హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లపై రాష్ట్ర సర్కారుకు సుప్రీం చివాట్లు

Supreme Court
వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌(హెచ్ఎస్ఆర్‌పి)ను అమర్చే విషయంలో జాప్యం చేస్తున్నందుకు గానూ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు దేశపు అత్యున్నత న్యాయ స్థానం మొట్టికాయలు వేసింది. జూన్ 15 నాటికి అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను బిగించాలని, లేకపోతే కోర్టు ధిక్కారాలను ఎదుర్కోవలసి ఉంటుందని సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది.

ఈ మేరకు ఛీఫ్ జస్టిస్ ఎస్ హెచ్ కపాడియా, జస్టిస్ ఏ కె పట్నాయక్, జస్టిస్ స్వాతంతర్ కుమార్‌లో కూడిన దర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ట్రాన్స్‌పోర్ట్) డి లక్ష్మి పార్థసారధి, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హిరాలాల్ సమారియాలకు నోటీసులు జారీ చేసింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమలు పరచడంలో సుప్రీం కోర్టు ఆదేశాలకు అఫడవిట్‌ను ఫైల్ చేయడం విఫలమైన కారణంగా వీరికి న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది.

"హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమర్చుకోవడం శాసనబద్ధమైన నియమం. ఇది కేవలం రాష్ట్ర భద్రత కోసమే కాకుండా ప్రజల భద్రత కోసం కూడా. కాబట్టి ఇది కేవలం ఆపేక్షనీయమైనది మాత్రమే కాదు, తప్పనిసరైనది కూడా. ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా 1950 యొక్క ఆర్టికల్ 129 ప్రకారం శాసనబద్ధమైన నిబంధనలు/ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని" కోర్టు పేర్కొంది.

కాబట్టి, అన్ని రాష్ట్రాల్లో కొత్త వాహనాలకు ఏప్రిల్ 30, 2012 లోపుగా అలాగే పాత వాహనాలకు జూన్ 15, 2012 లోపుగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమర్చాల్సిందిగా ఆదేశించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అదనపు సమయాన్ని కేటాయించే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది.

Most Read Articles

English summary
The governments of various states and Union territories were warned today by the Supreme Court to either ensure high security registration plates (HSRP) for all vehicles by June 15, this year or face contempt of court proceedings.
Story first published: Wednesday, February 15, 2012, 18:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X