ఫోర్స్ వన్ ఎస్‌యూవీ కోసం ఫోర్స్ మోటార్స్ పెట్టుబడులు

అంతేకాకుండా.. కంపెనీ క్యాపిటల్ మార్కెట్ రూట్‌ను ఆశ్రయించి హక్కుల జారీ (రైట్స్ ఇష్యూ)ను ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు ఫోర్స్ గ్రూప్ చైర్మన్ డా. అభయ్ ఫిరోడియా తెలిపారు. కాగా.. ఫోర్స్ వన్ ఎస్‌యూవీ కాకుండా ఫోర్స్ మోటార్స్ అభివృద్ధి చేస్తున్న మరో మల్టీ పర్పస్ వాహనం (ఎమ్‌పివి) ఉత్పత్తి కోసం ప్లాంటు ఏర్పాటు చేసే విషయమై మధ్యప్రదేశ్ సర్కారుతో కంపెనీ చర్చలు జరుపుతోంది. 2012లో ఈ ఎమ్‌పివి మార్కెట్లోకి రానుంది.
తాము కేవలం ఎస్‌యూవీ, ఎమ్‌పివిలను మాత్రమే తయారు చేస్తామని, సెడాన్‌లను తయారు చేయబోమని, ఈ విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని ఫిరోడియా తెలిపారు. తాము కొత్తగా విడుదల చేయబోయే ఎమ్‌పివి భారత్‌లో టొయోటా ఇన్నోవా మరియు యూరప్ మార్కెట్లో రీనాల్ట్ ఎస్కేప్ మోడళ్లకు ధీటుగా నిలుస్తుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








