అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలు: ఐషర్ మోటార్స్

Royal Enfield
ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన మాతృ సంత్థ ఐషర్ మోటార్స్ అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. గడచిన సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో కంపెనీ లాభం (పన్ను అనంతర లాభం) ఏకంగా 87.97 శాతం వృద్ధి చెంది రూ.120.3 కోట్లుగా నమోదైనట్లు ఐషర్ మోటార్స్ వెల్లడించింది.

గడచిన సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.64 కోట్లుగా ఉంది. కాగా.. జులై-ఆగస్ట్ 2011 త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 32.13 శాతం పెరిగి రూ.1,451.3 కోట్లుగా ఉంది. గడచిన ఆర్థిక సవత్సరం ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,098.4 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఐషర్ మోటార్స్ ఇది మంచి త్రైమాసికమని, రికార్డు స్థాయిలో కార్యకలాపాల ద్వారా ఇంత భారీ మొత్తంలో ఆదాయం వచ్చిందని, పరిశ్రమ తగ్గుముఖం పట్టినప్పటికీ తమ వృద్ధి మాత్రం కొనసాగూనే ఉందని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్ధార్థ్ లాల్ పేర్కొన్నారు.

Most Read Articles

English summary
Leading automobile company Eicher Motors reported 87.97 per cent jump in profit after tax at Rs 120.3 crore in the second quarter of this fiscal. The company had posted a profit after tax of Rs 64 crore in the corresponding period last year.
Story first published: Saturday, November 12, 2011, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X