ఏఎమ్‌టి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

By Ravi

ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ కార్లలో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. దేశపు అగ్రగామి మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా తమ సెలెరియో పెట్రోల్ కారు ద్వారా ఏఎమ్‌టిని ఇండియన్ కస్టమర్లకు పరిచయం చేసింది. ఆ తర్వాత టాటా మోటార్స్ తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో డీజిల్ వెర్షన్‌లో ఏఎమ్‌టిని పరిచయం చేసింది.

ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ ఆల్టో కె10 మోడల్‌లో ఏఎమ్‌టిని పరిచయం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేయనున్నారు. ఏఎమ్‌టి గేర్‌బాక్స్ రెగ్యులర్ ఆటోమేటిక్ గేర్‌‍బాక్స్ కన్నా తక్కువ ధరను కలిగి ఉండి, మైలేజ్‌ను ప్రభావితం చేయకుండా మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో సమానమైన మైలేజీనిస్తుంది.

అతికొద్ది కాలంలోనే ఏఎమ్‌టి ఇంతటి సక్సెస్‌ను సాధించడానికి కారణం ఏంటి? అసలు ఏఎమ్‌టి ఎలా పనిచేస్తుంది? ఏ మ్యాన్యువల్ కారుకైనా ఏఎమ్‌టిని ఫిట్ చేసుకోవచ్చా వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఏఎమ్‌టి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

తర్వాతి స్లైడ్‌లలో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

1. క్లచ్ పెడల్ ఉండదు, కానీ క్లచ్ ఉంటుంది

1. క్లచ్ పెడల్ ఉండదు, కానీ క్లచ్ ఉంటుంది

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీలో రెగ్యులర్ ఆటోమేటిక్ కార్లలో మాదిరిగానే కారులో క్లచ్ పెడల్ ఉండదు, కానీ ఇందులో క్లచ్ మాత్రం ఉంటుంది. ఈ క్లచ్‌ను స్పీడ్‌కు అనుగుణంగా కారులోని కంప్యూటర్ అప్లయ్ చేస్తూ ఉంటుంది.

2. 1986లోనే ఏఎమ్‌టి టెక్నాలజీ

2. 1986లోనే ఏఎమ్‌టి టెక్నాలజీ

సాంప్రదాయ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పోల్చుకుంటే ఈ ఏఎమ్‌టి చాలా తక్కువ ధరను కలిగి ఉంటుంది, అంతేకాకుండా ఇది సౌకర్యవంతమైనది కూడా. ఆసక్తికరమైన విషయం ఏటంటే.. 1986లోనే ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించారు. అప్పట్లోని ఫెరారీ రేస్ కార్లలో ఏఎమ్‍‌టి టెక్నాలజీని ఉపయోగించారు.

3. ఎలాంటి మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌కైనా ఏఎమ్‌టిని జోడించుకోవచ్చు

3. ఎలాంటి మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌కైనా ఏఎమ్‌టిని జోడించుకోవచ్చు

ఎలాంటి మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌కైనా ఏఎమ్‌టి కిట్‌ను జోడించుకోవచ్చు.

4. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ మాత్రమే

4. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ మాత్రమే

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కిట్‌ను కార్ మేకర్లు మాత్రమే ఫిట్ చేస్తారు. ఆఫ్టర్ మార్కెటింగ్ ఫిట్టింగ్స్ వలన కారు చెడిపోయే ప్రమాదం ఉంటుంది.

5. రెండు కీలక భాగాలు

5. రెండు కీలక భాగాలు

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)లో రెండు కీలక భాగాలు ఉంటాయి. అవి - 1. హైడ్రాలిక్ సిస్టమ్, 2. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్.

6. స్పోర్ట్స్ మోడ్

6. స్పోర్ట్స్ మోడ్

ఏఎమ్‌టి మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌పై పనిచేస్తుంది. ఇది క్లచ్, గేర్లను ఆటోమేటిక్‌గా ఎంగేజ్, డిస్ఎంగేజ్ చేస్తుంటుంది. అయితే, ఇందులో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ మోడ్ సాయంతో డ్రైవర్ గేర్లను మ్యాన్యువల్‌గా మార్చుకునే వెసలుబాటు ఉంటుంది.

7. కస్టమర్లకు, కంపెనీలకు బెనిఫిట్

7. కస్టమర్లకు, కంపెనీలకు బెనిఫిట్

ఇది కస్టమర్లకే కాకుండా కార్లను తయారు చేసే కంపెనీలకు కూడా సౌకర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను రీప్లేస్ చేయదు కాబట్టి. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ లేవుట్ పూర్తిగా విభిన్నంగా ఉంటుంది.

8. 2020 నాటికి 20 శాతం ఏఎమ్‌టి

8. 2020 నాటికి 20 శాతం ఏఎమ్‌టి

భారత్‌లోని ప్యాసింజర్ కార్లకు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని సప్లయ్ చేస్తున్న ఇటాలియన్ కంపెనీ మాగ్నెటి మారెల్లీ అంచనా ప్రకారం, 2020 నాటికి దేశంలో 20 శాతానికి పైగా ప్యాసింజర్ వాహనాలు ఏఎమ్‌టిని కలిగి ఉంటాయి.

9. అధిక మైలేజ్

9. అధిక మైలేజ్

రెగ్యులర్ (ఫుల్లీ) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో పోల్చుకుంటే, ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) 10 శాతం అధనపు మైలేజీని ఆఫర్ చేస్తుంది.

10. తక్కువ ధర

10. తక్కువ ధర

ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి కార్ల మధ్య ధరల వ్యత్యాసం సుమారు రూ.40,000 నుంచి రూ.50,000 మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

English summary
AMT (Automated Manual Transmission) is became talk of the town in Indian automobile industry. As the name suggests, it is a mechanism that automates manual transmission. Here are some important things you should know about AMT. Take a look.
Story first published: Monday, November 10, 2014, 12:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X