'నానో' కొనేప్పుడు ఒకటిరెండు సార్లు ఆలోచించండి

ఇటీవలి కాలంలో నానోకు అగ్నికి ఆహుతి కావడం అలవాటయిపోయినట్టుంది. ఇప్పటికే పదికి పైగా కార్లు అగ్ని ఆహుతి అయ్యాయని సమాచారం. తాజాగా గుజరాత్ లో మరో కొత్త నానో కారు అగ్నిప్రవేశం చేసింది...క్షమించాలి వినియోగదారులకు అగ్నిపరీక్ష పెడుతోంది. ఈ ప్రమాదాల మీద ఇప్పటికే సర్వత్రా విమర్శలు వస్తున్నా ఆ అదేదో చిన్న లోపమే అన్నట్టుగా వ్యవహరిస్తున్న టాటా మోటార్స్ కావాలంటే కొత్త కారు..లేదంటే డబ్బు వాపస్ అని నిర్లక్ష్య సమాధానం ఇస్తోంది కానీ అసలీ ప్రమాదాలకు కారణం ఏంటని కనిపెట్టలేకపోయింది. దీంతో అలాగే ఈ కార్లను డెలివరీ చేసేస్తోంది.

ఇక ఇప్పుడు కూడా ఇలాగే బుధవారం నాడు అహమ్మదాబాదు నుండీ 11 కొత్త నానో కార్లను వడోదరాకు తరలిస్తుండగా బొరియావి అనే గ్రామం వద్దకు రాగానే కారు వెనక భాగాన అగ్ని రేగడంతో డ్రైవర్ వెంటనే దిగిపోవడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఇక గత రెండు వారాల క్రితం ముంబైలో కూడా ఇలాగే సతీష్ సావంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన కొత్త కారును ఇంటికి తీసుకెళ్తుండగా మధ్యలోనే అగ్నిరేగి కారు బూడిదపాలయిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా మంటలు కారు వెనుకభాగానే రేగడం గమనార్హం.

మరి కారు కాలిపోయిందని బాధపడాలో లేక మనం సురక్షితంగా బయటపడ్డామని ఆనందించాలో తెలియక వినియోగదారుడు బిక్కమొహం వేస్తున్నాడు. గత నెలలో ప్రమాదం జరుగుతుందేమోనని అనుమానపడి రీకాల్ పిలుపునిచ్చినందుకే టయోటా మోటార్స్ సంస్థకు అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధిస్తే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న టాటా మోటార్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో మన ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. ఎందుకయినా మంచిది ప్రస్తుత సమయంలో నానో కారు కొనకపోవడమే సురక్షితం.. ఏమంటారు..!?

కార్లను పోల్చు

టాటా నానో
టాటా నానో వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
Story first published: Thursday, April 8, 2010, 10:30 [IST]
Please Wait while comments are loading...

Latest Photos