ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

Written By:

బ్రిటీష్ మోటార్ సైకిల్ కంపెనీ ట్రయంప్ తమ థ్రక్ట్సన్ ఆర్ కేఫెరేసర్ మోటార్ సైకిల్‌కు టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్ తెలుగుకు ఇచ్చింది. ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ గురించి మా అభిప్రాయం ఇవాళ్టి రివ్యూ కథనంలో...

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

బ్రిటన్‌కు చెందిన ట్రయంప్ 1960ల కాలంలో బొన్‌విల్ సిరీస్ టూ వీలర్లను రెట్రో థీమ్ మోటార్ సైకిళ్ల తరహాలో పరిచయం చేయడం ప్రారంభించింది. ట్రయంప్ టూ వీలర్ల కుటుంబంలో బొన్‌విల్ రేంజ్ బైకులు మంచి సేల్స్ సాధిస్తున్నాయి.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ట్రయంప్ బొన్‌విల్ ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లను విడుదల చేసింది, అందులో ఒకటి థ్రక్ట్సన్ ఆర్ కేఫెరేసర్ మోటార్ సైకిల్. కేఫెరేసర్ స్టైల్లో థ్రక్ట్సన్ ఆర్ ఒక గుడ్ లుకింగ్ మోటార్ సైకిల్. ఇవాళ్టి స్టోరీలో థ్రక్ట్సన్ ఆర్ రైడింగ్ రివ్యూ వివరాలు చూద్దాం రండి...

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ముందుగా కేఫెరేసర్ అంటే ఏమిటి ? 1950 మరియు 1960ల మధ్య కాలంలో ఔత్సాహికులు తమ సొంత పరిజ్ఞానంతో మోటార్ సైకిళ్లను మోడిఫై చేసి ఒక కేఫ్ నుండి మరో ప్రాంతానికి రేస్ పెట్టుకునే వారు. అప్పట్లో కేఫ్ (కాఫీ హౌస్)ల నుండి రేసింగ్‌ మొదలవుతుండటంతో ఆ పేరు మీదుగా కేఫెరేసర్ వినియోగంలోకి వచ్చింది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ట్రయంప్ సంస్థ థ్రక్ట్సన్ ఆర్ మోటార్ సైకిల్‌ను 2016లో జరిగిన ఇండియా బైక్ వీక్ కార్యక్రమంలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. చూడటానికి పురాతణ డిజైన్ స్టైల్లో ఉన్నప్పటికీ, ఎన్నో అత్యాధునిక ఫీచర్లను మరియు టెక్నాలజీని ఇందులో పరిచయం చేసింది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

డిజైన్ పరంగా బైకులను ఎంచుకునే వారికి థ్రంక్ట్సన్ పెద్దగా నచ్చకపోవచ్చు. అయితే కేఫెరేసర్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో థ్రక్ట్సన్ అద్బుతమైన డిజైన్ కలిగి ఉంది. రైడింగ్ పొజిషన్, కంఫర్ట్ మరియు సౌలభ్యతను స్పష్టంగా గమనించగలం. ఈ విషయం పరంగా థ్రక్ట్సన్ ఆర్ డిజైన్ బృందానికి థ్యాక్స్ చెప్పుకోవాల్సిందే.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

పాత కాలం బబుల్ ఫెయిరింగ్ డిజైన్ వెనుక ట్రాక్ రేసర్ ఇన్స్‌పిరేషన్ కిట్ కీలకంగా ఉంది. గుండ్రటి ఆకారంలో ఉన్న ఫ్రంట్ హెడ్ ల్యాంప్, క్రింది వైపుకు వంచబడిన క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, కురచగా ఉన్న టెయిల్ సెక్షన్ కలదు. ట్రాక్ రేసర్ ప్రేరిత కిట్ ద్వారా రెగ్యులర్ కేఫెరేసర్ లతో పోల్చితే థ్రక్ట్సన్ ఆర్ విభిన్నంగా ఉంటుంది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

థ్రక్ట్సన్ ఆర్ ఫ్రంట్ డిజైన్‌లో అనవసరపు ఆడంబరమైన సొబగులకు తావు లేకుండా ట్రయంప్ జాగ్రత్త తీసుకున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. బుడగలాంటి ఆకారం మధ్యలో గుండ్రటి ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు ఇండికేటర్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ బైకులో పెద్ద పరిమాణంలో ఉన్న అనలాగ్ స్పీడో మీటర్ గల డ్యూయల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. ఇందులో టాకో మీటర్ మరియు చిన్న డిస్ల్పే కలదు. ఈ డిస్ల్పేలో గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ మీటర్, రియల్ టైమ్ ఎఫీషియన్సీ, రేంజ్ మరియు పవర్ మోడ్స్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

థ్రక్ట్సన్ ఆర్ మోటార్ సైకిల్ చూడగానే మన దృష్టి ముందు ఫ్యూయల్ ట్యాంక్ మీదకు మళ్లుతుంది. సీటు నుండి పొడవాటి ఇంధన ట్యాంక్ మీదుగా మధ్యలో లెథర్ పట్టీ ఉంటుంది. మరియు రియర్ మీద బోర్లించిన గిన్నె తరహా కర్వీ డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

సాంకేతికంగా ట్రయంప్ తమ థ్రక్ట్సన్ ఆర్ మోటార్ సైకిల్‌లో 1,200సీసీ సామర్థ్యం గల ప్యార్లల్ ట్విన్ ఇంజన్ కలదు. ఇదే ఇంజన్ ట్రయంప్ ఫ్యామిలీలో ఉన్న బొన్‌విల్ టి120లో కూడా ఉంది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

చూడటానికి చిన్నగానే ఉంది ఇంత శక్తివంతమైన ఇంజన్ ఉందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. కానీ ఇదే కేఫెరేసర్ వర్గానికి చెందిన మోటార్ సైకిల్ కాబట్టి ఇందులో అధిక సామర్థ్యం గల ఇంజన్ అందివ్వడం జరిగింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 6,750ఆర్‍‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 96బిహెచ్‌పి పవర్ మరియు 4,950ఆర్‌పిఎమ్ వద్ద 112ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ఇంజన్ ఇచ్చే శబ్దం పాత కాలం నాటి మోటార్ సైకిళ్ల తరహాలోనే ఉన్నప్పటికీ, ఇందులో రైడ్ బై వైర్ అనే అత్యాధునికి టెక్నాలజీ కలదు. ఇందులో మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, రోడ్, రెయిన్ మరియు స్పోర్ట్. వీటితో పాటు భద్రత పరంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల్లో క్లచ్ చాలా హార్డ్‌గా ఉంటుంది అనే వాదన ఎప్పటి నుండో ఉంది. కానీ థ్రక్ట్సన్ ఆర్ మోటార్ సైకిల్‌లో ఉన్న 1200సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను ఆపరేట్ చేయడానికి స్మూత్ క్లచ్ కలదు. టార్క్-అసిస్టెడ్ క్లచ్ కావడంతో సిటీలో ట్రాఫిక్‌తో కూడిన రోడ్ల మీద కూడా సులభంగా రైడ్ చేయవచ్చు.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

రైడింగ్ పొజిషన్ మొత్తం క్రిందకే ఉంటుంది. అదే విధంగా పొడవాటి ఇంధన ట్యాంక్ మరియు ఇంజన్ బరువు మొత్తం ప్రంట్ ఫోర్క్స్ మీదే పడుతుంది. మరియు క్రిందకు వంచబడిన క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ కారణంగా లాంగ్ డ్రైవ్ దాదాపు అసాధ్యమే. అయితే సిటీ రైడింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ మోటార్ సైకిల్ డిజైన్ మరియు ఇందులోని అత్యాధునిక టెక్నాలజీ పరంగా మంచి మార్కులే పడ్డాయి. బైకులో ముందు వైపున 43ఎమ్ఎమ్ షోవా అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఓహ్లిన్స్ ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. వీటిని పూర్తిగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ముందువైపున 310ఎమ్ఎమ్ చుట్టు కొలతో ఉన్న రెండు డిస్క్ బ్రేకులు వెనుక వైపున 220ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. ఉత్తమ బ్రేకింగ్ వ్యవస్థ కోసం యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.

అధిక వేగం వద్ద మలుపుల్లో అత్యుత్తమ పటిష్టత్వాన్ని పొందడానికి పిరెల్లీ డియాబ్లో రోస్సో కోర్సా టైర్లను అందివ్వడం జరిగింది(ముందు టైరు: 120/ జడ్ఆర్ 17 మరియు వెనుక టైరు: 160/60 జడ్ఆర్ 17).

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ చూడటానికి సింపుల్‌గానే ఉన్నప్పటికీ ఇదంత తేలికైన బైకు కాదు. దీని బరువు 203కిలోలుగా ఉంది. అయితే ట్రంయప్ వారి అద్భుతమైన డిజైన్ కారణంగా అంత బరువున్నట్లు అనిపించదు.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ బైకును స్వయంగా నడిపి పరీక్షించినపుడు సిటీలో లీటర్‌కు 13కిలోమీటర్లు మరియు హై వే మీద లీటర్‌కు 19 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది.

ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ టెస్ట్ రైడ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా కేఫెరేసర్ స్టైల్ మోటార్ సైకిళ్లకు డిమాండ్ కొద్దికొద్దిగా పెరుగుతోంది. దీంతో బ్రిటన్ దిగ్గజం ట్రయంప్ రాజీపడని డిజైన్, శక్తివంతమైన ఇంజన్ మరియు పాత కాలపు డిజైన్ లక్షణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో థ్రక్ట్సన్ ఆర్ బైకును విడుదల చేసింది.

అయితే ఇవన్నీ కలుపుకుని దీని ధర రూ. 14.74 లక్షల రుపాయలు ఆన్-రోడ్ ముంబాయ్‌గా ఉంది. డబ్బు సమస్య కాదని భావించే వారికి కేఫె రేసర్‌లో ఒక కొత్త శకానికి నాంది పలికిన థ్రక్ట్సన్ ఆర్ ను ఎంచుకోవడంలో సందేహించాల్సిన అవసరం లేదు.

English summary
Read In Telugu: Review: Triumph Thruxton R — Classic Full-Blooded British Cafe Racer
Story first published: Thursday, August 10, 2017, 15:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark