హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ కంపెనీ తన హోండా సిబి 500 ఎక్స్ బైక్ ను మొట్టమొదటిసారిగా 2013 లో దేశీయ మార్కెట్లో ప్రారంభించింది. కంపెనీ ఈ బైక్ ను ప్రారంభించిన వెంటనే దాని డిజైన్ మరియు ప్రాక్టికాలిటీ వంటి వాటితో వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

తర్వాత కంపెనీ ఈ బైక్ ని 2016 లో ఒకసారి అప్‌డేట్ చేసింది, తిరిగి 2019 లో కూడా ఈ బైక్ మరోసారి అప్డేట్ చేయబడింది. కొన్ని సంవత్సరాల పాటు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని ఎదురుచూస్తున్న కొత్త హోండా సిబి 500 ఎక్స్ చివరకు భారత మార్కెట్లో అడుగుపెట్టింది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇటీవల ఈ కొత్త హోండా సిబి 500 ఎక్స్ బైక్ రైడ్ చేసే అవకాశం మాకు లభించింది. ఇది నగరంలో మరియు హైవేపై మంచి పర్ఫామెన్స్ చూపించింది. అయితే ఇప్పుడు ఈ బైక్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ వంటి విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

హోండా సిబి 500 ఎక్స్ డిజైన్ మరియు స్టైల్:

హోండా సిబి 500 ఎక్స్ లేయర్డ్ డిజైన్‌తో బాడీవర్క్ కలిగి ఉంది. ఇది చూడటానికి ఆఫ్రికా ట్విన్ బైక్ లాగా కనిపిస్తుంది. ఇందులో ఫ్లోయింగ్ ప్యానెల్స్‌తో పాటు షార్ప్ డిజైన్ లైన్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఆప్ ఫ్రంట్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, దాని పైనే పొడవైన అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ ఉంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

సిబి 500 ఎక్స్ బైక్ ఎక్స్‌టెండేడ్ రేడియేటర్ కవచాలతో, భారీ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. రియర్ ఫినిషింగ్ చాలా సరళంగా ఉండి, ఫస్ డిజైన్‌ను కలిగి ఉండదు. ఈ బైక్ యొక్క డిజైన్ మరియు స్టైలింగ్‌ విషయంలో ఇంజిన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎగ్జాస్ట్ డౌన్‌పైప్స్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

హోండా సిబి 500 ఎక్స్ రెండు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి మాట్టే గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ మరియు గ్రాండ్ ప్రిక్స్ రెడ్ కలర్స్. గ్రాండ్ ప్రిక్స్ రెడ్ దాని ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్‌తో నిగనిగలాడే పెయింట్ తో ఉంటుంది. ఈ బైక్ లో ముందు మరియు వెనుక వైపున ఉన్న పేటల్ డిస్క్ డిజైన్ దాని స్టైలింగ్ కి మరింతగా తోడ్పడతాయి.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

హోండా సిబి 500 ఎక్స్ బైక్ లిక్విడ్-కూల్డ్, 471 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 46.93 బిహెచ్‌పి మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 43.2 ఎన్ఎమ్‌ టార్క్ విడుదల చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో వెనుక చక్రంను స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ ద్వారా నడుస్తుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ బైక్ స్టార్ట్ అయినప్పుడు శబ్దం కొంత బిగ్గరగా వస్తుంది. బైక్ వేగం పెరిగేకొద్దీ శబ్దం మరింత వినబడుతుంది. బైక్ యొక్క వేగం పెరిగే వరకు యాక్సలేటర్ సరళంగా మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంజిన్ యొక్క టార్క్ 2,500 ఆర్‌పిఎమ్ నుండి 6,500 ఆర్‌పిఎమ్‌కి మారినప్పుడు ఇంజిన్ మరింత ఉత్తమంగా అనిపిస్తుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

రోల్-ఆన్ యాక్సలరేషన్ సులభంగా నిర్వహించబడతాయి. కేవలం ఐదు సెకన్లలో 6 వ గేర్‌లో గంటకు 70 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది. టాప్ గేర్, కేవలం 7 సెకన్లలో గంటకు 70 నుంచి 120 కిమీ వరకు వేగవంతం చేయగలదు. హోండా సిబి 500 ఎక్స్ యొక్క గరిష్ట వేగం గంటకు 170 కిమీ.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

రైడింగ్ మరియు హ్యాండ్లింగ్:

హోండా సిబి 500 ఎక్స్ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్‌లో మృదువైన సీట్లు మరియు సౌకర్యవంతమైన రైడ్ కోసం సస్పెన్షన్ సెటప్ ఉంది. ఈ సస్పెన్షన్ సెటప్ కారణంగా ఎటువంటి కఠినమైన రోడ్డులో అయినా సజావుగా రైడ్ చేయడానికి అనుమతిస్తుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ట్రిపుల్ డిజిట్ వేగంతో ప్రయాణించేటప్పుడు, ఈ మోటారుసైకిల్ యొక్క స్ట్రెంత్ మరియు స్పీడ్ వంటివి రైడర్ కి అవగతం అవుతుంది. హైవేపై ప్రయాణించేవారికి నిజంగా ఈ బైక్ ఒక వరం. ఈ బైక్ 4,500 ఆర్‌పిఎమ్ వద్ద ట్విస్టీ రోడ్లపై రైడింగ్, వాహనదారుని ముఖంలో చిరునవ్వును తెస్తుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

హోండా సిబి 500 ఎక్స్ ‌బైక్ సాధారణంగా హార్డ్ రోడ్ ఆఫ్-రోడ్ బైక్ కాదు, సాఫ్ట్ రోడర్. హోండా సిబి 500 ఎక్స్ బైక్ రైడింగ్ అప్పుడు కూడా రైడర్ మరియు పిలియన్ కి చాలా సౌకర్యవంతమగా ఉంటుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

హోండా సిబి 500 ఎక్స్ ‌బైక్ ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి, డన్‌లాప్ ట్రయిల్‌మాక్స్ టైర్‌లను కలిగి ఉంది. ఇది ఆఫ్-రోడింగ్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ, రహదారిపై మంచి పట్టును కలిగి ఉంటుంది. ఇది సాండ్ మరియు కఠినమైన రోడ్లలో కూడా మంచి పనితీరుని చూపించింది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ బైక్ ముందు భాగంలో కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో 9-డిగ్రీస్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంది. అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ మరింత సరళమైనదిగా ఉంటుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ బైక్ యొక్క ముందు భాగంలో ఉన్న 19 ఇంచెస్ చక్రాలు మరియు వెనుక భాగంలో ఉన్న 17 ఇంచెస్ చక్రాలు ఆఫ్-రోడ్ కి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 310 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ కలిగి ఉంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, ఇద్న్హులో బ్రేకింగ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది, కావున రైడర్‌కు ఈ బ్రేకింగ్ సిస్టం అత్యవసర సమయంలో కూడా వెంటనే ప్రతిస్పందిస్తుంది కావున మంచి రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. హోండా సిబి 500 ఎక్స్ నిటారుగా ప్రయాణించే స్థానాన్ని కలిగి ఉంది మరియు సౌకర్యవంతమైన స్టాండ్-అప్ రైడింగ్ స్థానాన్ని అందించడానికి ఫుట్‌పెగ్‌లు ఉంచబడ్డాయి.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

830 మిమీ పొడవైన సీటు ఈ విభాగంలో ఇతర అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ల మాదిరిగానే ఉంటుంది. కావున రైడర్ చాలా హాయిగా రైడింగ్ చేయవచ్చు. హోండా సిబి 500 ఎక్స్ బరువు 199 కేజీలు. ఇది ఈ విభాగంలో తన ప్రత్యర్థి బైకులకన్నా తక్కువ బరువుని కలిగి ఉంది. అయితే మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇంపార్టెంట్ ఫీచర్స్:

హోండా సిబి 500 ఎక్స్ బైక్ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్, హోండా ఇగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్ ఇమ్మొబిలైజర్, ఫుల్ ఎల్ఇడి లైటింగ్, అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. దీనితో పాటు అనలాగ్ టాకోమీటర్ మరియు నెగటివ్ బ్యాక్లిట్ ఎల్సిడితో వస్తుంది. ఇది స్క్రీన్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, క్లాక్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మొదలైన అన్ని అవసరమైన రైడ్ సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఎల్‌సిడి స్క్రీన్ దిగువ కుడి వైపు డిజిటల్ రెవ్-కౌంటర్ కూడా ఉంది. హోండా సిబి 500 ఎక్స్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫంక్షన్‌తో హజార్డ్ లైట్స్ స్విచ్ కలిగి ఉంటుంది. రైడర్ గట్టిగా బ్రేక్ వేసినప్పుడు, మోటారుసైకిల్ ఇది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిచ్యువేషన్ అని గ్రహించి ఎమర్జెన్సీ లైట్లను ఆన్ చేస్తుంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన ఫీచర్.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

హోండా సిబి 500 ఎక్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది రూ. 6.87 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందించబడుతుంది. ఈ బైక్ సాహసప్రియులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది లాంగ్ డ్రైవ్ చేయడానికి అన్నివిధాలా తగినవిధంగా ఉంటుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ బైక్‌లో చాలా టాప్ ఫీచర్స్ లేనప్పటికీ, దాని అద్భుతమైన ఇంజిన్ మరియు రైడింగ్ డైనమిక్స్ కొనుగోలుదారుల డబ్బుకు ఏ మాత్రం నష్టం కలిగించదు. ఏది ఏమైనా హోండా సిబి 500 ఎక్స్అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందించింది. భారత మార్కెట్లో హోండా సిబి 500 ఎక్స్ బైక్ సుజుకి వి-స్ట్రోమ్ 650 మరియు బెనెల్లి టిఆర్‌కె 502 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ రాబోయే రోజుల్లో తన సిబి 500 ఎఫ్, సిబిఆర్ 500 ఆర్ బైక్‌లను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ బైక్‌లను స్థానికంగా తయారు చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా ఈ బైకులు ధరలోలు భవిష్యత్ లో తగ్గే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Honda CB500X First Ride Review. Read in Telugu.
Story first published: Saturday, March 27, 2021, 23:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X