సరికొత్త జెనాన్ పికప్‌ను విడుదల చేసిన టాటా మోటార్స్

ఇంధన ధరలు భగ్గుమంటున్న నేటి రోజుల్లో, టాటా మోటార్స్ తక్కువ నిర్వహాక వ్యయంతో ఎక్కువ ఆదాయాలను తెచ్చిపెట్టే రగ్గడ్ అండ్ స్టయిలిష్ పికప్ 'టాటా జెనాన్'ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. చిన్న తరహా వాణిజ్య వాహనాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాటా మోటార్స్ తమ జెనాన్ పికప్‌ను తొలిసారిగా గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

టాటా జెనాన్‌ పికప్‌లో శక్తివంతమైన 3.0 లీటర్ కామన్ రైల్ అండ్ టర్బో డీజిల్ ఇంక్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది సింగిల్ క్యాబిన్, డబుల్ క్యాబిన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. సింగిల్ క్యాబిన్ టాటా జెనాన్ గరిష్టంగా 72 హెచ్‌పిల శక్తిని, 223 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగా, డబుల్ క్యాబిన్ టాటా జెనాన్ గరిష్టంగా 115 హెచ్‌పిల శక్తిని, 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


విస్తృతస్థాయి వాణిజ్య అవసరాల కోసం టాటా జెనాన్ పికప్ చక్కగా సరిపోతుంది. ఈ పికప్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కమర్షియల్ వెహికల్స్) రవి పిషారోడి మాట్లాడుతూ.. పికప్ సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని, టాటా జెనాన్ పికప్ విడుదలతో తమ ప్రస్తుత పికప్ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకోనున్నామని చెప్పారు.

టాటా జెనాన్ పికప్‌ ఈ శ్రేణిలో కెల్లా ఉత్తమైన ఫీచర్లను కలిగి ఉందని, ప్రస్తుతం తాము అందిస్తున్న టాటా సూపర్ ఏస్, టాటా ఆర్ఎక్స్ పికప్‌ల మాదిరిగానే తమ కొత్త జెనాన్ పికప్ కూడా మార్కెట్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునేలా తీర్చిదిద్దామని రవి తెలిపారు. భారత మార్కెట్లో టాటా జెనాన్ పికప్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* టాటా జెనాన్ సింగిల్ క్యాబ్ - రూ.5.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, థానే)
* టాటా జెనాన్ డబుల్ క్యాబ్ రూ.6.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, థానే)

Most Read Articles

English summary
Tata Motors today launched the Tata Xenon Pick-up, offering both single cab & dual cab versions, with best-in-class looks, operating economics and fuel efficiency. The Tata Xenon Pick-up is suitable for a wide range of commercial -applications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X