నానో మొదటి జన్మదినం రోజున దుర్వార్త: కొత్త నానో కారు అగ్గిపాలు

టాటా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిన్న కారు నానో విడుదలయి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. అలాంటి శుభసందర్భాన టాటా మోటార్స్ కూ ఓ చేదు వార్త. నానో భద్రతను సవాలు చేస్తూ నిన్న మధ్యాహ్నం ముంబై మహా నగరంలో ఓ నానో కారు అగ్నికి ఆహుతయింది. ముంబై ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

బాధితుడి కథనం ప్రకారం ముంబై కు చెందిన సతీష్ సావంత్ తను ఎప్పుడో ఆర్డర్ ఇచ్చిన నానో కారు తన చేతికి రావడంతో ఎంతో ఉత్సాహంతో తన సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుందామని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. తనతో పాటు షోరూం వారు ఓ డ్రైవర్ ను వెంటపంపించారు. దీంతో ఎంతో ఆనందంగా తన కారులో ఇంటికెళ్తున్న సతీష్ కు ఓ మోటర్ సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి వెనక్కు చూడమని సైగ చేసాడు. దీంతో ఏం జరిగిందా అని వెనక్కు చూసిన సతీష్ కు షాక్ తగిలింది. తన కారు ఇంజన్ లో అగ్ని చెలరేగింది. దీంతో వెంటనే కారు దిగేసిన సతీష్ ఏం జరుగుతోందో తెలుసుకొనే లోపే కారు పూర్తిగా అగ్నిలో చిక్కుకొని కాలిపోయింది. ఏం జరిగిందో తెలియదు.. కానీ నా కారు మాత్రం నాకు లేకుండా పోయిందని సతీష్ ఆవేదన వ్యక్తం చేసాడు.

ఇక ఈ కారును సతీష్ అన్ని ఆదునిక సదుపాయాలతో రూపొందించి 2.4 లక్షలు పెట్టి కొనుగోలు చేసాడు. ఎంతో ఖర్చు పెట్టి ఆధునికమయిన నానోకే ఈ గతి పడితే మరి బేసిక్ మోడళ్ల గతేంటో మరి..?? అయినా నానోకు అగ్ని ప్రమాదాలు ఏమీ కొత్తకాదు. ఇంతకు ముందు మూడు సార్లు ఈ కారులో షార్ట్ సర్కూట్ కారణంగా అగ్ని వ్యాపించినా ఈ రేంజిలో కారు మొత్తం కాలిపోవడం జరగలేదు. మరి ఈ ఘటనపై టాటా మోటార్స్ ఏ వివరణ ఇవ్వనుందో మరి..!?

కార్లను పోల్చు

టాటా నానో
టాటా నానో వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
Story first published: Tuesday, March 23, 2010, 12:34 [IST]
Please Wait while comments are loading...

Latest Photos