హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ: ఇంజన్, పనితీరు, ఫీచర్లు మరియు పూర్తి రివ్యూ రిపోర్ట్

Written By:
Recommended Video - Watch Now!
Bangalore Helmet Ban For Non-ISI Models

హోండా టూ వీలర్స్ మార్కెట్లోకి స్కూటర్‌ను విడుదల చేసే ప్రతిసారీ విభిన్న కస్టమర్లను టార్గెట్ చేసుకుని పూర్తి స్థాయిలో విభిన్న ఉత్పుత్తులను తీసుకొస్తోంది. అందులో భాగంగానే నవీ క్రాసోవర్ స్కూటర్, క్లిక్ మరియు గ్రాజియా స్కూటర్లను విడుదల చేసింది.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

గ్రాజియా స్కూటర్ విడుదలకు ముందు, యువ కొనుగోలుదారుల కోసం హోండా నుండి డియో స్కూటర్ అందుబాటులో ఉండేది. అయితే, డియో స్కూటర్ కొన్ని సంవత్సరాల నుండి ఎలాంటి అప్‌డేట్స్‌కు గురికాకపోయిన రియల్ లైఫ్‌లో యంగ్ కస్టమర్లకు బెస్ట్ స్కూటర్‌గా నిలిచింది.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

ఇప్పుడు జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా టూ వీలర్స్, ప్రత్యేకించి యువ కొనుగోలుదారుల కోసం సరికొత్త గ్రాజియా స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియమ్ మరియు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో డియో కంటే బెస్ట్ ఛాయిస్‌గా రూపొందించింది.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

స్టైలింగ్

హోండా డిజైన్ బృందం యొక్క పనితీరు గ్రాజియా స్కూటర్ విషయంలో బయటపడింది. ఇందులో పదునైన డిజైన్, కండలు తిరిగిన శరీరాకృతి, డ్యూయల్ టోన్ ఫ్రంట్ డిజైన్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఎల్ఇడి హెడ్ ల్యాంప్‌తో అమ్ముడవుతున్న భారతదేశపు మొట్టమొదటి స్కూటర్ హోండా గ్రాజియా.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

హోండా గ్రాజియా స్కూటర్‌లో సరికొత్త డిజిటల్ మోనోక్రోమ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టాకో మీటర్ ఉన్నాయి. పగటి మరియు రాత్రి వేళల్లో వీటిని క్లియర్‌గా చూడవచ్చు. దీనికి క్రిందనే ఉన్న చిన్న ఎల్‌సిడి డిస్ల్పేలో టైమ్, ఫ్యూయల్ గేజ్, ఓడో మీటర్ మరియు ట్రిప్ మీటర్ వంటివి గమనించవచ్చు.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

గ్రాజియా స్కూటర్‌లో 4-ఇన్-వన్ ఇగ్నిషన్ లాక్ కలదు. ఇప్పుడు సీట్ అన్ లాక్ కూడా ఇక్కడి నుండే చేయవచ్చు. అద్భుతమైన అండర్ సీట్ స్టోరేజ్ దీని సొంతం. ఇంటి సరుకులు మరియు హెల్మెట్‌ కోసం 18-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌ కలదు.

ఈ స్కూటర్‌లో అదనంగా మరో చిన్న స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ కలదు. ఇక్కడ స్కూటర్ రైడ్ చేస్తున్నపుడు స్మార్ట్ ఫోన్ భద్రపరుచుకోవచ్చు మరియు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

గ్రాజియా రియర్ డిజైన్ విషయానికి వస్తే, రెండుగా విడిపోయిన యాంగులర్ స్పోర్టివ్ గ్రాబ్ రెయిల్స్, త్రీ-పీస్ టెయిల్ లైట్ మరియు ఇండికేటర్ క్లస్టర్‌లో ఎల్ఇడి లైట్లకు బదులుగా హ్యాలోజియన్ లైట్లు ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

భారీ మైలేజ్‌నిచ్చే ఆరు భారతీయ స్కూటర్లు

ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

ఇంజన్ మరియు పనితీరు

హోండా టూ వీలర్స్ గ్రాజియా స్కూటర్‌లో 124.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. హోండా ఆక్టివాలో ఉన్న ఇదే ఇంజన్ 8బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

తక్కువ యాక్సిలరేషన్ వద్ద బెస్ట్ పవర్ అవుట్‌పుట్ ఇస్తుంది. అన్ని రకాల రహదారుల్లో యాక్సిలరేషన్‌కు అనుగుణంగా పవర్ లభిస్తుంది. అంతే కాకుకండా హోండా గ్రాజియా సంతృప్తికరమైన లీటర్‌కు 47కిమీల మైలేజ్ ఇస్తోంది. ఇందులో 5.3-లీటర్ కెపాసిటిగల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ట్యాంకును ఒక్కసారి పూర్తిగా నింపితే 250కిలోమీటర్ల వరకు రైడ్ చేయవచ్చు.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

రైడ్ మరియు హ్యాండ్లింగ్

యువత లైఫ్ స్టైల్‌కు దగ్గరగా డిజైన్ చేసిన గ్రాజియా స్కూటర్‌లో సౌకర్యవంతమైన మరియు నిటారుగా కూర్చుని రైడింగ్ చేసే పొజిషన్ కలదు. కుషనింగ్ చక్కగా ఉన్న సీటు ఉండటంతో ఎన్ని కిలోమీటర్లయినా... ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా రైడ్ చేయవచ్చు, ఆరు అడుగులు ఎత్తున్న వారు కూడా గ్రాజియాను ఎంచుకోవచ్చు.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

అత్యుత్తమ రైడింగ్ ఫీల్ కల్పించేందుకు హోండా తమ గ్రాజియా స్కూటర్‌లో ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ అందించింది.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 190ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ అనుసంధానం కలదు. హోండా వారి వివేకవంతమైన కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ రావడంతో బ్రేకులు అప్లే చేసిన తరువాత తక్కువ దూరంలోనే స్కూటర్ ఆగుతుంది.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

గ్రాజియా స్కూటర్‌లో ఇరువైపులా ఉన్న 5-స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ట్యుబ్ లెస్ టైర్లను కలిగి ఉన్నాయి. సియట్ లేదా ఎమ్‌ఆర్ఎఫ్ మీకు నచ్చిన టైర్లతో గ్రాజియాను ఎంచుకోవచ్చు. అత్యుత్తమ స్టెబిలిటి కోసం ఫ్రంట్ వీల్ 12-అంగుళాల మరియు రియర్ వీల్ 10-అంగుళాల పరిమాణంలో ఉన్నాయి.

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్టైలిష్ మరియు అధునాతన డిజైన్ శైలిలో వచ్చిన హోండా గ్రాజియా ఈ రోజుల్లో మోడ్రన్ స్కూటర్‌ను తలపిస్తోంది. అయితే, హోండా గ్రాజియా టాప్ ఎండ్ వేరియంట్ డిఎల్ఎక్స్ ధర రూ. 62,269 లుగా ఉంది. ప్రీమియమ్ స్కూటర్ అయినప్పటికీ ధరకు తగ్గ ఫీచర్లను మరికొన్ని చేర్చి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం!!

హోండా గ్రాజియా టెస్ట్ రైడ్ రివ్యూ

మరి, హోండా గ్రాజియా యువత మనసును దోచుకుంటుందా... అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. యువ కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్న ఏకైక బడ్జెట్ ఫ్రెండ్లీ మోడ్రన్ స్కూటర్ గ్రాజియా. అధునాతన డిజైన్, పూర్తి స్థాయిలో కొత్త ఫీచర్లు మరియు రీఫ్రెష్ లుక్ గ్రాజియాకు మంచి సక్సెస్ సాధించిపెట్టనున్నాయి. మరి హోండా గ్రాజియా మీకు నచ్చిందా...? గ్రాజియా గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Honda Grazia First Ride: Road Test Review

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark