'నానో' లాగా గాలికొదిలేయ లేము: సుజుకీ

By

Tata Nano
భారతీయ ఆటోమొబైల్ ధిగ్గజం టాటా మోటార్స్ రూపొందించిన బుల్లి కారు నానో. ఈ కారుకు అంతటా అపూర్వ ఆదరణ లభించింది. లక్ష రూపాయలకే కారు అనడంతో మధ్య తరగతి వారు సైతం ఈ కారు మీద ఆశక్తి చూపుతున్నారు. మరి నానో లాగా లక్ష కారును రూపొందించే అవకాశం వుందా అని మారుతీ సుజుకీ భాగస్వామ్య సంస్థ సుజుకీ అధినేత ఒసాము సుజుకీ అధినేతను ప్రశ్నించగా తాము నానో లాగా భద్రతను గాలికొదిలేయ లేమని... అంతే కాకుండా వినియోగదారుడి సౌకర్యం విషయంలో కూడా తాము రాజీపడలేమని అందుకే నానో లాంటి కారును రూపొందించలేమని పరోక్షంగా నానో భద్రతా సౌకర్యాలను ప్రశ్నించాడు..??

అయినా నానో భద్రత మీద మరీ ఆయన ఇంతలా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. నానో భద్రత గురించి మాకు ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదులూ అందలేదు. కానీ తామెంతో భద్రంగా, సౌకర్యవంతంగా రూపొందించామనుకుంటున్న మారుతీ సుజుకీ వారి ఎ స్టార్ కారే రీకాల్ వరకూ వెళ్లిందని టాటా మోటార్స్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించాడు. కాగా త్వరలో సుజుకీ వోక్స్ వ్యాగన్ సంస్థతో కలసి ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లను మార్కెట్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసింది.

Most Read Articles

Story first published: Thursday, March 18, 2010, 12:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X