Ola S1 Pro రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్. ఈ స్కూటర్ మార్కెట్లో విడుదల కాకముందునుంచే ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతూనే ఉంది. ఈ కారణంగానే బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో పొందగలిగింది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే Ola Electric Scooter బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ స్కూటర్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు పనితీరు వంటి వాటి గురించి ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహన లేదు.

మేము ఇటీవల Ola Electric యొక్క S1 Pro Scooter ను బెంగుళూరు నగరం శివార్లలో రైడ్ చేసాము, కావున Ola Electric Scooter పై మీకున్న సందేహాలన్నింటికీ అద్భుతమైన సమాధానం ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా.. మీ కోసం.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro స్పెసిఫికేషన్స్:

S1 మరియు S1 Pro యొక్క స్పెసిఫికేషన్‌లను గురించి మనం ఇప్పటికే మునుపటి చాలా కథనాలతో తెలుసుకున్నాము. కానీ మేము ఇటీవల Ola S1 Pro స్కూటర్ రైడ్ చేసాము. అయితే ఈ స్కూటర్ రైడ్ చేయటానికి ముందు, ఇందులోని స్పెక్స్‌ పరిశీలించాము.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro స్కూటర్ 3.97 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఇది 5.5 kW ఎలక్ట్రిక్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 58 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

Ola కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 6 గంటల 30 నిమిషాలలో బ్యాటరీని 0-100% ఛార్జ్ చేస్తుంది. అయితే వీటికి అనుగుణంగా Ola దేశవ్యాప్తంగా ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. కంపెనీ ప్రారంభించే ఈ హైపర్‌చార్జర్‌లు బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయగలవు. ఇవి కేవలం 18 నిమిషాల్లోనే 75 కిలోమీటర్ల పరిధిని అందించగల చార్జింగ్‌ను చేసుకోగలదు.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

S1 Pro స్కూటర్ కేవలం 3 సెకన్లలో 0-40 km/h నుండి వేగవంతం అవుతుంది. అయితే 60km/h కేవలం 5 సెకన్లలోనే చేరుకుంటుంది. మొత్తానికి ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro రైడింగ్ ఇంప్రెషన్స్:

మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడింగ్ ప్రారంభించిన వెంటనే, మా ప్రధాన లక్ష్యం ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరుకు అనుకూలంగా ఉందా.. లేదా, మరియు ఎలాంటి పనితీరుని అందిస్తుంది అని తెలుసుకోవడం. నిజానికి ఇది మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ స్కూటర్ అద్భుతమైన పనితీరుతో మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro యాక్సలరేషన్ చాలా అద్భుతమైనది. భారతదేశంలో పర్ఫామెన్స్ మోటార్‌ సైక్లింగ్‌లో విప్లవాత్మకమైన ఒక నిర్దిష్ట 373 సిసి మోటార్‌సైకిల్‌తో మేము ఆఫ్-ది-లైన్ వేగాన్ని పోల్చడం ప్రారంభించాము. ఈ స్కూటర్ గరిష్టంగా 115 కిమీ/గం వేగాన్ని కలిగి ఉంది మరియు ఈ సంఖ్య చాలా త్వరగా వస్తుంది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

మేము రోడ్డుపైన గంటకు 90 కిమీల వేగాన్ని పొందగలిగాము. తరువాత యాక్సలరేషన్ హైపర్ మోడ్‌లో జరుగుతుంది. అయితే, హైపర్ మోడ్‌లో పరిధి తగ్గుతుంది. మేము స్టాండర్డ్ మోడ్‌ను కూడా ప్రయత్నించాము. ఇందులో ఈ స్కూటర్ గంటకు 0 నుంచి 30 కిమీ వరకు చేరుకుంది. ఆపైన అది కొంచెం నెమ్మదిస్తుంది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro స్టాండర్డ్ రైడ్ మోడ్‌లో గంటకు 60 కిమీ వేగంతో అగ్రస్థానంలో ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడ్ లో 180 కిలోమీటర్లు పరిధిని అందిస్తుంది.

ఈ స్కూటర్ 3 రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి స్టాండర్డ్, స్పోర్ట్స్ మరియు హైపర్ మోడ్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ రివర్స్ మోడ్‌ను కూడా పొందుతుంది. ఈ మోడ్ సాధారణ రైడింగ్ కి వ్యతిరేఖ దిశలో చేయడానికి అనుమతిస్తుంది. ఇందులోని మోడ్‌లను బటన్‌లు/స్విచ్‌గేర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. హ్యాండిల్ కూడా అద్భుతంగా ఉంది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందువైపు సింగిల్ సైడెడ్ ఫోర్క్ మరియు వెనుకవైపు హారిజాంటల్ గా అమర్చబడిన మోనోషాక్‌పై నడుస్తుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే , ఈ స్కూటర్ ముందువైపు 220 మి.మీ డిస్క్ మరియు వెనుక వైపు 180 మి.మీ డిస్క్ ఉంటుంది. ఇందులోని బ్రేకులు చాలా షార్ప్ గా ఉంటాయి. కానీ ఈ స్కూటర్ ధర విషయంలో మాత్రం స్కూటర్ సాధించగల వేగాన్ని బట్టి, మేము ABS కూడా అవసరం అని భావించాము.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

మొత్తం మీద, Ola S1 Pro ఒక అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందించింది. కావున ఈ చిన్న రైడ్ మాకు తగినంత సంతృప్తికరంగా అనిపించలేదు, కావున త్వరలో వాస్తవ ప్రపంచంలో కూడా రైడ్ చేయనున్నాము. అప్పుడు మరింత సమాచారం మీ కోసం తీసుకువస్తాము.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro ఫీచర్స్ మరియు టెక్నాలజీ:

Ola S1 మరియు S1 Pro స్కూటర్లు రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ ఫీచర్లలో చాలా వరకు సెగ్మెంట్-ఫస్ట్‌ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ కారణంగానే ఈ స్కూటర్ ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందటంలో ప్రధాన పాత్ర పోషించాయి. భారతీయులమైన మనం వాటిని ఉపయోగించినా.. ఉపయోగించకపోయినా చాలా ఫీచర్లను కలిగి ఉండడాన్ని ఖచ్చితంగా ఇష్టపడతాము.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro స్కూటర్ డిజిటల్ కీ, ఇన్-బిల్ట్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్, మల్టిపుల్ రైడర్ ప్రొఫైల్‌లు, స్కూటర్ ట్రాకింగ్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే వీటిని కంట్రోల్ చేయడానికి స్మార్ట్‌ఫోన్ యాప్ ఉపయోగించుకోవాలి. ఇది ఒక రిమోట్ లాగా పనిచేస్తుంది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

అయితే, మేము రైడ్ చేసిన మోడల్ ప్రీ-ప్రొడక్షన్ మోడల్స్. టెస్టింగ్ సమయంలో, ఈ మోడల్‌లు ఉత్పత్తికి దగ్గరగా ఉన్నాయని ఓలా తెలిపింది. కాబట్టి, వీటిలో అనేక టాప్ ఫీచర్స్, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లు లేవు. అయితే ప్రొడక్షన్ మోడల్‌లు వచ్చిన తర్వాత మాత్రమే మేము ఈ ఫీచర్‌ల గురించి పూర్తి సమాచారం అందిస్తాము.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది చాలా సహజమైనది మరియు ఉపయోగించడానికి చాలా సులభమైనది. నెట్‌వర్క్ లభ్యతను బట్టి నావిగేషన్ చాలా వేగంగా లోడ్ అవుతుంది, ఎందుకంటే ఇది జియో కనెక్టివిటీని ఉపయోగిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ లాక్/అన్‌లాక్, ఎలక్ట్రిక్ సీట్ ఓపెనింగ్ మొదలైన ఇతర ఫీచర్లు కూడా బాగా పనిచేశాయి.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

స్విచ్ గేర్ కీప్యాడ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే అవన్నీ నిజానికి సాఫ్ట్-ప్రెస్ బటన్లు. బటన్‌లు మీరు గాడ్జెట్‌ని ఆపరేట్ చేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. వాస్తవానికి, ఈ స్కూటర్ అనేక విధాలుగా గాడ్జెట్. ఈ బటన్‌ల ద్వారా కాల్‌లను రిసీవ్ చేసుకోవచ్చు/ రిజెక్ట్ చేయవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు, రివర్స్ మోడ్‌ను యాక్టివేట్/డీ యాక్టివేట్ చేయవచ్చు.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

ఇది సౌండ్ ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ సౌండ్ రెండు ఆన్-బోర్డ్ స్పీకర్ల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది మరియు రైడర్ ఎంచుకున్న మూడ్ అది ఎలాంటి ధ్వనిని ఉత్పత్తి చేస్తుందో నిర్ణయిస్తుంది. అదే స్పీకర్ల ద్వారా కాల్‌లను తీసుకోవచ్చు మరియు భవిష్యత్ అప్‌డేట్ ఈ స్పీకర్లలో కూడా మ్యూజిక్ ప్లే చేయడానికి అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

క్రూయిజ్ కంట్రోల్ అనేది డెలివరీలు ప్రారంభించడానికి ముందు స్కూటర్‌లకు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌గా వచ్చే మరో ఫీచర్, కాబట్టి మేము దానిని కూడా అనుభవించలేము. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత తరానికి కావలసిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి అని మాత్రం చెప్పవచ్చు.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro డిజైన్ మరియు స్టైల్:

Ola S1 మరియు S1 Pro సింపుల్ గా ఉన్నప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో అన్ని ఫంక్షనల్ ఎలిమెంట్స్ బాడీ ప్యానెల్‌లలో ఫ్లష్‌గా ఉంటాయి, కావున ఏమీ బయటకు రాదు. బాడీ మొత్తం ఒక క్వాలిటీ ప్లాస్టిక్ పీస్ లాగా కనిపిస్తుంది. ఈ స్కూటర్ ముందుభాగంలో ఒక ప్రత్యేకమైన హెడ్‌ల్యాంప్ ఉంది, ఇది దూరం నుండి కూడా తక్షణమే గుర్తించబడుతుంది. ఇది హై మరియు లో బీమ్ నిర్వహించే దానిలోని రెండు ఎల్ఈడీ యూనిట్‌లకు అవుట్‌లైన్‌గా LED DRL ని పొందుతుంది. హెడ్‌ల్యాంప్ చుట్టూ ఉన్న ప్యానెల్‌లో స్విచ్‌గేర్ మరియు టచ్‌స్క్రీన్ ఉన్నాయి.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

ఫ్రంట్ ఆప్రాన్ దూరం నుండి పూర్తిగా వక్రంగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి దానిపై కొన్ని డిజైన్ లైన్లు ఉన్నాయి. ఫుట్‌బోర్డ్‌లో కొన్ని పాత స్కూటర్‌లను గుర్తుచేసే కింక్ ఉంది మరియు మీ పాదాలను ఉంచడానికి రబ్బరు ఇన్‌సర్ట్‌లు కూడా ఉన్నాయి. ఇందులోని సీటు చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఏ స్కూటర్‌లో చూసిన దానిలా కాకుండా ఇది నిజంగా వెడల్పుగా ఉంది. కావున పిలియన్ రైడర్‌కు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ 36 లీటర్ల అండర్-సీట్ స్టోరేజీ కలిగి ఉంటుంది. కావున రెండు హాఫ్ ఫేస్డ్ హెల్మెట్‌లను ఇక్కడ సులభంగా ఉంచవచ్చు. సీటు కింద ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

ఇందులోని ఇండికేటర్స్ మరియు టెయిల్ ట్యాంప్ చాలా స్లిమ్‌గా ఉన్నాయి, కావున చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. ఇందులోకి పెయింట్ ఫినిషింగ్ కూడా అద్భుతమైనది. కావున మీరు ఎంచుకున్న ఏ రంగు స్కూటర్ అయినా అద్భుతంగా కనిపిస్తుంది. Ola స్కూటర్ మొత్తం 10 కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. మేము మార్ష్‌మల్లౌ షేడ్‌ స్కూటర్ రైడ్ చేసాము. కానీ నియో బ్లూ మరియు మిడ్‌నైట్ బ్లూ కలర్ చాలా మరింత అందంగా కనిపిస్తాయని మేము ఆశిస్తున్నాము.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

స్కూటర్ యొక్క కుడి వైపున, ఫ్లోయింగ్ బాడీ ప్యానెల్‌లను మరియు ప్రత్యేకమైన 10-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతారు. అయితే ఎడమ వైపున, మీరు మెకానికల్‌లను చూస్తారు. మొత్తానికి ఇది చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

సింగిల్-సైడెడ్ ఫోర్క్ దిగువన పొడిగింపును కలిగి ఉంది, ఇది మొదటి చూపులో ప్లాస్టిక్ కవర్ వలె కనిపిస్తుంది. అయితే, ఇది వాస్తవానికి మెటల్ తో తయారు చేయబడింది. మొత్తం మీద ఒక్క మాటలో చెపాప్లంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యుత్తమంగా కనిపించే స్కూటర్లలో ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

Ola Electric Scooter అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉండి, మంచి రైడింగ్ అనుభూతిని అందించింది. ఇది నిజంగా ప్రశంసనీయం. ఈ స్కూటర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్పగలము. S1 Pro స్కూటర్ సాంకేతికత పరంగా చాలా ఉత్తమమైనది, చూడటానికి చాలా ఫాన్సీగా కనిపిస్తుంది.

Ola S1 Pro ఫస్ట్ రైడ్ రివ్యూ.. ప్రశ్న మీది : సమాధానం మాది.. ఇక్కడ చూడండి

Ola S1 Pro పబ్లిక్ రోడ్డుపైన మరియు పట్టణ ప్రాంతాలలో ఎలాంటి పనితీరుని అందిస్తుంది, అని తెలుసుకోవడానికి మాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. కావున త్వరలో మరో రివ్యూతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ మరియు స్కూటర్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ola s1 pro telugu review riding impressions engine specs performance features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X