13 లక్షల ఖరీదైన హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైకు ఫస్ట్ రైడ్ రివ్యూ...

Written By:

హోండా మోటార్ సైకిల్స్ అనగానే, షైన్, యూనికార్న్ వంటి బైకులో గుర్తొస్తాయి. కానీ హోండా నుండి 13 లక్షల రుపాయల ఖరీదైన బైకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా...? కానీ ఇది నిజం, హోండా టూ వీలర్స్ ఈ ఏడాది విపణిలోకి ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది.

హోండా టూ వీలర్ ఇండియా తమ హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్ అడ్వెంచర్ సామర్థ్యాలను పరీక్షించే అవకాశం డ్రైవ్‌స్పార్క్ బృందానికి కల్పించింది. ఇవాళ్టి బైక్ రివ్యూ కథనంలో... హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైక్ టెస్ట్ రైడ్ అనుభవం.....

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

1986 నుండి 1989 కాలం మధ్య జరిగిన ప్యారిస్-డకార్ ర్యాలీలో హోండా ఎన్ఎక్స్ఆర్750 బైకు ఆధిపత్యం చెలాయించింది. అప్పట్లో డెసర్ట్ క్వీన్‌గా ఈ ఎన్ఎక్స్ఆర్ 750 పేరుగాంచింది.

ఇప్పుడు, 2017 లో డకార్ ర్యాలీ విక్టరీ ఎన్ఎక్స్ఆర్ 750 బైకు ప్రేరణతో హోండా టూ వీలర్స్ ఆఫ్రికా ట్విన్ సిఆర్ఎఫ్1000 ఎల్ డిసిటి అడ్వెంచర్ బైకును విడుదల చేసింది.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

హోండా ఆఫ్రికా ట్విన్ సిఆర్ఎఫ్1000 ఎల్ డిసిటి అడ్వెంచర్ బైకులో క్లచ్ మరియు గేర్ లీవర్స్ ఉండవు. ఆశ్చర్యపోయారా...? నిజమే, ప్రత్యేకించి అడ్వెంచర్ రైడింగ్ కోసం అభివృద్ది చేసిన ఇందులో గేర్ల మార్పిడి కోసం డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) అందివ్వడం జరిగింది.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) అంటే ఏమిటి ?

డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్లను ఆటోమేటిక్‌గా మారుస్తూ ఉంటుంది. ఇందులో క్లచ్ మరియు గేర్ లీవర్ లేకపోవడంతో రైడర్ కేవలం యాక్సిలరేటర్ మరియు బ్రేకుల మీద దృష్టి సారిస్తే సరిపోతుంది.

అయినప్పటికీ గేర్లను మన అవసరాన్ని బట్టి మార్చుకోవాలనుకుంటే, హ్యాండిల్ బార్ మీద అప్ అండ్ డౌన్ ట్రిగ్గర్ బటన్‌లు ఉంటాయి. వీటిని ప్రెస్ చేయడం ద్వారా గేర్లుతూ ఉంటాయి. ఒక వేళ మీరు గేర్లను మార్చడం మరిచిపోతే వేగాన్ని బట్టి అదే ఆటోమేటిక్‌గా గేర్లను మార్చేసుకుంటుంది.

DCT ట్రాన్స్‌మిషన్‌లోని ఆటో మోడ్‌లో డి మరియు ఎస్ అనే మోడ్స్ ఉంటాయి. డి అనగా రోజూ వారి రైడింగ్ కోసం మరియు ఎస్ అనగా స్పోర్టి రైడింగ్ కోసం....

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఆఫ్రికా ట్విన్ డిసిటి రైడింగ్...

బైకు దగ్గరకెళ్లాకా హ్యాండిల్ బార్ మీద ఉన్న బటన్స్ చూసి తొలుత కన్ఫూజన్‌కు గురయ్యాము, అయితే హోండా ప్రతినిధులు వాటి గురించి వివరించాక, బైక్ స్టార్ చేసి డిసిటి ట్రాన్స్‌మిషన్ గల ఆఫ్రికా ట్విన్ రైడ్ ప్రారంభించాము.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

కొద్ది దూరం పాటు రైడ్ చేసిన అనంతరం, ఆఫ్రికా ట్విన్ తేలికగా, పొడవాటి ట్యాంక్‌తో ఎత్తైన నిర్మాణం ఉండటంతో సౌకర్యవంతమైన రైడింగ్ ఫీల్ కలిగింది. ప్రత్యేకించి ఎగుడుదిగుడు రోడ్ల మీద, నిల్చుని మరియు కూర్చుని రైడ్ చేస్తున్నపుడు ప్రతి క్షణం ఆఫ్రికా ట్విన్‌లోని కంఫర్ట్ ఫీల్ అయ్యాము.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

సాంకేతికంగా హోండా ఆఫ్రికా ట్విన్ సిఆర్ఎఫ్1000ఎల్ డిసిటి అడ్వెంచర్ బైకుసో 999.11సీసీ కెపాసిటి గల లిక్విడ్‌తో చల్లబడే ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది దాదాపు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో అత్యద్భుతమైన పనితీరును కనబరిచింది.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

అడ్డకుంలు ఎదురైనప్పుడు క్లచ్ ప్రెస్ చేస్తూ బైకును కంట్రోల్ చేసే అవసరం లేకపోయింది కాబట్టి, రాళ్లతో నిండిన ఏట వాలు భూబాగాల్లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బైకును ఆపడం, మళ్లీ వెంటనే రైడ్ ప్రారంభించడం చాలా తేలికగా, సులభంగా అనిపించింది.

అయితే, ఇందులో ఉన్న 6-స్పీడ్ డిసిటి ట్రాన్స్‌మిషన్‌, మనం బైకు వేగాన్ని తగ్గిస్తున్నపుడు మనకు తెలియకుండా గేర్లను మార్చేసి ఉంటుంది. ఆఫ్ రోడ్ మీద అడ్వెంచర్స్ చేస్తున్నపుడు ఇంతకన్నా బెస్ట్ ఫీచర్ ఏముంటింది చెప్పండి.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

హోండా టూ వీలర్స్ ఇందులో హోండా సెలక్టబుల్ టార్క్ కంట్రోల్(HSTC) సిస్టమ్ అందించింది. దీని ద్వారా రైడింగ్ అవసరాన్ని బట్టి కావాల్సినంత టార్క్ మాత్రమే ఉత్పత్తి చేసేలో ఇంజన్‌ను సెట్ చేసుకోవచ్చు.

HSTC ద్వారా ఇంజన్ టార్క్‌ మూడు లెవల్స్‌లో ఉత్పత్తి చేస్తుంది. 1, 2 మరియు 3 లెవల్స్‌లో పరిమిత టార్క్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనకు ఈ ఆప్షన్‌ వద్దనుకుంటే HSTC సిస్టమ్‌మ్‌ను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా HSTC లో లెవల్ 3 టార్క్ సిస్టమ్ ఉంటుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైకులో 18-అంగుళాల పరిమాణంలో వెనుక చక్రానికి 150/70 ఆర్18 ఎమ్/సి 70హెచ్ టైరు మరియు 21-అంగుళాల పరిమాణం ఉన్న ముందు చక్రానికి 90/90-21ఎమ్/సి 54హెచ్ టైర్లు ఉన్నాయి. అయితే రెండూ కూడా ఫోక్ వీల్సే.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

అడ్వెంచర్ మోటార్ సైకిళ్లలో ఇంజన్, టైర్లు తర్వాత అతి ముఖ్యమైనది సస్పెన్షన్ సిస్టమ్, ముందు వైపున షోవా వారి 228ఎమ్ఎమ్ ట్రావెల్ ఉన్న 45ఎమ్ఎమ్ క్యాట్రిడ్జ్-టైప్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ కలదు. దీనిని పూర్తి స్థాయిలో అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం కలదు.

రియర్ సస్పెన్షన్ కోసం షోవా కంపెనీ తయారు చేసిన 46ఎమ్ఎమ్ సిలిండర్, రిమోట్ రిజర్వాయర్ మరియు లింకేజ్ గల 220ఎమ్ఎమ్ ట్రావెల్ ఉన్న అడ్జస్టబుల్ స్ప్రింగ ప్రిలోడెడ్ మోనో షాక్ అబ్జార్వర్ అందివ్వడం జరిగింది.

ఇందులో అందించిన ఆఫ్ రోడింగ్ పర్పస్ సస్పెన్షన్ సిస్టమ్ ఆఫ్ రోడ్ మార్గాలను ఎదుర్కొంటూ, రైడింగ్ రేంజ్ మొత్తం అద్భుతమైన పనితీరు కనబరిచింది.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

అడ్వెంచర్ బైకులో ఉండాల్సిన మరో అతి ముఖ్యమైన లక్షణ బ్రేకింగ్. ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైకులో ముందు వైపున 310ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న రెండు పెటల్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 256ఎమ్ఎమ్ చుట్టుకొలత గల సింగల్ పెటల్ డిస్క్ బ్రేక్ కలదు. సురక్షితమైన బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

బ్రేకింగ్ వ్యవస్థ చాలా బాగుంది. ముందు వైపు చక్రానికి ఏబిఎస్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది. అయితే, ఆఫ్ రోడింగ్‌లో ఉన్నపుడు రియర్ వీల్ ఏబిఎస్ డిసేబులు అయిపోతుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

ఇండియన్ మార్కెట్లో హోండా ఆఫ్రికా ట్విన్ డీల్....

ఆఫ్రికా ట్విన్ ఇండియాలో తయారవుతున్న హోండా వారి తొలి 1000సీసీ మోటార్ సైకిల్. దీని విడి పరికరాలను దిగుమతి చేసుకుని హర్యాణాలో ఉన్న హోండా మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ అవుతోంది.

ఇండియాలో తయారవుతున్నందున ఆన్ రోడ్ ధర మీద సుమారుగా రూ. 1.5 లక్షల వరకు ధర తగ్గుతుంది. ఇక ఆఫ్రికా ట్విన్ కు పోటీగా ఉన్న బైకులతో పోల్చుకుంటే దీని ధర చాలా తక్కువగా ఉంది.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

హోండా టూ వీలర్స్ ఇండియా ఇప్పటికీ ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్లను డీలర్ల వద్ద ప్రదర్శించడం లేదు. దేశవ్యాప్తంగా 22 నగరాలలో ఉన్న హోండా వింగ్ వరల్డ్ అవుట్ లెట్స్ ద్వారా మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

హోండా సిఆర్ఎఫ్1000ఎల్ ఆఫ్రికా ట్విన్ డిసిటి పూర్తి స్పెసిఫికేషన్లు:

ఇంజన్ కెపాసిటి 999.11సీసీ
గరిష్ట పవర్ 87బిహెచ్‌పి@7,500ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్ 91.9ఎన్ఎమ్@6,000ఆర్‌పిఎమ్
గరిష్ట వేగం 190కిమీ/గంటకు
గేర్‌బాక్స్ 6-స్పీడ్ డిసిటి
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 18.8-లీటర్లు
మైలేజ్ 21.8కిమీ/లీ
మొత్తం బరువు 245కిలోలు
సీట్ ఎత్తు 840/820(ఎస్‌టిడి పొజిషన్/ లో పొజిషన్)
వీల్ బేస్ 1,574ఎమ్ఎమ్
హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

తీర్పు

హోండా ఆఫ్రికా ట్వన్ ఒక సౌకర్యవంతమైన టూరింగ్ మోటార్ సైకిల్. బైకులో ఉన్న రైడింగ్ మోడ్స్ మరియు HSTC వినియోగంలో కాస్త నైపుణ్యం తెచ్చుకుంటే దీనిని మించిన బెస్ట్ అడ్వెంచర్ మరియు టూరింగ్ బైకు మరేది లేదని చెప్తారు!

హోండా ఆఫ్రికా ట్విన్ ఫస్ట్ రైడ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమేటిక్ క్లచ్ ఆపరేషన్‌తో పాటు, సంధర్బాన్ని బట్టి త్వరితంగా స్పందించే డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ స్టార్టింగ్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్‌ వంటివి ఉన్న సరసమైన ధరతో లభించే ఆఫ్రికా ట్విన్ ఇండియన్ మరియు మార్కెట్లలో ఉన్న దీని పోటీదారులకు గట్టి పోటినిస్తోంది.

అయితే, మీ అడ్వెంచర్ లైఫ్‌లోకి దీనిని చేర్చుకోవడం మీ మీదే ఆధారపడి ఉంటుంది. 1000సీసీ సెగ్మెంట్లో దీని కంటే బెటర్ అడ్వెంచర్ బైకు ఏదైనా మీకు నచ్చితే కామెంట్ రూపంలో మాతో పంచుకోండి...

English summary
Read In Telugu: honda africa twin dct review first ride
Story first published: Wednesday, September 13, 2017, 17:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark