కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత ప్రీమియం, మరింత సూపర్ గురూ..!!

భారత మార్కెట్లో పరిచయం అవసరంలేని టూ వీలర్ బ్రాండ్ TVS యొక్క 'Jupiter'. ఎందుకంటే అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో Jupiter ఒకటి. అంతే కాకూండా దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ స్కూటర్ కూడా ఈ 'Jupiter' అనటంలో అతిశయోక్తి లేదు. ఈ Jupiter స్కూటర్ 110 సిసి స్కూటర్ విభాగంలో TVS యొక్క ముఖ్యమైన మోడల్.

TVS కంపెనీ ఈ Jupiter స్కూటర్ మార్కెట్లో ప్రారంభించినప్పటినుంచి దాదాపు 45 లక్షల TVS Jupiter స్కూటర్లను విక్రయించింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన ఘనత అనే చెప్పాలి. అయితే దీనిని మరింత విస్తరించాడనికి దాని మొదటి 125 సిసి కమ్యూటర్ స్కూటర్‌ను కంపెనీ విడుదల చేసింది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

భారతీయ మార్కెట్లో గత కొన్నేళ్లుగా ప్రీమియం 125 సీసీ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న కారణంగా TVS కంపెనీ తన కొత్త Jupiter 125 స్కూటర్ విడుదల చేసింది. అయితే ఈ కొత్త స్కూటర్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనే మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మేము ఈ కొత్త Jupiter 125 సిసి స్కూటర్ రైడ్ చేసాము. దీనికి సంబందించిన మరింత సమాచారం ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.. రండి.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

TVS Jupiter 125 డిజైన్:

TVS Jupiter 125 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ దాని 110 స్కూటర్ తో పోల్చినప్పుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. 125 స్కూటర్ చాలా వరకు ప్రీమియంగా మరియు మరింత ఆధునికంగా కనిపిస్తుంది. కానీ ఇందులోని సిల్హౌట్ మాత్రం Jupiter 110 కి సమానంగా ఉంటుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

కొత్త Jupiter 125 స్కూటర్‌లో అనేక క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కావున ఇది అదనపు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. యాంగిల్ స్పోక్స్‌తో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. దీనితో పాటు రీడిజైన్ చేయబడిన రియర్ ఎండ్ కూడా కనిపిస్తుంది. గ్రాబ్ రైల్ మీద ఉంచిన రిఫ్లెక్టర్ స్కూటర్ ని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తుంది. మొత్తానికి ఈ స్కూటర్ చూడగానే ఆకట్టుకునేవిధంగా ఉంటుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

TVS Jupiter 125 ఫీచర్స్:

కొత్త TVS Jupiter 125 లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో ఫ్యూయెల్ ఫిల్లర్. ఈ ఫీచర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏవిధంగా ఫ్యూయెల్ ట్యాంక్ ఫ్లోర్‌బోర్డ్ కింద ఉంచబడింది. ఈ స్కూటర్ లో స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపు 33-లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. కావున రెండు హెల్మెట్లను సులభంగా ఇక్కడ ఉంచవచ్చు.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

ఇందులో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ మరియు ముందు భాగంలో ఒక చిన్న 2-లీటర్ గ్లోవ్ బాక్స్ కూడా ఉంటుంది. ఇది వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

ఈ స్కూటర్ లో ఉన్న హెడ్‌ల్యాంప్ ఒక ఎల్ఈడీ యూనిట్, కావున ఇది చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. అయితే దీని గురించి ఖచ్చితమైన వివరాలు రాత్రి సమయంలో రైడింగ్ చేస్తే తెలుస్తుంది, మేము త్వరలో ఈ స్కూటర్ యొక్క రోడ్ టెస్ట్ చేస్తాము. అప్పుడు దీని గురించిన సమాచారం అందిస్తాము. అప్పటి వరకు వేచి ఉండక తప్పదు.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

Jupiter 125 స్కూటర్ లోని ఇన్స్ట్రుమెంటేషన్ డిజిటల్-అనలాగ్ క్లస్టర్ ద్వారా నిర్వహించబడుతుంది. స్క్రీన్ ఎడమ వైపున స్పీడోమీటర్, కుడి వైపు ఎల్‌సిడి స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఎల్‌సిడి ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ, ఇన్స్టంట్ ఫ్యూయెల్ కెపాసిటీ మరియు డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి సమాచారం వీటి ద్వారా పొందవచ్చు.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

Jupiter 125 స్కూటర్ ప్రీమియం 125 సిసి సెగ్మెంట్‌లో పోటీ పడుతున్నందున, దీనికి ఒక పెద్ద స్క్రీన్ ఉంటే బాగుండేది, అయితే కంపెనీ త్వరలో తన కొత్త వేరియంట్‌ను కనెక్టెడ్ టెక్నాలజీతో తీసుకురానున్నట్లు ధృవీకరించింది. కావున ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో వచ్చే అవకాశం ఉంటుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

TVS Jupiter 125 ఇంజిన్ స్పెసిఫికేషన్స్:

TVS Jupiter 125 స్కూటర్ కొత్త కొత్త 125 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది ఎయిర్ కూల్డ్ 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్. ఈ ఇంజిన్ యొక్క మొత్తం లేఅవుట్ TVS Ntorq మాదిరిగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ ఇంజిన్ TVS Ntorq మాదిరిగా కాదని, తెలియజేయడానికి అనేక తేడాలు ఇక్కడ గమనించవచ్చు.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

TVS Ntorq స్కూటర్ లోని ఇంజిన్ 3-వాల్వ్ సెటప్‌ను ఉపయోగిస్తుంది. కానీ ఈ కొత్త TVS Jupiter 125 స్కూటర్ మాత్రం 2-వాల్వ్ సెటప్‌ను ఉపయోగిస్తుంది. ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8.1 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది దాని Ntorq కన్నా 1.1 బిహెచ్‌పి తక్కువ. అయితే 10.5 ఎన్ఎమ్ టార్క్ మాత్రం ఒకేలా ఉంటుంది. TVS Jupiter 125 స్కూటర్ ETFI మరియు Intelli-Go ఆటో స్టార్ట్/స్టాప్ టెక్నాలజీని పొందుతుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

ఇవి మాత్రమే కాకుండా కంపెనీ ఇంజిన్ చాలా అధునాతనంగా ఉండటానికి అనేక అంతర్గత మార్పులు చేసింది. ఇందులో లైట్ వెయిట్ క్రాంక్ షాఫ్ట్, సైలెంట్ క్యామ్ చైన్ మరియు లో ఇనర్టియా క్రాంక్ షాఫ్ట్ అసెంబ్లీ వంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ అద్భుతమైన ఇంజిన్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

చాసిస్, బ్రేకులు మరియు సస్పెన్షన్:

కొత్త TVS Jupiter 125 స్కూటర్ కొత్త చాసిస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది మునుపటికంటే కూడా తేలికైనదిగా ఉంటుంది, కావున మెరుగైన నిర్వహణ మరియు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

కొత్త TVS Jupiter 125 స్కూటర్ బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

అదేవిధంగా ఈ కొత్త స్కూటర్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఉంటాయి.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

ఇవన్నీ కూడా కంపెనీ యొక్క జూపిటర్ 110, 125 మరియు 110 సీసీ సెగ్మెంట్‌లలోని ఇతర స్కూటర్ల కంటే చాలా మెరుగ్గా ఉంటాయి, దీనిని తెలుసుకోవడానికి మేము కంపెనీ యొక్క హోసూర్ తయారీ కర్మాగారంలో ఉన్న టీవీఎస్ టెస్ట్ ట్రాక్‌లో ఈ కొత్త స్కూటర్ రైడ్ చేసాము.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

TVS Jupiter 125 రైడింగ్ ఇంప్రెషన్స్:

కొత్త TVS Jupiter 125 స్కూటర్ మీద రైడింగ్ కి సిద్దమైన వెంటనే మీకు కలిగే మొదటి అనుభూతి, మంచి కంపార్టబిలిటీ. ఇది రైడర్ కి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికోసం కంపెనీ ఎర్గోనామిక్స్‌పై పనిచేసింది. రైడింగ్ పొజిషన్ నిటారుగా ఉంటుంది, కానీ ఫ్లోర్‌బోర్డ్‌పై అదనపు స్థలం సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని పెంచుతుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

Jupiter 125 స్కూటర్ యొక్క సీటు పొడవైనది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ స్కూటర్ యొక్క స్టార్ట్ బటన్ ఆన్ చేయగానే మీకు ఒక ప్రీమియం అనుభూతి కలుగుతుంది. ఈ స్కూటర్ నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది మరియు ఇంజిన్ చాలా నిశ్శబ్దంగా పని చేస్తుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

త్రాటల్ ను ట్విస్ట్ చేయగానే Jupiter లా త్వరగా వేగవంతం అవుతుంది. మేము సాధారణ రోడ్డులో రైడ్ చేయలేదు, కానీ మేము TVS టెస్ట్ ట్రాక్ దగ్గర కొంత నెమ్మదిగా రైడింగ్ చేసాము. ఈ స్కూటర్ తక్కువ వేగంతో చాలా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కొత్త స్కూటర్ రోజువారీ వినియోగం కోసం ఖచ్చితంగా సరిపోతుంది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

Jupiter 125 స్కూటర్ యొక్క పర్ఫామెన్స్ చాలా అద్బుతంగా ఉందని చెప్పవచ్చు. యాక్సలరేషన్ చాలా స్పీడ్ గా ఉంటుంది. కావున స్పీడోమీటర్ నీడిల్ చాలా త్వరగా పైకి వెళ్తుంది. ఇది 75 కిమీ/గం చాలా త్వరగా పైకి వస్తుంది. మేము టెస్ట్ ట్రాక్ లో స్కూటర్‌ను గంటకు 90 కిమీ వరకు వేగవంతం చేసాము. ఇది ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం. అయితే, ఇది టక్-ఇన్ పొజిషన్‌లో సాధించబడింది. కానీ నిటారుగా కూర్చున్నప్పుడు, మనం వెళ్లగలిగే గరిష్ట వేగం గంటకు 83 కిమీ. ఒక మాటలో చెప్పాలంటే ఇది అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందించింది.

కొత్త TVS Jupiter 125 రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్ యొక్క 125 సీసీ స్కూటర్ విభాగానికి డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలోనే కంపెనీ తన కొత్త Jupiter 125 విడుదల చేసింది. కొత్త Jupiter 125 స్కూటర్ మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. దేశీయ మార్కెట్లో 125 సిసి కమ్యూటర్ స్కూటర్ కోసం ఎద్దురు చూసే వారికీ కొత్త TVS Jupiter 125 మంచి ఎంపిక అవుతుంది.

కొత్త TVS Jupiter 125 స్కూటర్ వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ఎలా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకోవటానికి మేము త్వరలో ఈ కొత్త స్కూటర్ యొక్క రోడ్ టెస్ట్ చేస్తాము. అప్పటి వరకు ఎప్పటికప్పుడు కొత్త వాహనాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా DriveSpark ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Tvs jupiter 125 telugu review riding impressions engine specs performance features details
Story first published: Thursday, October 7, 2021, 16:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X