టాటా మోటార్స్ నుంచి అధిక మైలేజీనిచ్చే స్పోర్ట్స్ కార్లు

సాధారణంగా స్పోర్ట్స్ కార్స్ మైలేజ్ తక్కువగా ఉంటుంది. ఇందుకు ఎరోడైనమిక్స్, పవర్‌ఫుల్ ఇంజన్ వంటి అనేక కారణాలు ఉంటాయి. అయితే, దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ మాత్రం అధిక మైలేజీనిచ్చే స్పోర్ట్స్ కార్లను అందిస్తామంటోంది. ఈ సెగ్మెంట్లో పోటీని తట్టుకునేందుకు వీలుగా అధిక ఇంధన సామర్థ్యం కలిగిన వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నామని టాటా మోటార్స్ అధినేత రతన్‌ టాటా వెల్లడించారు.

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్‌రోవర్ నుంచి ఈ అధిక మైలేజీనిచ్చే స్పోర్ట్స్ కార్లను ప్రవేశపెడతామని, రానున్న రెండేళ్లలో ఇవి మార్కెట్లోకి వస్తాయని రతన్ టాటా తెలిపారు. ఇందులో భాగంగా కంపెనీ చరిత్రలోనే ఇదివరకెన్నడూ లేని విధంగా అత్యంత భారీ అభివృద్ధి ప్రణాళికలను చేపట్టినట్టామని ఆయన చెప్పారు.


పాత మోడల్స్‌కి సరికొత్త లుక్‌ని ఇవ్వడం, రేంజ్ రోవర్‌ బ్రాండ్‌లో మరిన్ని వాహనాలను మార్కెట్లోకి తీసుకురావటం అలాగే, ల్యాండ్‌ రోవర్ బ్రాండ్‌లో సరసమైన ధర కలిగిన వాహనాలను తయారు చేయటం వంటి ప్రణాళికలు ఉన్నాయని, ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్‌ రోవర్ అమ్మకాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయని ఆయన టాటా తెలిపారు

కాగా.. మెర్సిడెస్ బెంజ్, వోల్వో, నావిస్టార్ వంటి ప్రపంచ ఆటో దిగ్గజాలతో టాటా మోటార్స్ పోటీ పడాలనుకుంటుంది. ఈ గ్లోబల్ బ్రాండ్‌లకు సరికొత్త వాహనాలు తీర్చిదిద్దేందుకు టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తుంది. సమీప భవిష్యత్‌లో వాణిజ్య వాహన విభాగంలో అంతర్జాతీయ బ్రాండ్‌‌లకు గట్టి పోటీని ఇస్తామని రతన్ టాటా తెలిపారు.

Most Read Articles

English summary
British luxury brand Jaguar Land Rover owned by Indian auto giant Tata Motors will launch a number of fuel efficient sports cars in the next 2-3 years, said Tata group Chairman Ratan Tata. He said JLR was developing higher-powered and more fuel-efficient engines to attract more customers.
Story first published: Saturday, July 14, 2012, 12:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X