బెంజ్ వియానో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఫోర్స్ కొత్త ఎమ్‌పివి!

Mercedes-Benz Viano
ఫోర్స్ వన్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విడుదలతో తొలిసారిగా ప్యాసింజర్ వాహన విభాగంలోకి ప్రవేశించిన ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్, ఇప్పుడు తాజాగా మరో కొత్త ఎమ్‌పివి (మల్టీ పర్సప్ వెహికల్)ని అభివృద్ధి చేస్తోంది. ఫోర్స్ మోటార్స్ రూపొందిస్తున్న ఈ ఎమ్‌పివి కోసం కంపెనీ ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ అయిన డైమ్లర్‌తో చేతులు కలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ప్రపంచ మార్కెట్లో అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) 'వియానో' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఫోర్స్ మోటార్స్ తన కొత్త వాహనాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. ఫోర్స్ మోటార్స్ తన తొలి ప్యాసింజర్ ఎస్‌యూవీ విడుదల సందర్భంగా త్వరలోనే మార్కెట్లోకి మరో రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ఫోర్స్ వన్ ఎస్‌యూవీ 2-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇందులో 4-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన కొత్త వేరియంట్‌ను విడుదల చేస్తామని ఫోర్స్ మోటార్స్ గతంలో పేర్కొంది. రూ. 11 లక్షల ధరతో అందిస్తున్న ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో డైమ్లర్ నుంచి పొందిన ఇంజన్‌లను అమర్చారు. ఫోర్స్ మోటార్స్ నుంచి కొత్తగా రానున్న రెండు ఉత్పత్తులలో తొలుతగా 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఫోర్స్ వన్ ఎస్‌యూవీని ఆ తర్వాత ఓ ఎమ్‌పివిని విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Force Motors is keen to make a mark in the passenger car market. The Indian automaker recently launched the Force One SUV priced at Rs.11 lakhs. The new SUV is powered by a diesel engine that has been licensed from Daimler, the German company that owns Mercedes-Benz. Force Motors is now continuing its association with Mercedes-Benz.
Story first published: Wednesday, August 31, 2011, 11:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X