ఫిబ్రవరి నెలలో దేశం మొత్తం ఎక్కువగా కొన్న కార్లు ఇవే.. ఒక్కో మోడల్ నిజంగా ఆణిముత్యమే!

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న, అతిపెద్ద కార్ల మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో మధ్యతరగతి వృద్ధి, పెరుగుతున్న నగరీకరణ, సులభమైన ఫైనాన్స్ సదుపాయాలు, అలాగే విభిన్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న మోడళ్ల వల్ల కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రతి నెలా విడుదలయ్యే సేల్స్ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు; అవి వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ ట్రెండ్స్, బ్రాండ్ల మధ్య ఉన్న తీవ్ర పోటీని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన టాప్ 10 కార్ల జాబితా విడుదల కావడం ఆటో రంగంలో ఆసక్తికర చర్చలకు దారితీసింది. వాటి గురించి కింది కథణంలో చూద్దాం.

Tata Nexon: అగ్రస్థానంలో నిలిచింది టాటా నెక్సాన్. ఈ కాంపాక్ట్ SUV ఫిబ్రవరి 2026లో మొత్తం 19,430 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో 15,349 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, ఈసారి 26.59 శాతం వృద్ధి నమోదు అయింది. ప్రామాణిక నెక్సాన్ ధర రూ.7.32 లక్షల నుండి రూ.14.05 లక్షల మధ్య ఉండగా, నెక్సాన్ EV ధర రూ.12.49 లక్షల నుండి రూ.17.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

India Best Selling Cars February 2026 Nexon Dzire Punch Lead Sales More Details

Maruti Suzuki Dzire: మారుతి సుజుకి డిజైర్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది . ప్రముఖ సెడాన్‌గా గుర్తింపు పొందిన ఈ కారు ఫిబ్రవరిలో 19,326 యూనిట్లు డెలివరీ చేయబడింది. గత ఏడాది ఇదే కాలంలో 14,694 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే 31.52 శాతం వృద్ధి సాధించింది. కొత్త డిజైర్ ధర రూ.6.26 లక్షల నుండి రూ.9.31 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

Tata Punch: టాటా పంచ్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ మైక్రో SUV ఫిబ్రవరి 2026లో 18,748 యూనిట్లు అమ్ముడవ్వగా, 2025లో ఇదే నెలలో 14,559 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే 28.77 శాతం వృద్ధి. ప్రామాణిక పంచ్ ధర రూ.5.60 లక్షల నుండి రూ.10.55 లక్షల మధ్య ఉండగా, పంచ్ EV ధర రూ.9.69 లక్షల నుండి రూ.12.59 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

India Best Selling Cars February 2026 Nexon Dzire Punch Lead Sales More Details

Hyundai Creta: హ్యూందాయ్ క్రెటా నాల్గవ స్థానంలో ఉన్నది . ప్రముఖ SUVగా పేరు పొందిన ఈ మోడల్ ఫిబ్రవరిలో 17,938 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 16,317 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే 9.93 శాతం వృద్ధి సాధించింది. ప్రామాణిక క్రెటా ధర రూ.10.79 లక్షల నుండి రూ.20.20 లక్షల వరకు ఉండగా, క్రెటా ఎలక్ట్రిక్ ధర రూ.18.02 లక్షల నుండి రూ.23.96 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా ఐదవ స్థానాన్ని దక్కించుకుంది . ఈ SUV ఫిబ్రవరి 2026లో 17,863 యూనిట్లు అమ్ముడవ్వగా, 2025లో ఇదే నెలలో 15,392 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే 16.05 శాతం వృద్ధి. బ్రెజ్జా ధర రూ.8.26 లక్షల నుండి రూ.13.01 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆరవ స్థానంలో నిలిచింది మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga).

India Best Selling Cars February 2026 Nexon Dzire Punch Lead Sales More Details

ప్రముఖ MPVగా నిలిచిన ఈ మోడల్ ఫిబ్రవరిలో 17,807 యూనిట్లు విక్రయించబడింది. గత ఏడాది ఇదే నెలలో 14,868 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే 19.77 శాతం వృద్ధి. ఎర్టిగా ధర రూ.8.80 లక్షల నుండి రూ.12.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇక ఏడవ స్థానంలో మారుతి వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki Wagon R) 14,885 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. ఎనిమిదవ స్థానంలో స్విఫ్ట్ (Swift 14,833) యూనిట్లతో కొనసాగింది.

తొమ్మిదవ స్థానాన్ని మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) 14,655 యూనిట్లతో దక్కించుకోగా, పదో స్థానంలో మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) 14,632 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. మొత్తంగా చూస్తే, ఫిబ్రవరి టాప్ 10 జాబితాలో SUVలే ప్రధానంగా ఆధిపత్యం చాటాయి. అలాగే, మారుతి కంపెనీకి చెందిన కార్లు ఎక్కువ వాటా కలిగి ఉండటం విశేషం.

More from DriveSpark

Article Published On: Tuesday, March 3, 2026, 9:27 [IST]
English summary
India best selling cars february 2026 nexon dzire punch lead sales more details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+