ఐఐటి, ఐఐఎమ్ విద్యార్థుల కోసం హ్యుందాయ్ గాలింపు

తొలి దశలో భాగంగా "హ్యుందాయ్ బ్లూ వేవ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఐఐటి మద్రాస్ నుంచి ఇప్పటికే ఇద్దరు ఇంజనీర్లను, ఒక్కొక్కరికి సంవత్సరానికి 50,000 డాలర్లు (రూ.27 లక్షలకు పైగా) జీతం చొప్పను నియమించుకుంది. రెండవ దశలో భాగంగా ఐఐఎమ్ బెంగుళూరుపై ప్రపంచపు ఐదవ అతిపెద్ద కంపెనీ అయిన హ్యుంద్యాయ్ దృష్టిసారించింది.
ఐఐఎమ్ బెంగుళూరు నుండి తమ గ్లోబల్ మార్కెటింగ్ కార్యకలాపాల కోసం కనీసం ఒక్క విద్యార్థిని అయినా నియమించుకుంటామని హ్యుందాయ్ అధికారి ఒకరు బిజినెస్ లైన్ పత్రికకు వెల్లడించారు. ఐఐఎమ్ విద్యార్థులకు కనీస జీతం సంవత్సరానికి 70,000 డాలర్లు (అంటే, మన కరెన్సీలో సుమారు రూ.39 లక్షలు) ఇవ్వనున్నారు.
జీతంతో పాటుగా హౌసింగ్ అలవెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగి స్వదేశ పర్యటన వంటి సదుపాయాలను కూడా కంపెనీ కల్పించనుంది. ఇవేకాకుండా, ఇంజనీర్ల కోసం 'లీడర్స్ వేవ్', మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్‌ల కోసం 'ప్రొఫెషనల్ వేవ్స్' అనే కార్యక్రమాలను కూడా కంపెనీ నిర్వహిస్తుంది.


Click it and Unblock the Notifications








