సరికొత్త వోల్వో ఎక్స్‌సి90: సేఫ్టీలో దీనికి సాటి మరొకటి లేదు

By Ravi

వోల్వో కార్లంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. స్వీడన్‌కు చెందిన ఈ ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ తయారు చేసే వాహనాల్లో ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఈ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ వహించి, అధునాత సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంటుంది. ఇందులో భాగంగానే, కంపెనీ వచ్చే నెలలో విడుదల చేయనున్న సరికొత్త వోల్వో ఎక్స్‌90 కారులో ఆటోమొబైల్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఆఫర్ చేయని సేఫ్టీ ఫీచర్లను ఇందులో ఆఫర్ చేయనుంది.

ఇది కూడా చదవండి: జిపిఎస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది

కార్లలో ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో 2020 నాటికి తమ కొత్త వోల్వో కారులో ఏ వ్యక్తి మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం కాకుండా ఉండేందుకు సేఫ్టీ ఫీచర్లను తయారు చేయాలనే తమ లక్ష్యంలో భాగంగానే ఈ రెండు కొత్త టెక్నాలజీలను కంపెనీ అభివృద్ధి చేసింది. ఇందులో మొదటిది రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్ ప్యాకేజ్, రెండవది ఆటో బ్రేక్ ఎట్ ఇంటర్‌సెక్షన్. ఈ టెక్నాలజీల గురించి మరింత క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

తర్వాతి స్లైడ్‌లలో వోల్వో అధునాతన సేఫ్టీ ఫీచర్ల గురించి, వాటి పనితీరు గురించి తెలుసుకోండి.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

వాహనం రోడ్డుపై నుంచి పక్కకు తప్పిపోగానే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు గాయపడకుండా ఉండేందుకు వోల్వో సేఫ్ పొజిషనింగ్‌ను అభివృద్ధి చేసింది. కారుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోయినా లేదా కారు రోడ్డుపై నుంచి పక్కకు తప్పుకున్న వెంటనే ఈ సిస్టమ్ దానిని గుర్తించి ఫ్రంట్ సీట్ బెల్టులను బిగుతుగా చేస్తుంది. కారు పూర్తిగా ఆగిపోయే వరుకు బెల్టులు ఇలానే బిగుతుగా ఉంటాయి.

ఇందులో డ్రైవర్ అలెర్ట్ కంట్రోల్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇది డ్రైవర్ నీరసించినా లేదా నిద్రపోతున్నట్లు అనిపించినా గుర్తించి వెంటనే డ్రైవరును అప్రమత్తం చేస్తుంది. ఇందులో రెస్ట్ స్టాప్ గైడెన్స్ కూడా ఉంది, ఇది డ్రైవరుకు విశ్రాంతి తీసుకునే ప్రదేశానికి మార్గం చూపిస్తుంది.
సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

కూడళ్ల (ఇంటర్‌సెక్షన్స్) వద్ద ఆటో బ్రేక్ అప్లయ్ అయ్యేలా వోల్వో ఓ సేఫ్టీ ఫీచర్‌ను తయారు చేసింది. వోల్వో కారులో రద్దీగా ఉండే కూడళ్లను సమీపించినప్పుడు కారులోని సెన్సార్లు జరగబోయే క్రాష్‌ను ముందుగానే గుర్తించి, ఆటోమేటిక్‌గా బ్రేక్ అప్లయ్ అవుతుంది.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

కారు వెనుక వైపు జరిగే ప్రమాదం నుంచి ప్రయాణీకులను రక్షించేందుకు వోల్వో ఎక్స్‌సి 90 కారులో ప్రి-క్రాష్ ప్రొటెక్షన్ అనే సేఫ్టీ ఫీచర్ ఉంది. ఇది కారు వెనుక నుంచి జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, సీట్ బెల్టులను ఆటోమేటిక్‌గా టైట్ చేస్తుంది. అంతేకాకుండా, వెనుక వైపు ఉన్న డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు లైట్లను కూడా ఫ్లాష్ చేస్తుంది. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు బ్రేక్స్ కూడా కూడా ఆటోమేటిక్‌గా అప్లయ్ అవుతాయి.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

వోల్వో ఎక్స్‌సి90 కారులో రోల్ ఓవర్ ప్రివెన్షన్ సిస్టమ్ ఉంటుంది, ఇది కారు దొర్లిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాహనాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఒకటి లేదా అనేక చక్రాలలో బ్రేక్స్ అప్లయ్ అవుతాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకవేళ కారు దొర్లిపోయినట్లయితే, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయ్యి అన్ని వైపుల రక్షణ కవచంగా నిలుస్తాయి, సీట్ బెల్టులు కూడా బిగుతుగా అవుతాయి.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

ఇందులో మరో ఆసక్తికరమైన ఫీచర్ సిటీ సేఫ్టీ ఆటో బ్రేకింగ్. ఈ స్టాండర్డ్ ఫీచర్ రోడ్డుపై వెళ్లే పాదచారులు, సైక్లిస్టులు మరియు ఇతర వాహనాలను ఢీకొట్టకుండా ఉండేందుకు సహకరిస్తుంది. ఈ సిస్టమ్ డ్రైవర్‌ను హెచ్చరించడంతో పాటుగా బ్రేక్స్‌ను ఆటోమేటిక్‌గా అప్లయ్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ ఇలాంటి హెచ్చరికను డ్రైవర్ పట్టించుకోకపోయినట్లయితే, కారు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది చీకటిలో కూడా పనిచేస్తుంది.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

ఈ కొత్త వోల్వో కారులో క్యూ అసిస్ట్ అనే మరో సేఫ్టీ ఫీచర్ ఉంది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న రోడ్డుపై ప్రమాదాన్ని నివారించేందుకు ఈ సిస్టమ్ సహకరిస్తుంది. ఇలాంటి సమయంలో ముందున్న వాహనానికి సరైన దూరాన్ని పాటిస్తూ యాక్సిలరేషన్, బ్రేకింగ్, స్టీరింగ్ వంటివి ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేయబడుతాయి.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

ఇన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ ప్రమాదం జరిగినట్లయితే, దాని తీవ్రతను తగ్గించేందుకు గానూ వోల్వో ఎక్స్‌సి90 కారు బాడీని హాట్-ఫార్మ్డ్ బోరాన్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది అత్యంత ధృడమైన స్టీల్. అన్ని రకాల ప్రమాదాల్లోను ప్రయీణీకులను సేఫ్‌గా ఉంచేందుకు ఈ బాడీ సహకరిస్తుంది.

సరికొత్త వోల్వో ఎక్స్‌సి90

ఇలాంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు కలిగిన సరికొత్త వోల్వో ఎక్స్‌సి90 కారు ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన వాహనంగా, ఆటోమొబైల్ పరిశ్రమలో కెల్లా అధునాత సేఫ్టీ ఫీచర్లు కలిగిన వాహనం రికార్డు సృష్టించనుంది.

Most Read Articles

English summary
Volvo's new XC90 which will be released this August, will offer some of the most comprehensive and technologically sophisticated standard safety packages available in the automotive industry. All this new technology will take the company closer to achieve their goal - for no one to be killed or seriously injured in a new Volvo car by 2020.
Story first published: Thursday, July 31, 2014, 11:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X