ట్రావెలర్ 26 వాహనాన్ని విడుదల చేసిన ఫోర్స్ మోటార్స్

Written By:

పూనే కేంద్రంగా పనిచేస్తు్నన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ఫోర్స్ మోటార్స్ మరొక్క కొత్త వాహనాన్ని రాష్ట్ర విపణికి పరిచయం చేసింది. టెంపో ట్రావెలర్‌లను ఆఫర్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సంపాధించుకున్న ఫోర్స్ మోటార్స్ ఇప్పుడు తాజాగా 26 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో కూడిన ‘ట్రావెలర్ 26' అనే తేలికపాటి ప్యాసింజర్ కమర్షియల్ వ్యాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోర్స్ మోటార్స్ అందిస్తున్న ట్రావెలర్ వాహనాల్లో ఇప్పటి వరకూ 20 సీటర్ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

అయితే, కంపెనీ తొలిసారిగా అధిక సీటింగ్ సామర్థ్యంతో ఫోర్స్ ట్రావెలర్ 26ను అభివృద్ధి చేసింది. ఈ వాహనం మొత్తాన్ని మోనోకాక్ షాషీ (ఛాస్సిస్)పై రూపొందించారు. మోనోకాక్ షాషీ అంటే వాహన ఫ్లాట్‌ఫామ్, బాడీ రెండింటినీ వేర్వేరుగా జతచేయకుండా ఒకేదానిపై తయారు చేయటం జరుగుతుంది. ప్రపంచంలో కెల్లా మోనోకాక్ ఛాస్సిస్‌పై తయారైన మొట్టమొదటి పెద్ద వాహనం తమదేనని ఫోర్స్ మోటార్స్ సీఓఓ, ప్రెసిడెంట్ నరేష్‌ కుమార్ రత్తన్ తెలిపారు. ఇప్పటికే కార్ల తయారీలో ఈ మోనోకాక్ షాషీ (ఉదా: మహీంద్రా ఎక్స్‌యూవీ500)ను ఉపయోగిస్తున్నారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫోర్స్ ట్రావెలర్ 26 - ధర

ఫోర్స్ ట్రావెలర్ 26 - ధర

ఫోర్స్ ట్రావెలర్ 26 హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.24 లక్షలుగా ఉండగా, ఆన్-రోడ్ ధర రూ.11.90 లక్షలుగా ఉంది (స్టాండర్డ్ వేరియంట్ ధరలు). కాగా ఇందులో డీలక్స్ వేరియంట్ ధర రూ.14.26 లక్షలుగా ఉంది.

ఫోర్స్ ట్రావెలర్ 26 - మోనోకాక్ షాషీ

ఫోర్స్ ట్రావెలర్ 26 - మోనోకాక్ షాషీ

ఫోర్స్ ట్రావెలర్ 26ను మోనోకాక్ షాషీ (ఛాస్సిస్)పై రూపొందించారు. మోనోకాక్ షాషీ అంటే వాహన ఫ్లాట్‌ఫామ్, బాడీ రెండింటినీ వేర్వేరుగా జతచేయకుండా ఒకేదానిపై తయారు చేయటం జరుగుతుంది. ప్రపంచంలో కెల్లా మోనోకాక్ ఛాస్సిస్‌పై తయారైన మొట్టమొదటి పెద్ద వాహనం ఇదే.

ఫోర్స్ ట్రావెలర్ 26 - సీటింగ్

ఫోర్స్ ట్రావెలర్ 26 - సీటింగ్

ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా 26 మంది ప్రయాణికులు కూర్చునేలా డిజైన్ చేసిన ‘ట్రావెలర్ 26' అనే తేలికపాటి ప్యాసింజర్ కమర్షియల్ వ్యాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపెనీ ఇప్పటి వరకూ 20 సీటర్ వాహనాలు మాత్రమే అందిస్తూ వచ్చింది.

ఫోర్స్ ట్రావెలర్ 26 - పెర్ఫామెన్స్

ఫోర్స్ ట్రావెలర్ 26 - పెర్ఫామెన్స్

ఈ సెగ్మెంట్లో ఇతర కంపెనీలు అందిస్తున్న వాహనాలతో పోల్చుకుంటే ఫోర్స్ ట్రావెలర్ 26 ఆధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 129పిఎస్ పవర్, 295ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే కామన్ రైల్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

ఫోర్స్ ట్రావెలర్ 26 - స్కూటల్ బస్

ఫోర్స్ ట్రావెలర్ 26 - స్కూటల్ బస్

విద్యా సంస్థల ఉపయోగార్థంలో ఫోర్స్ ట్రావెలర్ 26లోనే ప్రత్యేకంగా స్కూల్ బస్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. 26 సీట్లలో 36 మంది పిల్లలు కూర్చునేలా దీన్ని డిజైన్ చేశారు. స్కూల్ బస్ వెర్షన్ ఫోర్స్ ట్రావెలర్ 26 ధర రూ.11.41 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

ఆతిథ్య రంగం, రవాణా రంగం, పర్యాటక రంగం, విద్యా సంస్థలు, బీపీవో కంపెనీల రవాణా ఉపయోగార్థం ఫోర్స్ ట్రావెలర్ 26ను రూపొందించామని ఆయన చెప్పారు. ఈ సెగ్మెంట్లో ఇతర కంపెనీలు అందిస్తున్న వాహనాలతో పోల్చుకుంటే ఫోర్స్ ట్రావెలర్ 26 ఆధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని రత్తన్ తెలిపారు. ఇందులో 129పిఎస్ పవర్, 295ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే కామన్ రైల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. 2013 మార్చి నాటికి 1000 యూనిట్ల ఫోర్స్ ట్రావెలర్ 26 వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

విద్యా సంస్థల ఉపయోగార్థంలో ఫోర్స్ ట్రావెలర్ 26లోనే ప్రత్యేకంగా స్కూల్ బస్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. 26 సీట్లలో 36 మంది పిల్లలు కూర్చునేలా దీన్ని డిజైన్ చేశారు. ఫోర్స్ ట్రావెలర్ 26 హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.24 లక్షలుగా ఉండగా, ఆన్-రోడ్ ధర రూ.11.90 లక్షలుగా ఉంది (స్టాండర్డ్ వేరియంట్ ధరలు). కాగా ఇందులో డీలక్స్ వేరియంట్ ధర రూ.14.26 లక్షలుగా ఉంది. స్కూల్ బస్ వెర్షన్ ఫోర్స్ ట్రావెలర్ 26 ధరను రూ.11.41 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది.

English summary
Pune based commercial vehicle manufacturer Force Motors has launched the 26-seater light commercial vehicle at a base price of Rs 11.24 lakh, ex-showroom Hyderabad. Force Traveller 26 was earlier showcased at the 2012 Auto Expo in Delhi.
Story first published: Friday, October 19, 2012, 10:52 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark