Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

మోటారుసైకిల్ ప్రియులకు యెజ్డీ (Yezdi) బ్రాండ్ అనే కొత్తేమీ కాదు. ఇప్పటికే భారతీయ మార్కెట్లో తిరుగులేని ఉనికిని చాటుకుంది. అప్పట్లోనే భారతీయ రోడ్లపైన సగర్వంగా తిరిగిన బ్రాండ్ వాహనాలు ఈ యెజ్డీ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే కొంత కాలం క్రితం ఈ బైకులు భారతీయ మార్కెట్లో నిలిచిపోయినప్పటికీ వాటి తీపి గుర్తులు మాత్రం వాహన ప్రియులలో అలాగే నిలిచిపోయాయి.

ఇటీవల కాలంలోనే యెజ్డీ (Yezdi) కంపెనీ మూడు ఆధునికి మోటారుసైకిల్స్ తో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇందులో ఒకటి 'యెజ్డీ స్క్రాంబ్లర్' (Yezdi Scrambler). ఈ బైక్ ఆన్ రోడ్ మరియు ఆఫ్-రోడ్ విధులను నిర్వహించడానికి తయారుచేయబడింది. ఇటీవల మేము ఈ కొత్త 'యెజ్డీ స్క్రాంబ్లర్' రైడ్ చేసాము.

ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా ఇప్పుడు మీ కోసం. ఇక ఆలస్యం ఎందుకు ఇక అసలు విషయంలో వచ్చేద్దాం..

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

Yezdi Scrambler డిజైన్ & స్టైల్:

యెజ్డీ బ్రాండ్ నుంచి వచ్చిన కొత్త 'యెజ్డీ స్క్రాంబ్లర్' (Yezdi Scrambler) ప్రత్యేకంగా కనిపించే ఒక ఆకర్షణీయమైన మోటార్‌సైకిల్. ఇది డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. స్క్రాంబ్లర్ అనేది 50 మరియు 60 లలోనే ఒక ప్రధాన బైక్ గా ఉండేది. ఈ బైక్ 1920 నాటికే మార్కెట్లో ఉంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 'యెజ్డీ స్క్రాంబ్లర్' మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని యెజ్డీ స్క్రాంబ్లర్స్ ఒకే డిజైన్ కలిగి ఉంటాయి. స్క్రాంబ్లర్ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్, మినిమల్ బాడీ వర్క్, ఇంజిన్‌కు ఒక రక్షణ మరియు ఆఫ్-రోడ్ చేయాడాయికి అనుకూలంగా ఉండే డ్యూయల్-పర్పస్ టైర్లు కలిగి ఉంటుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

స్క్రాంబ్లర్‌ బైక్ ఇంధన ట్యాంక్‌తో చక్కగా కలిసిపోయే ఒక సింగిల్-పీస్ సీటును పొందుతుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ మంచి డిజైన్ లైన్‌లతో విలాసవంతమైనది మరియు వంకరగా ఉంటుంది. దీనికి ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్ ఉంది. ఇందులో యెజ్డీ లోగో హై బీమ్ మరియు లో బీమ్‌లను వేరు చేస్తుంది. ఇది క్రోమ్ సరౌండ్‌ను కూడా పొందుతుంది. దీనికి కుడివైపున రౌండ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది సాధారణ స్క్రాంబ్లర్ పద్ధతిలో కుడివైపుకి ఆఫ్‌సెట్ చేయబడింది. మీరు మోటార్‌సైకిల్‌ను ముందు నుండి వీక్షించినప్పుడు మీ దృష్టిని ఆకర్షించే మొదటి అంశం డర్ట్‌బైక్-స్టైల్ మడ్‌గార్డ్.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

యెజ్డీ స్క్రాంబ్లర్ ట్విన్ ఎగ్జాస్ట్ పైపులను కూడా కలిగి ఉంది, ఇది మోటార్‌సైకిల్ ఉబర్ కూల్‌గా కనిపిస్తుంది. ఇందులోని డ్యుయల్-పర్పస్ టైర్‌లతో కూడిన స్పోక్డ్ వీల్స్ ఆఫ్-రోడ్-రెడీ డిజైన్ మరియు స్టైలింగ్‌కు మరింత ఆకర్షణను కల్పిస్తాయి. వెనుక భాగంలో ఒక టైర్ హగ్గర్ ఉంది. దానిపై రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ అమర్చబడి ఉంటుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

ఈ బైక్ కి వెనుకవైపు ఉన్న సింగిల్-పీస్ సీటు కింద ఒక చిన్న మడ్‌గార్డ్ ఉంది. ఇక్కడే చిన్న రౌండ్ టెయిల్ ల్యాంప్ మౌంట్ చేయబడింది, ఇది ఇండికేటర్ తో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బైక్ ని చాలా అద్భుతంగా చూపించడంలో సహాయపడతాయి.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

యెజ్డీ స్క్రాంబ్లర్ బైక్ మూడు డ్యూయల్-టోన్ కలర్స్ మరియు మూడు సింగిల్-టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క వెనుకవైపు ఉన్న చిన్న మడ్‌గార్డ్ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో బ్లాక్ కలర్ లో పూర్తి చేయబడింది. అయితే సింగిల్-టోన్ ఎంచుకున్నప్పుడు అది బాడీ కలర్‌లోనే పూర్తవుతుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

అయితే మీరు ఎంచుకున్న కలర్ ఏదైనా, అది ఫ్యూయెల్ ట్యాంక్‌పై మాత్రమే కనిపిస్తుంది, మిగిలిన మోటార్‌సైకిల్ మొత్తం దాదాపు బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద కొత్త స్క్రాంబ్లర్ బైక్ ఏ కోణంలో చూసినా చూడడానికి ఒక అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన మోటార్‌సైకిల్.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

Yezdi Scrambler ఫీచర్స్:

కొత్త యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) చాలావరకు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో దాదాపు అన్ని ఫీచర్స్ కూడా చక్కగా అమర్చబడి ఉంటాయి. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ ఈ బైక్ యొక్క ధర తక్కువగానే ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ స్క్రాంబ్లర్ ధర రూ. 2.04 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

ఇందులో కూడా రెండు స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు (టైప్-ఎ మరియు టైప్-సి) అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల జాబితాలోకి వచ్చే మరో ముఖ్యమైన అంశం ఇందులోని LED లైటింగ్. మోటార్‌సైకిల్‌లోని అన్ని లైట్లు LED యూనిట్‌లు, కావున ఇవన్నీ కూడీఫా చాలా అద్భుతంగా కనిపిస్తాయి.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

యెజ్డీ స్క్రాంబ్లర్ సింగిల్-పాడ్ సర్క్యులర్ డిస్‌ప్లేను కలిగి ఉన్నప్పటికీ, LCD యూనిట్ బైక్ గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ, స్పీడోమీటర్, టాకోమీటర్, ఓడోమీటర్, ఏబీఎస్ మోడ్‌లు మొదలైన సమాచారం ఇందులో ప్రదర్శిస్తుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

Yezdi స్క్రాంబ్లర్ మూడు ABS మోడ్‌లను కలిగి ఉంది. అవి రోడ్, ఆఫ్-రోడ్ మరియు రెయిన్ మోడ్స్. స్క్రీన్‌పై సమాచారం అలాగే ABS మోడ్‌లను హ్యాండిల్‌బార్‌లోని స్విచ్‌గేర్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ స్విచ్ గేర్ యొక్క నాణ్యత కూడా చాలా బాగుంది. మొత్తం మీద యెజ్డీ స్క్రాంబ్లర్ అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

Yezdi Scrambler ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు రైడింగ్ ఇంప్రెషన్స్:

యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) అనేది సరదాగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే మోటార్ సైకిల్. స్క్రాంబ్లర్ రైడింగ్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

స్క్రాంబ్లర్‌ బైక్ 334 సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇదే ఇంజన్ యెజ్డీ అడ్వెంచర్, యెజ్డీ రోడ్‌స్టర్ మరియు జావా పెరాక్‌ వంటి వాటికి కూడా శక్తినిస్తుంది. ఈ ఇంజిన్ మంచి పనితీరుని అందించడానికి అనుకూలంగా ట్యూన్ చేయబడింది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

యెజ్డీ స్క్రాంబ్లర్‌లోని ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 28.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 28.2 ఎన్ఎమ్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. ఈ బైక్ లో పవర్ మరియు టార్క్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు రైడింగ్ చేస్తున్న భూభాగాన్ని బట్టి మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

ఆన్-రోడ్ పర్ఫామెన్స్ వవిషయానికి వస్తే, బాటమ్ ఎండ్ సంతృప్తికరంగా ఉంటుంది, అదే సమయంలో మిడిల్ రేంజ్ లో సరదాగా ఉంటుంది. ఇది 6,000 - 8,000 ఆర్‌పిఎమ్ మధ్య మిడ్ రేంజ్ లో చాలా సరదాగా ఉన్నప్పటికీ, 8,500 ఆర్‌పిఎమ్ కంటే ఎక్కువ వేగంతో ఉన్నప్పుటు కొంచెం ఒత్తిడికి గురవుతుంది. స్క్రాంబ్లర్‌లో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

స్క్రాంబ్లర్‌లో రైడింగ్ పొజిషన్ మీరు హైవేపై ప్రయాణించడానికి ఉద్దేశించినది కాదు. సస్పెన్షన్ కూడా మీకు అదే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే సస్పెన్షన్ మరింత గట్టి వైపుకు అమర్చబడి ఉంటుంది. మీరు హ్యాండిల్‌బార్‌పై కొంచెం అండర్‌స్టీర్‌గా భావిస్తారు. అయితే ఇది డీల్‌బ్రేకర్ కాదు, కానీ త్వరలో స్టీరింగ్ అనుభూతిని ఆస్వాదించడం మొదలుపెడతారు.

రైడింగ్ పొజిషన్‌ను బట్టి, నిలబడి రైడింగ్ చేయడం మేము మీకు సూచించేది కాదు. అయితే, అవసరమైన చోట, మీరు ఫుట్‌పెగ్‌లపైకి వెళ్లి మోటార్‌సైకిల్‌ను పట్టుకోవడానికి ట్యాంక్‌ప్యాడ్‌లను ఉపయోగించవచ్చు. ట్విన్ ఎగ్జాస్ట్‌ల కారణంగా ఇంజిన్ అద్భుతంగా అనిపిస్తుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

ఇందులోని ఇంజిన్ ఇప్పుడు వివిధ పరిస్థితులలో కూల్ గా నడుస్తుంది. ఇందులో కొత్త రేడియేటర్ అందుబటులో ఉంటుంది. ఇందులోని హారిజాంటల్ పైప్స్ కూలింగ్ ని 50 శాతం వరకు సమర్థవంతంగా పనిచేసే విధంగా ఉంటాయి.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

యెజ్డీ స్క్రాంబ్లర్‌ యొక్క బ్రేకింగ్ సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందువైపు 320 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ ఉంది. ABS అనేది స్టాండర్డ్ గా అందుబటులో ఉంటుంది. ఇప్పటికే చెప్పుకున్నట్లుగా రోడ్, ఆఫ్-రోడ్ మరియు రెయిన్ అనే మూడు ABS మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

ఇందులోని రోడ్ మోడ్ సాధారణ రోడ్డుపైన ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా ఆఫ్-రోడ్ మోడ్ వెనుక బ్రేక్‌లపై ABS ని స్విచ్ ఆఫ్ చేస్తుంది, ఇక చివరగా రెయిన్ మోడ్ ఏదైనా ప్రమాదాలను నివారించడానికి ABS మెకానిజం ముందుగానే కట్ చేస్తుంది. మొత్తానికి ఇది మంచి పనితీరుని మరియు అద్భుతమైన రైడింగ్ అనుభూతిని తప్పకుండా కలిగిస్తుంది.

Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

Yezdi Scrambler కలర్ ఆప్సన్స్ మరియు ప్రైస్:

Yezdi Scrambler ఆకర్షణీయమైన కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క కలర్ ఆప్సన్ ని బట్టి ధరలో కూడా మార్పు ఉంటుంది.

సింగిల్-టోన్ కలర్స్:

  • ఫైర్ ఆరెంజ్: రూ. 2,04,900
  • అవుట్‌లా ఆలివ్ (Outlaw Olive): రూ. 2,06,900
  • యెల్లింగ్ ఎల్లో: రూ. 2,06,900
  • డ్యూయెల్-టోన్ కలర్స్:

    • మిడ్‌నైట్ బ్లూ: రూ. 2,10,900
    • మీన్ గ్రీన్: రూ. 2,10,900
    • రెబల్ రెడ్: రూ. 2,10,900
    • ఇందులోని సింగిల్-టోన్ కలర్స్ లో అవుట్‌లా ఆలివ్ ఉత్తమ ఎంపిక అయితే, డ్యూయల్-టోన్ షేడ్స్ అన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తాయి.

      Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

      ప్రత్యర్థులు:

      Yezdi Scrambler బైక్ కి భారతీయ మార్కెట్లో ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయితే ఈ కొత్త బైక్ యొక్క ధర తక్కువగా ఉంటుంది, కావున ఇది బెనెల్లీ లియోన్సినో 500, బిఎండబ్ల్యు ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్, ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మరియు డుకాటి స్క్రాంబ్లర్ వంటివి ప్రత్యర్థులుగా ఉండే అవకాశం ఉంటుంది.

      Yezdi Scrambler ఫస్ట్ రైడ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

      డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

      యెజ్డీ స్క్రాంబ్లర్ అనేది భారతీయ మార్కెట్లో అత్యంత అదరణీయమైన స్క్రాంబ్లర్ బైక్. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉండటం వల్ల రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. స్క్రాంబ్లర్ మార్కెట్లో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తప్పకుండా పొందుతుంది. ఇటీవల కాలంలో మీరు తక్కువ ధర వద్ద స్క్రాంబ్లర్ బైక్ కొనాలని ఎదురు చూస్తున్నట్లైతే యెజ్డీ స్క్రాంబ్లర్ మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Yezdi scrambler review riding impressions engine performance features details
Story first published: Friday, February 11, 2022, 10:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X