సాంత్రో కారు కనిపించడం లేదు..!!

By

Hyundai Santro
కొరియా కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ హుందాయ్ మోటార్స్. భారతీయ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న హుందాయ్ మోటార్స్ లో సాంత్రో కారు బహుళజనాధరణ పొందినది. ముఖ్యంగా ఈ కారు భారతీయ మార్కెట్ లో సింహ భాగం షేరును ఆక్రమించింది. టాటా మోటార్స్ ఇండికా, హుందాయ్ మోటార్స్ సాంత్రో కారు ఒకే ఏడాది లో విడుదలయినా సాంత్రో కారు తన ఉనికిని చాటుకోవడమే కాకుండా, నగర ప్రజల కారుగా మారి ప్రతి ఇంటా దర్శనమిచ్చిన దాఖలాలు వున్నాయి. ఈ కారు ధర కూడా 3.20 లక్షల నుండీ 3.60 లక్షల మధ్యే వుండటంతో అందరూ ఈ కారు మీద ఆశక్తి చూపించారు. ఒక్కో సారి నెలకు 12,000 నుండీ 13,000 యూనిట్ల అమ్మకాలు చోటుచేసుకున్న సాంత్రో కారు ఇప్పుడు మార్కెట్ తగ్గి నెలకు గరిష్టంగా 7,000 యూనిట్లు అమ్ముడయ్యే పరిస్థతి కనిపిస్తోంది.

దీనికి కారణం హుందాయ్ మోటార్స్ విడుదల చేసిన i10 కారు. 2007 లో జరిగిన న్యూఢిల్లీ ఆటో షోలో విడుదలయిన ఈ కారు మోడల్ లో సాంత్రో కారును మరిపిస్తూ, అత్యాధునిక ఫీచర్స్ తో తయారవడంతో ఈ కారు అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ కారు నెలకు 12,000 యూనిట్ల అమ్మకాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారుకు పెరిగిన ఆదరణను దృష్టిలో వుంచుకొని ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ ను రూపొందిస్తోంది హుందాయ్ మోటార్స్. మూడేళ్ల క్రితం 2007 లో ఢిల్లీ లో జరిగిన ఆటో షోలోనే ఈ i10 ను ఆవిష్కరించిన హుందాయ్ మోటార్స్ ఇప్పుడీ ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చెయ్యడానికీ ఢిల్లీ ఆటో షోనే వేదికగా చేసుకోవడం విశేషం.

Most Read Articles

Story first published: Thursday, December 31, 2009, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X