దీపావళి ఆఫర్: మిత్సుబిషి సెడియాపై భారీ డిస్కౌంట్

Mitsubishi Cedia Festive Offer
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మిత్సుబిషి భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'మిత్సుబిషి సెడియా'పై దీపావళి పండుగ సందర్భంగా గొప్ప డిస్కౌంట్‌ను అందిస్తుంది. అక్టోబర్ 31, 2011వ తేదీ లోపుగా సెడియా కారును కొనుగోలు చేసే వారికి రూ.80,000 వరకూ ఆదా కానుంది.

భారత్‌లో అత్యంత పురాతన ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ మోటార్స్‌తో మిత్సుబిషి చేతులు కలిపి దేశీయ విపణిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మిత్సుబిషి భారత మార్కెట్లో మొత్తం ఐదు మోడళ్లను అందిస్తుంది. అందులో రెండు సెడాన్ మోడళ్లు, మరో మూడు ఎస్‌యూవీలు.

మిత్సుబిషి అందిస్తున్న సెడియా సెడాన్ ఓ స్పోర్ట్ కారును తలపిస్తుంది. తక్కువ ధరలో మంచి విలాసవంతమైన అనుభూతిని ఇది కల్పిస్తుంది. మిత్సుబిషి సెడియా ఫీచర్లను పరిశీలిస్తే..:

మిత్సుబిషి సెడియా సెడియా ఎక్స్‌టీరియర్స్‌ను పరిశీలిస్తే.. ఇందులో స్లీక్ ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, ఫిష్-ఐ హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ రియర్ స్పాయిలర్‌లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. అలాగే ఇంటీరియర్స్‌లో బ్రేక్, క్లచ్, యాక్సిలరేటర్ పెడల్స్‌‌పై కాలు జారిపోకుండా ఉండేలా డిజైన్ చేసిన యాంటీ-స్కిడ్ అల్లాయ్ పెడల్స్, మోమో స్టీరింగ్ వీల్ ప్రత్యేకమైనవి.

కాంతిని మనకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉండేలా తీర్చిదిద్దిన డ్యాష్‌బోర్డ్ మరొక విశిష్టత. ఇందులో ఈసిఐ మల్టీ (ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ మల్టీ-పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్)తో కూడిన, రీడిఫైన్ చేయబడిన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకునేలా డిజైన్ చేసిన కారు బాడీ, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 3-పాయింట్ ఎమర్జెన్సీ లాకింగ్ రియాక్టర్ సీట్ బెల్ట్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

మిత్సుబిషి సెడియా కారు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.9,30,000 లుగా ఉండగా ఎక్స్-షోరూమ్ విజయవాడ ధర రూ.9,46,533 లుగా ఉంది. మరిన్న వివరాలకు మీ సమీపంలోని మిత్సుబిషి డీలర్‌షిప్ కేంద్రాన్ని సందర్శించండి. త్వరపడండి ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.

Most Read Articles

English summary
Japan based leading car maker Mitsubishi is offering up to Rs 80,000 savings on its sports sedan 'Sedia'. Mitsubishi Sedia is powered by the refined, responsive 2.0 liter petrol engine with advanced ECI Multi (Electronically Controlled Multi-point Fuel Injection).
Story first published: Monday, October 17, 2011, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X