స్కూటర్ల వార్: సుజుకి యాక్సెస్ 125 Vs హోండా ఆక్టివా 125 Vs మహీంద్రా గస్టో 125

Written By:

ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో బైకులకు ఎంత ప్రాధాన్యం ఉందో స్కూటర్లకు కూడా అంతే ప్రాధాన్యం కలదు. అందులో చాలా కాలం నుండి స్కూటర్ల మార్కెట్లో సింహభాగాన సింహాసనం వేసి కూర్చుంది హోండా ఆక్టివా.

అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారనుంది. ఎందుకంటే అన్ని అంశాల పరంగా హోండా ఆక్టివా స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్ నుండి ఎలిమినేట్ చేయడానికి సుజుకి యాక్సెస్ 125 మరియు మహీంద్రా గస్టో 125 స్కూటర్లు పకడ్భంధీగా పథకం వేసుకున్నాయి. ఈ రెండు కలిసి ఆక్టివా స్కూటర్‌ను దెబ్బ తీస్తాయా అనే విషయం క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి యాక్సెస్ 125 డిజైన్

సుజుకి యాక్సెస్ 125 డిజైన్

సుజుకి మార్కెట్లోకి తమ 125 యాక్సెస్ స్కూటర్‌ను ఫ్రెష్ డిజైన్ లుక్‌తో విడుదల చేసింది. ముందు వైపు హెడ్ ల్యాంప్ చుట్టూ క్రోమ్ రింగ్‌ను తగిలించారు. మరియు కొత్త టర్న్ ఇండికేటర్స్ కల్పించారు. ముందు తరం యాక్సెస్‌ కన్నా ఇది చాలా నూతనంగా ఉంది.

గస్టో 125 డిజైన్

గస్టో 125 డిజైన్

గస్టో 125 స్కూటర్ ముందు భాగాన పదునైన చూపుల వంటి ఆకర్షణీయమైన డిజైన్‌ను అందించారు. దీనికి తోడు ముందు ఎయిర్ వెంట్ ప్రత్యేకఆకర్షణగా నిలిచాయి. యువతను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఇందులో లెగ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది.

హోండా ఆక్టివా 125 డిజైన్

హోండా ఆక్టివా 125 డిజైన్

హోండా ఆక్టివాకు ఉన్న ప్లస్ పాయింట్ డిజైన్. హోండా దీనికి ముందు వైపు ఉన్న ఎయిర్ డ్యామ్ మీద క్రోమ్ స్ట్రిప్‌ను వినియోగించారు. దీనికి ఉన్న ఇంటికేటింగ్ లైట్లు కూడా చక్కగా ఉన్నాయి. డిజైన్ కారణంగా ఎంతో మంది ప్రజలు దీనిని ఎంచుకుంటున్నారు.

డిజైన్ పరంగా ఓవరాల్ రేటింగ్

డిజైన్ పరంగా ఓవరాల్ రేటింగ్

సుజుకి యాక్సెస్ 125 8/10

మహీంద్రా గస్టో 125 8/10

హోండా ఆక్టివా 125 8/10

సుజుకి యాక్సెస్ 125 ఇంజన్ వివరాలు

సుజుకి యాక్సెస్ 125 ఇంజన్ వివరాలు

సుజుకి యాక్సెస్ 125 శక్తివంతమైన 124సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

ఇందులో శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 7,000 ఆర్‌పిఎమ వద్ద 8.6 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు సివిటి (కంటిన్యూయస్లి వేరిబుల్ ట్రాన్స్‌మిషన్) అందించారు.

మహీంద్రా గస్టో 125 ఇంజన్ వివరాలు

మహీంద్రా గస్టో 125 ఇంజన్ వివరాలు

గస్టో 125 స్కూటర్‌లో మహీంద్రా 124.6సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్‌కు సివిటి ట్రాన్స్‌మిషన్ ‌ను అందించారు.

హోండా ఆక్టివా 125 ఇంజన్ వివరాలు

హోండా ఆక్టివా 125 ఇంజన్ వివరాలు

హోండా వారి ఆక్టివా 125 స్కూటర్‌లో 124.9సీసీ కెపాసిటిగల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజన్ పెట్రోల్ కలదు.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఇందులోని ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ట్రాన్స్‌మిషన్ పరంగా ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. హోండా దీనిని వి-మ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ అని కూడా పిలుస్తుంది.

ఇంజన్ మరియు గేర్ బాగ్స్ పరంగా వివరాల పరంగా ఓవరాల్ రేటింగ్

ఇంజన్ మరియు గేర్ బాగ్స్ పరంగా వివరాల పరంగా ఓవరాల్ రేటింగ్

  • సుజుకి యాక్సెస్ 125 7.5/10
  • మహీంద్రా గస్టో 125 7.5/10
  • హోండా ఆక్టివా 125 8/10
సుజుకి యాక్సెస్ 125 లోని ఫీచర్లు

సుజుకి యాక్సెస్ 125 లోని ఫీచర్లు

ఇందులో సర్వీస్ ఇండికేటర్, ట్విన్ ట్రిప్ మీటర్, ఫ్రంట్ పాకెట్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం గల సాకెట్ మరియు రెండు లగేజ్ హుక్సు కలవు.

మహీంద్రా గస్టో 125 ఫీచర్లు

మహీంద్రా గస్టో 125 ఫీచర్లు

మహీంద్రా సంస్థ ఫీచర్లను అందివ్వడంలో తనదైన ముద్ర వేసుకుంది. ఇందులో సీటు ఎత్తును సరిచేసుకునే వెసులుబాటు, రిమోట్ ఫ్లిప్ కీ, ఫైండ్ మి ల్యాంప్స్, గైడ్ ల్యాంప్స్, ముందు వైపుకు ఇచ్చిన కిక్ స్టార్ట్ రాడ్, ముందు వైపు ఉత్తమ స్టోరేజి స్పేస్, ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, మరియు సులభంగా ఇంధనం నింపుకోవడానికి వీలుండే విధంగా ఎక్ట్సీరియర్ ఫ్యూయల్ క్యాప్ కలదు.

హోండా ఆక్టివా 125 ఫీచర్లు

హోండా ఆక్టివా 125 ఫీచర్లు

ఇందులో డిజిటల్ మీటర్, డిస్క్ బ్రేక్ ఆప్షనల్‌గా, కాంబి బ్రేక్ సిస్టమ్, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్వర్లు ఇందులో కలవు.

ఫీచర్ల పరంగా ఓవరాల్ రేటింగ్

ఫీచర్ల పరంగా ఓవరాల్ రేటింగ్

  • సుజుకి యాక్సెస్ 125 7.5/10
  • మహీంద్రా గస్టో 125 8/10
  • హోండా ఆక్టివా 125 7.5/10
సుజుకి యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125

సుజుకి తమ యాక్సెస్ 125 స్కూటర్‌ను కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందించింది. దీన ధర రూ. 59,123 అందాసుగా ఎక్స్‌షోరూమ్ ధర.

మహీంద్రా గస్టో 125

మహీంద్రా గస్టో 125

మహీంద్రా వారి గస్టో 125 స్కూటర్లు రెండు వేరియంట్లలో కలవు. అవి

డిఎక్స్ ధర రూ. 50,680 లు

విఎక్స్ ధర రూ. 53,680 లు

రెండు ధరలు ఎక్స్ షోరూమ్ అందాసుగా ఇవ్వబడ్డాయి

హోండా ఆక్టివా 125

హోండా ఆక్టివా 125

హోండా ఆక్టివా 125 స్కూటర్ రెండు వేరింట్లలో కలదు.

ఎస్‌టిడి ధర రూ. 55,689 లు

డిఎల్ఎక్స్ ధర రూ. 61,857 లు

రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

ధరల పరంగా ఓవరాల్ రేటింగ్

ధరల పరంగా ఓవరాల్ రేటింగ్

సుజుకి యాక్సెస్ 125 7.5/10

మహీంద్రా గస్టో 125 8/10

హోండా ఆక్టివా 125 7.5/10

తీర్పు

తీర్పు

మహీంద్రా వారి గస్టో స్కూటర్ ఫీచర్లు మరియు ధర పరంగా ఆక్టివాతో గట్టి పోటిగా నిలిచింది. అయితే చాలా కాలంపాటు భారతీయులు ఆక్టివా మీద ఉన్న నమ్మకంతో దీని ప్రభావం ఇలాగే కొనసాగవచ్చు. కాబట్టి ఆక్టివాకు మంచి రోజులు ఇంకా ఉన్నట్లే. యాక్సెస్ 125 స్కూటర్ డిజైన్ పరంగా మార్కులు తెచ్చుకుంది. గస్టో మరియు ఆక్టివా రెండు కూడా ఉత్తమమే అని మా అభిప్రాయం.

English summary
Scooter War: Suzuki Access 125 vs Honda Activa 125 vs Mahindra Gusto 125
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark