2015 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో మరింత పవర్‌ఫుల్ ఇంజన్స్

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న పాపులర్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్/ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త స్విఫ్ట్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్స్‌ను ఆఫర్ చేయనున్నారు.

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ విడుదలైన తర్వాత కానీ లేదా దానికంటే ముందే కానీ ఈ కొత్త స్విఫ్ట్ విడుదల కావచ్చని అంచనా. సియాజ్‌లో ఉపయోగిస్తున్న పవర్‌ఫుల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ స్విఫ్ట్‌లోను ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ఇంజన్లు మరింత శక్తివంతమైనవే కాకుండా, మరింత మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేయనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను స్విఫ్ట్ ఎస్ అని పిలువనున్నట్లు తెలుస్తోంది.

2015 Maruti Swift

ప్రస్తుతం లభిస్తున్న స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 87 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్విఫ్ట్ బేస్ వేరియంట్‌లో ఇదే ఇంజన్ ఆఫర్ చేయవచ్చని సమాచారం. అయితే, మిడ్, టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రం సియాజ్‌లో ఉపయోగిస్తున్న 1.4 లీటర్ కె-సిరీస్ (కె14 వివిటి) ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 95 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదేవిధంగా, ప్రస్తుతం లభిస్తున్న స్విఫ్ట్ డీజిల్ వెర్షన్‌లో 1.3 డిడిఐఎస్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 75 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్విఫ్ట్‌లో ఈ ఇంజన్ స్థానంలో సియాజ్‌లో ఉపయోగిస్తున్న పవర్‌ఫుల్ డిడిఐఎస్ 200 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 90 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అన్ని ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. అయితే, ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) లభ్యత గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti Suzuki India Limited (MSIL) is redying to launch the new Swift facelift. Company has teased upcoming Swift via photo. The picture suggests 2014 Maruti Swift will be named Swift S and will sport more powerful engines.
Story first published: Saturday, September 13, 2014, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X