మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంట్ వర్కర్ల జీతాల్లో భారీ పెంపు

Written By:
కార్మికులపై మారుతి సుజుకి యాజమాన్యానికి ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. గడచిన జులై నెలలో మానేసర్ ప్లాంటులో కార్మికులు అల్లర్లకు పాల్పడి సంస్థకు భారీ నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో, గుర్గావ్ ప్లాంట్‌లో క్లూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో, గుర్గావ్ ప్లాంట్ కార్మికుల వేతనాలు భారీగా పెంచింది. ఈ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏకంగా 75 శాతం (లేదా నెలకు రూ.18,000) పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

మూడేళ్ల వేతన సెటిల్‌మెంట్‌లో భాగంగా కంపెనీ కార్మికుల జీతాలను సవరించింది. ఈ తాజా పెంపుతో ప్రస్తుతం దేశంలోని తయారీ రంగంలో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న ప్లాంటుగా గుర్గావ్ నిలువనుంది. మొత్తం జీతంపై ఇచ్చే ఈ పెంపు, కార్మికుల అనుభవాన్ని, సీనియారిటీని బట్టి సుమారు రూ.14,000 నుంచి రూ.22,000 మధ్యలో ఉంటుందని గుర్గావ్ ప్లాంట్‌కు చెందిన వర్కర్స్ యూనియ్ మారుతి ఉద్యోగ్ కామ్‌గర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కులదీప్ జంఘు తెలిపారు.

మారుతి సుజుకి సంస్థ యొక్క 30 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద జీతాల పెంపుదల అని, దీనికి సంబంధించి యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందంపై తాము సంతకాలు చేశామని, ఇందులో భాగంగా, కొత్త టెక్నీషియన్లకు ఇది వరకు మూడు నెలలుగా ఉన్న ప్రొబేషన్ పీరియడ్‌ను రెండు సంవత్సరాలు తగ్గించడం జరిగందని ఆయన చెప్పారు. అలాగే వర్కర్లందరి మెడికల్ బెనిఫిట్లను కూడా రెట్టింపు చేయడం జరిగినట్లు ఆయన చెప్పారు.

మారుతి సుజుకి ప్రతి మూడేళ్లకు ఒకసారి చొప్పును జీతాలను పెంచుతుంది. గడచిన 2009లో మారుతి సుజుకి కేవలం 6 శాతం మాత్రమే జీతాలను పెంచింది. ద్రవ్యోల్బణం, ధర పెరుగుదల, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్టట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, కంపెనీ తీసుకున్న ఈ కార్మిక సాన్నిహిత్య చర పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Soon after indicating its intentions to increase its car prices by a small percentage, leading Indian carmaker Maruti Suzuki has increased the salaries of its workers by as much as 75% per month as per the new wage settlement in Gurgaon.
Story first published: Wednesday, September 26, 2012, 15:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos