నానో కారు నడుపుతున్నారా.. అయితే జర జాగ్రత్త గురూ..!!

ఇటీవలే సుజుకీ సంస్థ అధినేత నానో కారుకు మీ సంస్థ పోటీగా కారును తయారుచేసే ఆలోచనా వుందా అన్ని ప్రశ్నకు మేము నానోలా భద్రతా ప్రమాణాలకు నీళ్లొదిలేయలేము అని చెప్పి నానో భద్రత మీద సందేహాన్ని వ్యక్తం చేసారు. ఇలా ఆయన వ్యాఖ్యానించిన వారంలోపే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
మరి ఇంతకు ముందు జరిగిన ప్రమాదాలకు ఏదో చిన్న సాంకేతిక లోపం అని సర్దిచెప్పిన టాటా సంస్థ ఈ ప్రమాదానికి కూడా దాదపు ఇలాంటి సమాధానాన్నే చెప్పింది. కానీ నానో కారును పూర్తిగా పరీక్షించాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఏదో ఓ కమిటీని రూపొందించి చేతులు దులిపేసుకోకుండా నానో కారును రీకాల్ కు పిలుపునిచ్చి ఇప్పటి వరకూ డెలివరీ చేసిన నానో కార్లను కూడా పరీక్షించి సమస్యలను సవరించాల్సిన ఆవస్యకత ఎంతయినా వుంది.
ఇక మొన్న ప్రమాదం బారిన పడ్డ నానో కారు 2.4 లక్షలతో రూపొందిన ఆధునిక సదుపాయాలతో రూపొందించినది. ఎంతో ఖర్చు పెట్టిన ఆధునికమయిన నానోకే ఈ గతి పడితే మరి లక్షా పాతికవేలకే లభించే బేసిక్ మోడళ్ల గతేంటో మరి..?? కనుక నానో వినియోగదారులారా పారాహుషార్...ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి జర జాగ్రత్తగా వుండండి...!!


Click it and Unblock the Notifications








