రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

భారత మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా చివరకు సరికొత్త "హైనెస్ సిబి 350" తో ప్రీమియం మరియు సరసమైన రెట్రో-మోడరన్ క్రూయిజర్‌ బైక్ ను తన లైనప్‌లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త హోండా హైనెస్ సిబి 350 బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ద్విచక్ర వాహనాల విభాగంలో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయించిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు హోండా ఇచ్చిన సరైన సమాధానమే ఈ హైనెస్ సిబి 350. హోండా కంపెనీ ఈ కొత్త హైనెస్ సిబి 350 బైక్ లో లేటెస్ట్ ఫీచర్స్ అందించడమే కాకుండా మరియు రెట్రో-మోడరన్ స్టైలింగ్‌తో నిండి ఉంటుందని మరియు మంచి ఇంధన సామర్థ్యము కలిగి ఉంటుందని హామీ ఇచ్చింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హోండా హైనెస్ సిబి 350 భారత మార్కెట్లో 2020 అక్టోబర్ నెలలో అరంగేట్రం చేసింది. కానీ లాంచ్ అయిన చాలా కాలం తర్వాత ఈ కొత్త ప్రీమియం రెట్రో-మోడరన్ క్రూయిజర్ బైక్ రైడ్ చేసే అవకాశం మాకు లభించింది. ‌ఈ కొత్త హైనెస్ సిబి 350 బైక్ వాహనదారులకు ఏ మాత్రం అనుకూలంగా ఉంది, దేశీయ మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కి ప్రత్యర్థిగా ఉండగలదా.. అనే ఇంట్రస్టింగ్ విషయాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం..రండి.

MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

డిజైన్ మరియు స్టైల్ :

హోండా హైనెస్ సిబి 350 భారతదేశంలో అడుగుపెట్టిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి ప్రీమియం 350 సిసి క్రూయిజర్ మోటార్ సైకిల్ ఆఫర్. ఇది లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ థీమ్‌తో వస్తుంది. ఇది బ్రాండ్ యొక్క ఐకానిక్ 'సిబి' సమర్పణల నుండి ప్రేరణ పొందవచ్చు. హైనెస్ సిబి 350 దాని రెట్రో డిజైన్ థీమ్‌కు అనుగుణంగా, చుట్టూ క్రోమ్‌తో నిండి ఉంటుంది. ఇందులో హెడ్‌ల్యాంప్ కవర్లు, ప్రెంట్ అండ్ రియర్ ఫెండర్లు, హ్యాండిల్‌బార్లు, ఎగ్జాస్ట్ పైపులు, టెయిల్ లైట్ కవర్లు మరియు ఇంజిన్‌ వంటివి ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హోండా హైనెస్ సిబి 350 బైక్ యొక్క ముందు భాగం నుంచి మొదలు పెట్టినట్లయితే, ఈ మోటార్ సైకిల్లోని 'లో అండ్ హై బీమ్' ఫంక్షన్స్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ కలిగి ఉంటుంది. హెడ్‌ల్యాంప్ యూనిట్, పైన పేర్కొన్న విధంగా క్రోమ్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది.

MOST READ:పాకిస్థాన్ క్రికెటర్ 'షోయబ్ మాలిక్' కార్ యాక్సిడెంట్ ; తృటిలో తప్పిన పెను ప్రమాదం

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హెడ్‌ల్యాంప్ యూనిట్ కి ఇరువైపులా సర్క్యులర్ ఎల్ఇడి టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్. ఫ్రంట్-ఎండ్ సస్పెన్షన్ సెటప్, క్రోమ్-ఫినిష్డ్ ఫెండర్లు మరియు టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడా చూడవచ్చు. హైనెస్ సిబి 350 స్టైలిష్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది, ఇది పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇక హైనెస్ సిబి 350 బైక్ యొక్క సైడ్స్ విషయానికి వస్తే, ఇది లార్జ్ స్కల్‌ప్‌టెడ్ (శిల్ప) ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది ( ఫ్యూయెల్ ట్యాంక్ 15-లీటర్ల ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉంటుంది). ఇది వేరియంట్‌ను బట్టి సింగిల్-టోన్ మరియు డ్యూయల్-టోన్ కలర్ అప్సన్స్ పరిధిలో పూర్తవుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ హెరిటేజ్-ఇన్స్పైర్ బ్యాడ్జింగ్‌తో వస్తుంది, దీనిపై క్రోమ్ తో పూర్తయిన 'హోండా' అక్షరాలను చూడవచ్చు. ఇది హోండా యొక్క ఇతర మోడళ్లలో కనిపించే వింగ్స్‌ మాదిరిగా కాకుండా, కొత్తగా ఉంటుంది.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హైనెస్ సిబి 350 బైక్ లో సింగిల్ పీస్ సీటు ఉంటుంది. ఇది వెడల్పుగా ఉండటమే కాకుండా, చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇందులో క్రోమ్‌లో పూర్తి చేసిన ఎగ్జాస్ట్ పైపులు, రైడర్ సీటు క్రింద ఉన్న హైనెస్ సిబి 350 బ్యాడ్జింగ్ వంటివి క్రోమ్ తో అలంకరించబడి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హోండా హైనెస్ సిబి 350 యొక్క వెనుక రూపకల్పన విషయానికి వస్తే, ఇక్కడ క్రోమ్ ఫినిష్డ్ ఫెండర్‌లతో రెట్రో-మోడరన్ డిజైన్‌ను కలిగి ఉటుంది. ఇది టెయిల్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్‌తో అనుసంధానించబడి ఉంటుంది, ఇవి రెండూ ఎల్‌ఇడి యూనిట్లు. క్రోమ్ అల్లాయ్ వీల్స్‌తో సహా అనేక బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్‌తో భర్తీ చేయబడుతుంది. ఇవి బైక్ కి మంచి ఆకర్షణీయమైన డిజైన్ ని ఇస్తుంది.

MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇంపార్టెంట్ ఫీచర్స్:

హోండా హైనెస్ సిబి 350 లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. హోండా హైనెస్ సిబి 350 చుట్టూ ఎల్ఇడి లైటింగ్ వస్తుంది. ముందు చెప్పినట్లుగానే హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్ యూనిట్లు మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ విషయానికి వస్తే, కొత్త హోండా హైనెస్ సిబి 350 సింగిల్ పాడ్ యూనిట్‌ను కలిగి ఉంది. క్లస్టర్‌లో అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు, దిగువన చిన్న డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది. ఈ డిజిటల్ స్క్రీన్ అదనపు సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఇందులో రెండు ట్రిప్ మీటర్లు, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, ​​ఫ్యూయెల్ గేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటివి ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇన్స్ట్రుమెంట్ పాడ్ పక్కన, సైడ్-స్టాండ్ ఇండికేటర్, ఎబిఎస్, టర్న్ సిగ్నల్స్, ఇంజిన్ చెక్ లైట్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కోసం టెల్-టేల్ సిగ్నేచర్స్ వంటి వాటిని కూడా హోండా హైనెస్ సిబి 350 కలిగి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ హోండా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ (హెచ్‌ఎస్‌విసి) తో పాటు కనెక్ట్ చేయబడిన టెక్నాలజీతో వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ హోండా యొక్క రోడ్‌సింక్ యాప్ ఉపయోగించి బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు జత చేయవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఫోన్‌తో అనుసంధానించబడిన తర్వాత, టెక్నాలజీ ఇన్‌కమింగ్ కాల్‌ల కోసం వాయిస్ అలెర్ట్ ను అందిస్తుంది. అంతే కాకుండా మెసేజెస్ మరియు నావిగేషన్‌ను చదువుతుంది, అదే సమయంలో మ్యూజిక్ కంట్రోల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. టెక్ ఉద్దేశించిన విధంగా ఇది పనిచేయడానికి, రైడర్ వారి హెల్మెట్లలో ఇంటర్‌కామ్ లేదా కొన్ని స్పీకర్లను వ్యవస్థాపించాల్సి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పక్కన మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ఒక యుఎస్‌బి సాకెట్ కలిగి ఉంటుంది. అయినప్పటికీ, స్టాండర్డ్ టైప్-ఎ పోర్ట్‌కు బదులుగా హోండా మరింత ఆధునిక టైప్-సి పోర్ట్‌ను అందించింది. ప్రయాణంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక అడాప్టర్‌ను పొందవలసి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ క్రింద, హోండా హైనెస్ సిబి 350 డ్యూయల్ హార్న్స్ కలిగి ఉంది. డ్యూయల్-హార్న్ టాప్-స్పెక్ 'డిఎల్ఎక్స్ ప్రో' వేరియంట్లో మాత్రమే ఉంటుంది, బేస్ మోడల్ లో కేవలం ఒకే హార్న్ కలిగి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నుండి హ్యాండిల్‌బార్‌లకు దూరంగా వెళ్లే కొద్దీ, ఎడమ వైపు వేర్వేరు బటన్లను పొందుతుంది. ఈ బటన్లు ఇన్స్ట్రుమెంట్ పాడ్‌లో చిన్న స్క్రీన్‌లో ప్రదర్శించబడే విభిన్న సమాచారం మధ్య త్వరగా మారడానికి అనుమతిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఎడమ వైపు హ్యాండిల్‌బార్‌లో హార్న్ మరియు ఇండికేటర్ స్విచ్‌లు కూడా ఉన్నాయి. ఏదేమైనా, సాధారణ హోండా మాదిరిగా కాకుండా, రెండింటి యొక్క స్థానం తారుమారుగా ఉంటుంది. వాహనదారునికి ఇది అలవాటుపాడటానికి కొంత సమయం పడుతుంది. వెనుక భాగంలో హై-బీమ్ మరియు పాస్-స్విచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. హాజర్డ్ స్విచ్‌తో పాటు ఇంజిన్ కట్-ఆఫ్ మరియు ఇగ్నిషన్ కంట్రోల్స్ తో కూడిన రైట్ హ్యాండిల్‌బార్ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హోండా హైనెస్ సిబి 350 పొడవైన సింగిల్-పీస్ సీటును కలిగి ఉంటుంది. ఇది రైడర్ కి మరియు వెనుక కూర్చునే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. వెనుక భాగంలో పట్టుకోడానికి కూడా అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హోండా హైనెస్ సిబి 350 యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక సస్పెన్షన్ కోసం డ్యూయల్ షాక్-అబ్జార్బర్స్ సెటప్ ఉన్నాయి. ముందు మరియు వెనుక వైపున వరుసగా 310 మిమీ మరియు 240 మిమీ డిస్క్ ద్వారా బ్రేకింగ్ నిర్వహించబడుతుంది. స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఎబిఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హోండా హైనెస్ సిబి 350 బైక్ యొక్క ముందు భాగంలో 100/90 ఆర్19 ప్రొఫైల్ వీల్ మరియు వెనుక వైపు 130/70 ఆర్ 18 ప్రొఫైల్ వీల్స్ ఉంటాయి. హోండా హైనెస్ సిబి 350 అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ తో స్టాండర్డ్ గా వస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇంజిన్ :

రివ్యూలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, హోండా హైనెస్ సిబి 350 బైక్ రైడింగ్. కావున ఈ బైక్ ఎలా నడపాలి అనే విషయాన్ని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హోండా హైనెస్ సిబి 350 సరికొత్త 348.36 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5500 ఆర్‌పిఎమ్ వద్ద 20.8 బిహెచ్‌పి మరియు 3000 ఆర్‌పిఎమ్ వద్ద 30 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది, అంతే కాకుండా ఇది అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్ గా కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

మోటారుసైకిల్లోని మరో ముఖ్యమైన అంశం ఎగ్జాస్ట్ నోట్. హైనెస్ సిబి 350 రాస్పీ ఎగ్జాస్ట్‌తో వస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. హైనెస్ సిబి 350 లోని ఎగ్జాస్ట్ నోట్ దాని ప్రత్యర్థి అయిన రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350 కంటే చాలా అనుకూలంగా ఉంటుంది. హై రివ్స్ వద్ద కూడా హైనెస్ సిబి 350 ప్రత్యర్థుల కంటే ఎక్కువ స్పోర్టిగా అనిపిస్తుంది.

Engine 4-stroke Air-Cooled
Displacement 348.36cc
Power (bhp) 20.8bhp 5500rpm
Torque (Nm) 30Nm 3000rpm
Gearbox 5-Speed
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

పెర్ఫామెన్స్ & హ్యాండ్లింగ్ :

ఇక హైనెస్ సిబి 350 బైక్ యొక్క పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఇది మంచి లో-ఎండ్ టార్క్ అందిస్తుంది. మొదటి రెండు గేర్లలో టార్క్ యొక్క ఇన్స్టంట్ రష్ అందుబాటులోఉంటుంది కావున మోటారుసైకిల్ తక్షణమే ముందుకు సాగుతుంది. ఇంజిన్ స్మూత్ గా నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి ప్రకంపనలకు అవకాశం లేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

5-స్పీడ్ గేర్‌బాక్స్ స్లిక్ గేర్ చేంజెస్ అందిస్తుంది. లైట్ క్లచ్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ప్రత్యేకించి హైవేపై అధిక వేగంతో కూడా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది రైడర్ కి చాల అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

లో ఎండ్ టార్క్ ఉన్నప్పటికీ, సెకండ్ గేర్‌లో బైక్ గంటకు 10 నుంచి 15 కి.మీ వేగంతో వెళ్ళడానికి కొంత కష్టపడుతుంది. అయినప్పటికీ ఇదిదాదాపు ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. రైడర్ కి మంచి విశ్వాసాన్ని కలిగిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఈ బైక్ ఎమ్ఆర్ఎఫ్ రబ్బరుతో వస్తుంది కావున, ఇది తడి మరియు పొడి ప్రదేశాలలో కూడా మంచి పట్టుకు అందిస్తుంది. సస్పెన్షన్ సెటప్ మృదువైనది మరియు ఇది చాలా తేలికగా ఉండటం వల్ల, గుంతలు మరియు పొడవైన స్పీడ్ బ్రేకర్లను సులభంగా దాటగలదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హైనెస్ సిబి 350 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో బ్రేక్స్ చాలా షార్ప్ గా పనిచేస్తాయి. ఈ బైక్ కి ఇరువైపులా ఉన్న డిస్క్ బ్రేక్‌లు మోటారుసైకిల్‌ను త్వరగా ఆపడానికి సహాయపడతాయి.

ఈ బైక్ మా వద్ద కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటం వల్ల ఈ మోటారుసైకిల్ యొక్క ఖచ్చితమైన ఇంధన-సామర్థ్యాన్ని పరీక్షించలేకపోయాము. సిబి 350 బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని యావరేజ్ ఫ్యూయెల్ ఎఫీషియన్సీ ఇండికేటర్ ఒక లీటర్ కి 29 కిలోమీటర్ల పరిధిని అందించింది. ఈ మైలేజ్ ఈ మోటారుసైకిల్‌ యొక్క పరిమాణానికి సరైనదని చెప్పాలి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఈ మోటారుసైకిల్‌లో రైడర్ కూర్చునే స్థానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో రైడర్ సీటు విస్తృతంగా ఉంటుంది. ఈ సీట్ లాంగ్ జర్నీకి చాలా అనుకూలంగా ఉంటుంది. పిలియన్ సీటు వెడల్పుగా ఉండటమే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

వేరియంట్స్, కలర్స్ మరియు ధర :

హోండా హైనెస్ సిబి 350 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి డిఎల్ఎక్స్ మరియు డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్స్. హైనెస్ సిబి 350 యొక్క బేస్ 'డిఎల్‌ఎక్స్' వేరియంట్ ధర రూ. 1.86 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ). ఈ వేరియంట్ మూడు సింగిల్-టోన్ పెయింట్ స్కీమ్ పరిధిలో అందించబడుతుంది. ఇందులో ప్రీసియస్ రెడ్ మెటాలిక్, మాట్టే మార్షల్ గ్రీన్ మెటాలిక్ మరియు పెర్ల్ నైట్ స్టార్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

టాప్-స్పెక్ హోండా హైనెస్ సిబి 350 డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.92 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ). టాప్-స్పెక్ మోడల్ మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో అందించబడుతుంది. అవి మాట్టే స్టీల్ బ్లాక్ మెటాలిక్ / మాట్టే మ్యాసీవ్ గ్రే మెటాలిక్, ఈస్తటిక్ బ్లూ మెటాలిక్ / వర్చువస్ వైట్ & పెర్ల్ నైట్ స్టార్ బ్లాక్ / స్పియర్ సిల్వర్ మెటాలిక్ కలర్స్.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

కాంపిటీషన్ మరియు ఫాక్ట్ చెక్ :

హోండా హైనెస్ సిబి 350 బైక్ భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ప్రవేశపెట్టారు. అయితే ఇది మాత్రమే కాకుండా బెనెల్లి ఇంపీరియల్ 400 వంటి వాటికి కూడా ఇది ప్రత్యర్థిగా ఉంటుంది.

Specs Honda H'ness CB 350 Royal Enfield Meteor 350 Benelli Imperiale 400
Engine Displacement 348.36cc 349cc 374cc
Power 20.8bhp 5500rpm 20.2bhp 6100rpm 20.7bhp 6000rpm
Torque 30Nm 3000rpm 27Nm 4000rpm 29Nm 3500rpm
Gearbox 5-Speed 5-Speed 5-Speed
Kerb Weight 181Kg 191Kg 205Kg
Fuel Tank Capacity 15-Litres 15-Litres 12-Litres
Starting Price Rs 1.86 Lakh Rs 1.79 Lakh Rs 1.99 Lakh
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

వెర్డిక్ట్స్ :

మోడ్రన్-క్లాసిక్ క్రూయిజర్ విభాగంలో హోండా హైనెస్ సిబి 350 బైక్ అద్భుతమైన సమర్పణ. హైనెస్ సిబి 350 రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను కోరుకోని వారికి ఖచ్చితంగా సరిపోతుంది. ఈ బైక్ మంచి సామర్థ్యము కలిగి ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇందులో బాగా నచ్చిన విషయాలు:

  • ఇంజిన్ రీఫైన్మెంట్
  • లైట్ క్లచ్ మరియు స్మూత్ గేర్‌షిఫ్ట్‌లు
  • ఎగ్జాస్ట్ నోట్
  • ఇందులో నచ్చని విషయాలు:

    • పిలియన్ సీటు గట్టిగా ఉంటుంది
    • బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో ప్రత్యేకంగా లభించడం

Most Read Articles

English summary
Honda H’ness CB350 First Ride Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X