చిన్న కార్ల మధ్య యుద్ధం మొదలయింది

By

Volkswagen Polo
గత ఏడాది విడుదలయిన బుల్లి కారు టాటా నానో ఆటోమొబైల్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పవచ్చు. కేవలం లక్ష రూపాయలకే కారు అని ప్రకటించడంతో ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఈ కారుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకూ ఈ కారుని బుక్ చేసుకున్న కారు పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే డిసెంబరు వరకూ ఈ కారు రెండవ దఫా బుకింగులు క్లోజ్ చేసారంటే ఈ కారుకొచ్చిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రతీ ఆటోమొబైల్ సంస్థ చిన్న కార్ల మీద ప్రత్యేక దృష్టిని సారించాయి.

ఇక తాజాగా ఫోర్డ్ సంస్థ కూడా ఫిగో కారును ఇక్కడ విడుదల చెయ్యడంతో పాటు ఈ కారు ధర కూడా రూ. 3 లక్షల నుండీ రూ. 4 లక్షల మధ్య వుండటంతో ఈ కారుకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీటికి తోడు వోక్స్ వ్యాగన్ పోలో కారు కూడా త్వరలో విడుదల అవుతుండటం దీనిధర కూడా 4.5 లక్షలు కావడంతో ఈ కారు మీద మార్కెట్ వర్గాలు ప్రత్యేక దృష్టిని సారించాయి.

ఇక మారుతీ సుజుకీ సంస్థ మారుతీ 800 స్థానాన్ని భర్తీ చెయ్యడానికి తీసుకువస్తున్న మారుతీ సెర్వో కూడా జూన్ లో విడుదల అవుతుండటం, దీని ధర కూడా కేవలం 1.5 లక్షలుగా వుండటంతో ఈ కారు టాటా నానోకు ప్రధాన పోటీ కానుంది. ఇక టూవీలర్ సంస్థ బజాజ్ ఆటో కూడా నిస్సాన్ సంస్థతో కలసి సంయుక్తంగా ఓ చిన్న కారును రూపొందిస్తుండటంతో ఇక త్వరలో చిన్న కార్ల మధ్య ధరల యుద్ధం మొదలు కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Most Read Articles

Story first published: Friday, March 12, 2010, 10:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X