బైక్ ప్రేమికులారా.. ఊపిరి పీల్చుకోండి.. Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

ఒకప్పుడు ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో ఒకటి Yezdi. ఇది 90 ల లోనే ద్విచక్ర వాహన మార్కెట్‌ను తిరుగులేకుండా పాలించింది. ఈ కంపెనీ మార్కెట్లో కూల్‌గా కనిపించే మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. అయితే ఇప్పటికి కూడా ఈ బైకులను ఇష్టపడే వారి సంఖ్య తక్కువేమీ లేదు.

Yezdi బ్రాండ్ తిరిగి ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ మూడు కొత్త మోటార్ సైకిల్స్ ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. వీటికి కంపెనీ Yezdi Roadster, Yezdi Scrambler మరియు Yezdi Adventure అని పేరుపెట్టింది. ఇటీవల మేము ఈ కొత్త బైకులను పరిశీలించాము, త్వరలో వీటిని రైడింగ్ కూడా చేయనున్నాము. అయితే ఇప్పుడు Yezdi బైకుల యొక్క ఫస్ట్ లుక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

యెజ్డీ రోడ్‌స్టర్ (Yezdi Roadster):

రోడ్‌స్టర్‌ మోటార్ సైకిల్స్ అనేవి సాధారణంగా మల్టిపుల్ స్ట్రీట్ మోటార్‌సైకిళ్లు. ఇది నేకెడ్ డిజైన్‌తో అద్భుతంగా కనిపిస్తాయి, అంతే కాకుండా రైడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే పాత Yezdi మోటార్‌సైకిళ్లు రోడ్‌స్టర్‌లు మరియు హెరిటేజ్ బ్రాండ్ అయినందున, ఆధునిక యుగంలో Yezdi మరొక రోడ్‌స్టర్‌ను ప్రారంభించనుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

Yezdi Roadster మంచి డిజైన్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌లైట్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇది ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌ను కూడా పొందుతుంది, కానీ ఇండికేటర్స్ హాలోజన్ బల్బుల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్ ముందు ఫోర్క్ పైన అమర్చబడి ఉంటుంది. అయితే కీహోల్ అనేది మోటార్ సైకిల్ యొక్క కుడి వైపున ఉంచబడుతుంది. ఈ కొత్త రోడ్‌స్టర్ 12.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. అదే సమయంలో ట్యాంక్‌పైన Yezdi బ్యాడ్జింగ్‌ను పొందుతారు.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

ఈ మోటార్‌సైకిల్‌లో ఎక్కువ మొత్తంలో క్రోమ్ ఉంది. ఇది హెడ్‌లైట్ గ్రిల్, USB టైప్-సి ఛార్జింగ్ సాకెట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి కొన్ని ఆప్సనల్ ఫీచర్‌లను కూడా పొందుతుంది. అంతే కాకుండా మోటార్‌సైకిల్ డబుల్ క్రెడిల్ ఛాసిస్‌ను కలిగి ఉంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

Yezdi Roadster 135 మి.మీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను మరియు వెనుక వైపున ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. అదే సమయంలో ఇది 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పొందుతుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో ఫ్లోటింగ్ కాలిపర్‌తో 320 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో ఫ్లోటింగ్ కాలిపర్‌లతో 240 మిమీ డిస్క్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్-ఛానల్ ABS ఒక స్టాండర్డ్ ఫీచర్ గా ఉంటుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

Yezdi Roadster బైక్ 334 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 29.3 బిహెచ్‌పి పవర్ మరియు 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా పొందుతుంది, అదే సమయంలో ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. Yezdi Roadster ప్రారంభ ధర రూ. 1,98,142 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler):

ఇప్పుడు Yezdi Scrambler విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఇది స్పీడోమీటర్‌ను ఫ్రంట్ ఫోర్క్ పైన పొందుతుంది, కానీ అది కొద్దిగా కుడి వైపుకు ఆఫ్‌సెట్ చేయబడింది. స్క్రాంబ్లర్ డబుల్ క్రెడిల్ ఛాసిస్‌ను కూడా కలిగి ఉంది మరియు ఇది 150 మిమీ ఫ్రంట్-వీల్ ట్రావెల్‌తో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను పొందుతుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

స్క్రాంబ్లర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 12.5 లీటర్లు, అదే సమయంలో ఇది ట్యాంక్‌లో చక్కగా కలిసిపోయే సింగిల్-పీస్ సీటును కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ మరియు రోడ్, రైన్ మరియు ఆఫ్-రోడ్ అనే మూడు ABS మోడ్‌లను కలిగి ఉంటుంది. స్క్రాంబ్లర్‌కు 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

స్క్రాంబ్లర్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందువైపు 320 మి.మీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మి.మీ డిస్క్ ఉంటుంది. స్క్రాంబ్లర్ 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్ మరియు 17 ఇంచెస్ వెనుక చక్రం మీద నడుస్తుంది. మోటార్‌సైకిల్ USB టైప్-C మరియు స్టాండర్డ్ USB ఛార్జింగ్ సాకెట్‌ వంటి వాటిని పొందుతుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

స్క్రాంబ్లర్‌ బైక్ 334 సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 28.7 బిహెచ్‌పి పవర్ మరియు 28.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్క్రాంబ్లర్‌లో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబటులో ఉటుంది. Yezdi Scrambler ప్రారంభ ధర రూ. 2,04,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure):

ఎక్కువమంది కస్టమర్లు ఇష్టపడే బైకులలో అడ్వెంచర్ బైకులు ప్రధానమైనవి. కావున ఈ బైక్ కోసం ఎక్కువమంది వేచి చూస్తున్నారు. Yezdi అడ్వెంచర్ బైక్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. మొత్తానికి ఈ బైక్ ని మేము చూడగలిగాము.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

Yezdi Adventure బైక్ డబుల్ క్రెడిల్ ఛాసిస్‌ కలిగి ఉంది. కంపెనీ యొక్క ఈ మూడు బైకులలో అత్యంత శక్తివంతమైన బైక్ ఈ Adventure. ఇది ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ మరియు ఇండికేటర్ సెటప్‌ను పొందుతుంది. ఈ బైక్ 200 మి.మీ ఫ్రంట్-వీల్ ప్రయాణాన్ని పొందుతుంది. అంతే కాకుండా విండ్‌స్క్రీన్‌ను పొందుతుంది. ఈ బైక్ ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ టిల్ట్-అడ్జస్టబుల్ డిస్‌ప్లేను కూడా పొందుతుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

ఈ బైక్ లో రైడర్‌ కూర్చుని ఉన్నప్పటికీ నిలబడి ఉండే రైడింగ్ పొజిషన్‌కు అడ్జస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. LCD స్క్రీన్‌ను 15-డిగ్రీల వరకు అడ్జస్ట్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి కూడా ప్రమాంకంగా అందుబటులో ఉంటాయి. అంతే కాకుండా, ఈ మోటార్‌సైకిల్ 15.1 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను పొందుతుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

ఈ బైక్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ మరియు 180 మిమీ వెనుక చక్రాల ప్రయాణంతో రియర్ మోనో-షాక్‌ను కూడా పొందుతుంది. ఇది రోడ్, ఆఫ్-రోడ్ మరియు రైన్ అనే మూడు మోడ్‌లతో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ని కూడా కలిగి ఉంటుంది. ఇది 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందువైపు 21 ఇంచెస్ వీల్ మరియు వెనుకవైపు 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

Yezdi Adventure బైక్ 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 29.7 బిహెచ్‌పి పవర్ మరియు 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఈ అడ్వెంచర్ ప్రారంభ బైక్ ధర రూ. 2,09,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

Yezdi Motorcycles వచ్చేశాయ్: ఫస్ట్ లుక్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

Yezdi బ్రాండ్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ఒక్క సారిగా మూడు బైకులను విడుదల చేసింది. ఇవన్నీ కూడా ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నప్పటి ఒకే ఇంజిన్‌తో ఆధారితమైనప్పటికీ, అవి వాటి స్వంత ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బైకులు దేశీయ మార్కెట్లో ఎలాంటి రెస్పాన్స్ పొందుతాయి అనేది త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Yezdi motorcycles first look walkaround roadster scrambler adventure specs features details
Story first published: Thursday, January 13, 2022, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X