింపు పొందింది. అంతే కాకుండా ఇది రోడ్డుపై ప్రయాణించడానికి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. అందువల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారిక నంబర్ ప్లేట్‌ను కలిగి ఉండకపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఇక ఈ స్కూటర్ పనితీరు విషయానికి వస్తే ఈవీ జీనియా మంచి ప్రతిస్పందనను అందిస్తుంది. థొరెటల్ యొక్క ట్విస్ట్ వద్ద పవర్ కూడా చాలా బాగా ప్రసారం అవుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ వేగాన్ని త్వరగా చేరుకుని 25 కి.మీ / గం టాప్ స్పీడ్ కి వస్తుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని వేళలా చాలా బాగా పనిచేస్తుంది. ఈవీ జీనియాలో బాగా ఆకట్టుకునే విషయం ఏమిటంటే ఏ సమయంలోనైనా, ఫ్లాట్ లేదా వంపుతిరిగిన భూభాగాలపై ప్రయాణించేటప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఈవీ జీనియా 140 కిలోల పేలోడ్‌ను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మూడు రైడింగ్ మోడ్‌లను చూపిస్తుంది, వీటిని కుడి హ్యాండిల్‌బార్‌లోని స్విచ్‌ల ద్వారా కన్రోల్ చేయవచ్చు. ఏదేమైనా మా మొత్తం సమయంలో జీనియాను నడుపుతున్నప్పుడు, మూడు మోడ్‌ల నుండి పనితీరు లేదా పరిధిలో పెద్ద లేదా తేడాను మేము గమనించలేదు.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

స్కూటర్‌లో ‘పార్క్' మోడ్ కూడా ఉంది, ఇది సేఫ్టీ ఫీచర్ గా పనిచేస్తుంది. ఇందులో భద్రతను మరింత నిర్ధారించడానికి, స్కూటర్ తొక్కడానికి సిద్ధంగా ఉండటానికి ముందు, రైడర్స్ 2 నుండి 3 సెకన్ల వరకు ‘పి' స్విచ్‌ను పట్టుకోవాలి.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఈవీ జీనియా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ బరువుతో అంటే ఇది 80 కేజీల బరువును కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది కొంచెం ఎత్తుగా కూడా ఉంటుంది. ఇది నగరంలో ఎక్కువ ట్రాఫిక్ పరిస్థితుల ద్వారా నావిగేట్ చేసేటప్పుడు ఇది చాలా సులభమైన ద్విచక్ర వాహనంగా మారుతుంది. జీనియా 10 ఇంచెస్ ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉంటుంది. ఇవి తడి మరియు పొడి పరిస్థితులలో మంచి పట్టును అందిస్తుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

రైడ్ కంఫర్ట్ :

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ విస్తృతమైన సింగిల్-పీస్ సీటుతో వస్తుంది. ఇది మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అదనపు సౌలభ్యం మరియు పట్టు కోసం పిలియన్ వెనుక భాగంలో పెద్ద గ్రాబ్ రైల్స్ పొందుతుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఫుట్‌బోర్డ్ కొంచెం ఎత్తులో ఉందని మేము భావించాము. ఇది గ్రౌండ్ క్లియరెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడింది మరియు స్కూటర్ దాని దిగువ స్క్రాప్ చేయకుండా అసమాన టార్మాక్ మరియు ప్రణాళిక లేని రోడ్ హంప్‌లను పరిష్కరించడానికి అనుమతిస్తుంది, ఇది పొడవైన రైడర్‌లకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఇది తరచుగా జరగదు కేవలం గట్టి ప్రదేశాలలో మరియు మలుపులు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇది స్క్రాప్ అవుతుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మరో ఆందోళన కరమైన విషయం సస్పెన్షన్ సెటప్. ఈవీ జీనియా ముందు భాగంలో కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ఒక జత షాక్ అబ్జార్బర్‌లను ఉపయోగిస్తుండగా, అవి దృఢమైన వైపు కొద్దిగా ఏర్పాటు చేయబడినట్లు కనిపిస్తాయి. నగరం చుట్టూ ఎక్కువ సమయం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగించి ప్రయాణించేటప్పుడు ఇది ప్రత్యేకంగా గమనించవచ్చు.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్నది స్కూటర్‌లోని బ్రేకింగ్. ఈవీ జీనియా ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. ఇది అత్యవసర సమయంలో కూడా వెంటనే బ్రేక్ వేసినప్పుడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్ రెండూ బాగా అమర్చబడ్డాయి. ఎబిఎస్ ఉనికి లేకుండా, ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకస్మిక బ్రేకింగ్ వేసేటప్పుడు కింద దాని చక్రాలను లాక్ చేస్తుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

బ్యాటరీ ఛార్జింగ్ :

ముందు చెప్పినట్లుగానే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరీక్షించే సమయంలో, ఈవీ జీనియా ఒక సారి ఫుల్ ఛార్జ్ తో సగటున 60 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. పరిధి లేదా ఛార్జింగ్ గురించి ఎటువంటి ఆందోళన లేకుండా స్కూటర్‌ను రోజువారీగా ఉపయోగించడానికి ఇది సౌకర్యవంతంగా అనుమతిస్తుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఈవీ వినియోగదారులకు స్కూటర్‌తో పాటు స్టాండర్డ్ ఛార్జింగ్ కేబుల్‌ను అందిస్తుంది. ఈ ఛార్జింగ్ కేబుల్ ప్రతిచోటా అందుబాటులో ఉన్న ఏదైనా స్టాండర్డ్ త్రీ పిన్ ప్లగ్‌లోకి ప్లగ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు పద్ధతులను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. మొదట కేబుల్‌ను నేరుగా సీటు క్రింద ఉంచిన ఛార్జింగ్ సాకెట్‌కు ప్లగ్ చేయడం ద్వారా, రెండవ పద్ధతి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్లో సీటు కింద బ్యాటరీ ప్యాక్ ఉంది, దానిని తొలగించవచ్చు. తొలగించగల బ్యాటరీని సంస్థ అందించిన అదే ఛార్జింగ్ కేబుల్ ఉపయోగించి ఇంట్లో లేదా ఆఫీస్ లో విడిగా ఛార్జ్ చేయవచ్చు.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఏది ఏమైనా బ్యాటరీ ప్యాక్‌ను సీటు కింద ఉంచడం ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లభించే స్టోరేజ్ స్థలాన్ని తగ్గిస్తుంది. బ్యాటరీ ప్యాక్ స్థల ఆక్రమించడం వల్ల అండర్ సీట్ స్టోరేజ్ ఎక్కువ లేదు. ఫ్రంట్ ఆప్రాన్ వెనుక మాత్రమే ఉపయోగించగల నిల్వ స్థలం ఉంది, ఇది కూడా తక్కువగా ఉన్నప్పటికీ, ఫోన్లు మరియు వాలెట్లు వంటి నిత్యావసరాలను మాత్రమే ఉంచడానికి వీలు కల్పిస్తుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

నిర్వహణ వ్యయం [Running Costs] :

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ ధరను కలిగి ఉటాయి. అయినప్పటికీ ఖర్చులు తగ్గించడం మరియు ఈ అదనపు ఖర్చును త్వరగా తిరిగి పొందడం చాలా సులభం. ఈవీ జీనియా కూడా ఏమాత్రం దీనికి భిన్నంగా లేదు. ఈవీ జీనియా ప్రారంభ ధర 72,000 రూపాయలు [ఎక్స్-షోరూమ్]. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఖరీదైనదనే చెప్పాలి.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

అయితే నిరంతరం ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెట్రోల్ నింపాల్సిన అవసరం లేకుండా, ఖర్చును సగం వరకు తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపడానికి కనీస నిర్వహణతో కలిపి (కనీసం మొదటి మూడు సంవత్సరాలు), వినియోగదారులు తమ అదనపు కొనుగోలు ఖర్చును మొదటి సంవత్సరంలోనే తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

అవైలబిలిటీ [లభ్యత] :

ఈవీ జీనియా అనేది ఒడిశా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు. ఇది 2018 లో స్థాపించబడినప్పటి నుండి ఈ సంస్థ భారతదేశం అంతటా 50 నగరాలకు పైగా విస్తరించింది, వాటిలో ఎక్కువ భాగం తూర్పు తీరం వెంబడి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రాంతాలలో వ్యాపించింది. అయితే త్వరలోనే దేశవ్యాప్తంగా తన ఉనికిని వేగంగా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

ఈవీ జీనియా బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఉత్పత్తి. ఇది తక్కువ స్పీడ్ కేటగిరీ సమర్పణ కావడంతో, జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలేజీకి వెళ్లే యువకులను లక్ష్యంగా చేసుకుంది.

వాహన రిజిస్ట్రేషన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ గురించి కూడా ఆందోళన అవసరం లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నగరంలో, కాలేజీలకు, ఇంటిదగ్గర మరియు ట్యూషన్ల వంటివాటికి వెళ్ళడానికి వారి అవసరాలకు సరిగ్గా సరిపోతుంది.

మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

వెర్డిక్ట్ :

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాకుండా అనేక ఫీచర్స్ కలిగి ఉంది నగరాల చుట్టూ తిరగడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏదేమైనా, దీని ఎక్స్ షోరూమ్ ధర 72,000 రూపాయల కావడంతో, ఇది మరీ అంత సరసమైనది కాదు. కానీ ఇది ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
EeVe Xeniaa Long-Term Review Final Report. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X