క్యూ2లో 38 శాతం వృద్ధిని సాధించిన ఐషర్ మోటార్స్

Royal Enfield Bullet
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు చెందిన మాతృ సంస్థ మరియు ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్ 30, 2011తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 38.29 శాతం వృద్ధి చెంది రూ.76.31 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 55.18 కోట్లుగా ఉన్నట్లు ఐషర్ మోటార్స్ తెలిపింది.

కాగా.. ఈ సమయంలో కంపెనీ నిర్వహణ వచ్చిన ద్వారా మొత్తం ఆదాయం 25.03 శాతం పెరిగి గతేడాదితో పోలిస్తే.. రూ.1,038.48 కోట్ల నుండి రూ.1,298.42 కోట్లకు పెరిగింది. హెవీ డ్యూటీ, లైట్ అండ్ మీడియం డ్యూటీ బస్సులు మరియు మోటార్‌సైకిళ్ల వ్యాపారం నుంచి పటిష్టమైన వృద్ధిని కనబరిచిందని ఐషర్‌ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సిద్దార్థ లాల్‌ చెప్పారు. ఈ త్రైమాసికంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్ అమ్మకాలు 48.64 శాతం వృద్ధి చెంది 12,501 యూనిట్ల నుంచి 18,581 యూనిట్లకు పెరిగినట్లు ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
Commercial vehicle maker Eicher Motors reported 38.29% jump in its consolidated profit for the second quarter ended June 30 at Rs 76.31 crore, the company had posted a profit of Rs 55.18 crore in the corresponding period last year.
Story first published: Sunday, July 31, 2011, 10:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X