నూతన శైలిలో ఉన్న సరికొత్త స్ల్పెండర్ ఐస్మార్ట్110: టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

By Anil

దేశీయ అతి పెద్ద టూ వీలర్ల తయారి సంస్థ హీరో మోటోకార్ప్‌లోని స్ల్పెండర్ అనే పదం భారతీయులకు బాగా తెలిసిన పేరు. ఈ పేరు మైలేజ్ ఇనే పదానికి పర్యాపదంగా నిలిచింది. ప్రారంభంలో హీరో మోటోకార్ప్ మరియు హోండా మోటార్ సైకిల్స్ సంయుక్తంగా ఉన్నపుడు 1994 లో స్ల్పెండర్ బైకును పరిచయం చేసారు.

స్ల్పెండర్ బైకు విడుదలైన అనతి కాలంలోనే ఊహించని విజయాన్ని సాధించింది. అద్బుతమైన విజయాన్ని అందుకుని దాన్ని అలాగే కొనసాగించిన స్ల్పెండర్‌కు స్వల్ప మార్పులు చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్‌తో కొత్త వినియోగదారులకు చేరువవుతూ వచ్చింది.

2011 లో హీరో మోటోకార్ప్ మరియు హోండా మోటార్స్ సైకిల్స్ విడిపోయాయి. తరువాత హీరో మోటోకార్ప్ 2013 లో సుమారుగా 15 అప్‌గ్రేడెడ్ మోడల్స్‌ను విడుదల చేసింది. అందులో స్టార్ట్ స్టాప్ సిస్టమ్ (ఐ3ఎస్) అనే విభిన్నమైన ఫీచర్‌ గల స్ల్పెండర్ ఐస్మార్ట్100 బైకును కూడా అందుబాటులోకి తెచ్చింది. స్ల్పెండర్ ఐస్మార్ట్100 మోడల్‌కు కొనసాగింపుగా నూతన డిజైన్ శైలిలో అత్యాధునికంగా 110సీసీ సామర్థ్యంతో హీరో సంస్థ స్ల్పెండర్ ఐస్మార్ట్‌ను తాజాగ విడుదల చేసింది. డ్రైవ్ స్పార్క్ బృందం దీనికి టెస్ట్ డ్రైవ్ నిర్వహించి ఇందులో ఉన్న అనుకూల మరియు ప్రతికూల అంశాలను అందివ్వడం జరిగింది.
టెస్ట్ డ్రైవ్ నిర్వహించిన బైకు: హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110
ఆన్ రోడ్ హైదరాబాద్ ధర: రూ. 62,183 లు

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 - 01

డిజైన్
హీరో మోటోకార్ప్ దీనికి విభిన్నమైన డిజైన్ ఫీచర్లను అందించింది. యువతను ఉద్దేశించి దీనిని పూర్తి స్థాయిలో అధునాతన బాడీ డీకాల్స్ మరియు ఏవేని రెండు విభిన్న రంగుల్లో అధునాతన శైలికి అద్దం పట్టే విధంగా తీర్చిదిద్దారు. ముందు నుండి వైనుక వైపునకు స్మూత్ ఫ్లోయింగ్ లైన్లు మరియు వెనుక వైపున ఉన్న హ్యాండిల్ మిగతావాటితో పోల్చితే విభిన్నంగా ఉంది.

డిజైన్ పరంగా ఉన్న ప్రత్యేకతలను గమనిస్తే రెండు వైపులా బాడీ డీకాల్స్‌కు క్రింది వైపుగా ప్లాస్టిక్ క్లాడింగ్‌ను అందించారు, తద్వారా ఇది మరింత స్మార్ట్ కనబడుతోంది. పూర్తిగా నల్లటి రంగులో డిజైన్ చేసిన ఎగ్జాస్ట్ పైపుకు చివరిలో సిల్వర్ కప్పును అతికించారు. దీని ద్వారా మరింత అందం చేకూరిందని చెప్పవచ్చు.


హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 సాంకేతిక వివరాలు
హీరో మోటోకార్ప్ ఇందులో 109.15సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఇతర స్ల్పెండర్ మోడల్స్‌లా కాకుండా సిలిండర్ హెడ్‌ను నిలువుగా ఉండేట్లు అమర్చారు. ఇందులో ఉన్న శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 9.2బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎస్-IV కాలుష్య నియమాలకు విలువనిస్తూ ఇందులో 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. అన్ని గేర్లు కూడా వెనక్కి వేయాల్సి ఉంటుంది. న్యూట్రల్ ముందు వైపుకు (N-1-2-3-4)ఉంటుంది. మైలేజ్ లీటర్‌కు 68 కిలోమీటర్లుగా ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 - 02

పనితీరు
ప్రారంభంలో స్థాయిలో పనితీరు బాగా ఉంది, కాని బైకును మధ్య వేగంతో నడిపినపుడు రైడింగ్‌లో ఏవిధమైన సంతృప్తిని పొందలేరు. అన్ని పరిస్థితులలో కూడా బైకును గరిష్ట ఆర్‌పిఎమ్‌తో నడపాల్సి ఉంటుంది.

అయితే ఇది బిఎస్-IV వారి నియమాలను పాటిస్తుండటం వలన కేవలం 7.45 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులోని అతి ముఖ్యమైన ఫీచర్లలో హీరో వారి ఐ3ఎస్ సాంకేతికత ఒకటి (ఐడిల్-స్టాప్-స్టార్ట్ సిస్టమ్).


ఐ3ఎస్ పరిజ్ఞానం అనగా ?
ఐ3ఎస్ లేదా ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ అనేది మైలేజ్‌ను పెంచే అత్యాధునిక పరిజ్ఞానం. దీనికి సంభందించిన పేటెంట్ హక్కులను హీరో మోటోకార్ప్ కలిగి ఉంది. రైడర్ బైకును న్యూట్రల్ చేసి క్లచ్ వదిలేసిన అనంతరం ఐదు సెకండ్లలో ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ ఆవుతుంది. తర్వాత రైడర్ ఎప్పుడయితే క్లచ్‌ను ప్రెస్ చేస్తాడో అప్పుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ ఫీచర్‌ను మ్యాన్యువల్‌గా ఆఫ్ లేదా ఆన్ చేసుకోవడానికి కుడిచేతివైపున స్విచ్ గేర్‌ను అందించారు.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110

రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ సౌలభ్యం
దీని టెస్ట్ డ్రైవ్‌లో గుర్తించిన విశయాలలో అతి ముఖ్యమైనవి స్ల్పెండర్ ఐస్మార్ట్ స్మూత్ ఇంజన్ మరియు సులువైన సాఫ్ట్ గేర్‌షిఫ్ట్. అంతే కాకుండా అత్యుత్తమ ఇంజన్‌కు స్ల్పెండర్‌ పేరుగాంచింది కూడా. చిన్న ఇంజన్‌ అయినప్పటికీ మిగతా ఏ ఇతర కమ్యూటర్ బైకులతో పోల్చుకున్నా వైబ్రేషన్ మరియు సౌండ్ దాదాపుగా చాలా వరకు తక్కువ. గరిష్ట ఆర్‌పిఎమ్ వద్ద కూడా ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్‌ను వినియోగించుకుంటుంది.

దీని రైడింగ్ సమయంలో మీరు చేసే హ్యాండ్లింగ్ మీకు ఎంతగానో నచ్చుతుంది. మోకాలి మరియు చేతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సరైన పొజిషన్ వచ్చేట్లు రూపొందించారు. ఇక అత్యంత సౌకర్యవంతమైన మరియు పొడవైన సీటును అందించినందకు హీరో మోటోకార్ప్‌కు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. రెండు వైపులా అందించిన అద్దాలు మంచి విజిబులిటిని కలిగి ఉన్నాయి.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 - 03

విశిష్టతలు
వినియోగదారులకు నూతన ఫీచర్లను అందివ్వడానికి చేసిన ప్రయత్నంలో భాగంలో ఇందులో వచ్చిన ఫీచర్లలోఆటోమేటిక్ హెడ్ ల్యాంప్, టార్క్ ఆన్ డిమాండ్ ఇంజన్ (బిఎస్ IV) సరికొత్త ఛాసిస్ మరియు ఫ్రేమ్, అతి నూతన ఐ3ఎస్ సాంకేతికత, బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్, పవర్, ఆక్సిలరేటర్, సరికొత్త మఫ్లర్ (సైలెన్సర్) మరియు సౌకర్యవంతమైన సీటు కలదు.

సాంకేతిక వివరాలు
ఇంజన్: ఎయిల్ కూల్డ్, 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్
సామర్థ్యం: 109.15సీసీ
గరిష్ట పవర్: 9.2 బిహెచ్‌పి @ 7500ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్: 9 ఎన్ఎమ్ @ 5,500ఆర్‌పిఎమ్
ఛాసిస్ ఫ్రేమ్: ట్యూబులర్ డబుల్ క్రాడిల్

సస్పెన్షన్
ముందు వైపున: టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ పోర్క్స్
వెనుక వైపున: స్ప్రింగ్ ద్వారా సర్దుబాటు చేసుకునే వెసులుబాటున్న డ్యూల్ షాక్ అబ్జార్వర్ కలదు.

బ్రేకులు
ముందు భాగం: 130 ఎమ్ఎమ్ డ్రమ్
వెనుక భాగం: 110ఎమ్ఎమ్ డ్రమ్

చక్రాలు
ముందు భాగం: ట్యూబ్ లెస్
వెనుక భాగం: ట్యూబ్ లెస్
రెండు కూడా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్నాయి.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 - 04

కొలతలు
  • పొడవు: 2015ఎమ్ఎమ్
  • వెడల్పు: 770ఎమ్ఎమ్
  • ఎత్తు: 1055ఎమ్ఎమ్
  • వీల్ బేస్: 1245ఎమ్ఎమ్
  • గ్రౌండ్ క్లియరెన్స్: 165ఎమ్ఎమ్
  • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 5.8 లీటర్లు
  • రిజర్వ్ సామర్థ్యం: 2 లీటర్లు
  • మొత్తం బరువు: 115 కిలోలు
  • మోయగలిగే సామర్థ్యం: 130 కిలోలు
హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 - 05
లభించు రంగులు
ఇది నాలుగు విభిన్న డ్యూయల్ టోన్ రంగుల్లో లభించును.
  • సిల్వర్ అండ్ బ్లాక్,
  • రెడ్ అండ్ బ్లాక్,
  • బ్లూ అండ్ బ్లాక్,
  • స్పోర్ట్స్ రెడ్ వంటి రంగులు.

ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
హీరో మోటోకార్ప్ ఈ అధునాతన స్ల్పెండ్ ఐస్మార్ట్ 110 బైకులో సెమి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు, ఇందులో అతి పెద్ద అనలాగ్ స్పీడో మీటర్ ఎడమ వైపున ఫ్యూయల్ గేజ్, కుడివైపున డిజిటల్ కన్సోల్ దాని ప్రక్కనే క్లస్టర్ కలదు, ఇందులో ఉన్న డిస్ల్పేలో ఓడో, ట్రిప్ మీటర్లతో పాటు సర్వీస్ రిమైండర్ కలదు. ఈ అనలాగ్ స్పీడో మీటర్‌లోనే వార్నింగ్ ఇండికేటింగ్ లైట్లు కలవు. గేర్ యొక్క న్యూట్రల్ స్థానం తెలిపే లైటింగ్ మరియు నూతనంగా సైడ్ స్టాండ్ వార్నింగ్‌ను సూచించే లైట్ కూడా కలదు.

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 - 06

స్విచ్‌లు
స్విచ్‌ల పరంగా చూస్తే, ఎడవైపున హెడ్ లైట్ యొక్క హై మరియు లో భీమ్, హెడ్ లైట్ పాస్ స్విచ్, ఇండికేటర్ మరియు హారన్ వంటి స్విచ్‌లను అందించారు. ఇక కుడి వైపున హ్యాండిల్ మీదున్న స్విచ్‌లను పరిశీలిస్తే స్టార్ట్ బటన్, నీలం రంగులో ఐ3ఎస్ బటన్ కలదు. అయితే ఈ స్ల్పెండర్‌లో ఇంజన్‍‌‌ను ఆఫ్ చేసే బటన్ మాత్రం లేదు.

సానుకూల అంశాలు
  • స్మూత్ ఇంజన్
  • స్మూత్ గేర్‌బాక్స్
  • ఆకర్షణీయమైన నూతన డిజైన్
  • సౌకర్యవంతమైన హ్యాండ్లింగ్,
  • సులభతరమైన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్,
  • సస్పెన్షన్

ప్రతికూల అంశాలు

  • స్విచ్ గేర్ నాణ్యత
  • మధ్య స్థాయిలో యాక్సిలరేషన్
  • డిస్క్ బ్రేకులు లేకపోవడం.
హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 - 07
అంతిమ తీర్పు
ఇండియన్ మార్కెట్లో ఉన్న మరే ఇతర కమ్యూటర్ బైకులో లేని సాంకేతిక ఐ3ఎస్ ఇందులో కలదు. మీరు కమ్యూటర్ బైకును ఎంచుకోవలనుకుంటే స్విచ్ గేర్‌ నాణ్యత మరియు డిస్క్ బ్రేకులు చాలు అనుకునే వారికి స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 ఒక గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఇండియన్ మార్కెట్లో స్ల్పెండర్ భారీ విజయాన్ని సాధించడానికి గల ముఖ్య కారణం, వారు ఎంచుకునే ఈ బైకు ఎటువంటి పరిస్థితులలో కూడా అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది.
Most Read Articles

English summary
Hero Splendor iSmart 110 Road Test Review — The Smartest Commuter Yet?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X