డిసి డిజైన్ 2014 కాంపాక్ట్ కార్ టీజర్, ఆటో ఎక్స్‌పోలో లాంచ్

By Ravi

ప్రముఖ ఆటోమోటివ్ కస్టమైజేషన్ సంస్థ 'డిసి డిజైన్' ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రెండి సరికొత్త కార్లను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ రెండు మోడళ్లలో ఒకటి ఇద్దరు ప్రయాణికులు మాత్రమే కూర్చునే వీలుండేలా తయారు చేసిన ఆల్ట్రా స్మాల్ కార్ మరియు ఓ కన్వర్టిబల్ ఎస్‌యూవీలు ఉంటాయని గతంలో డిసి డిజైన్స్ అధినేత దిలీప్ ఛాబ్రియా తెలిపారు.

కాగా.. తాజాగా డిసి డిజైన్స్ తమ ఆల్ట్రా స్మాల్ కారుకు సంబంధించి ఓ టీజర్ ఫొటోను ఇంటర్నెట్లో విడుదల చేసింది. తాము ప్రదర్శించనున్న చిన్న కారు టాటా నానో కన్నా చిన్నదిగా ఉండి, ఇద్దరు ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంటుందని, అలాగే కన్వర్టిబల్ ఎస్‌యూవీలో నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చని ఆయన వివరించారు.


అయితే, డిసి కార్లు మాత్రం చవకగా ఉంటాయని అంచనా వేయాల్సిన అవసరం లేదు. విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉండే ఈ రెండు కార్ల ధరలు సుమారు రూ.18 లక్షల నుంచి రూ.40 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. అలాగే, డిసి డిజైన్ నుంచి రానున్న ఈ రెండు మోడళ్లు ఉత్పత్తి దశకు చేరుకునేందుకు మరో రెండేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది.

కాగా.. గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో డిసి డిజైన్స్ ఆవిష్కరించిన 'డిసి అవంతి' మేడ్ ఇన్ ఇండియా చీపెస్ట్ స్పోర్ట్స్ కారును కూడా ఈ ఫిబ్రవరిలో కస్టమర్లకు డెలివరీ చేయనున్నారు. మొత్తం 25 కార్లను తొలిసారిగా కస్టమర్లకు అందించనున్నారు. డిసి అవంతి కారులో 2.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 240 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

DC Avanti

వచ్చే జూన్ 2014 నుంచి డిసి డిజైన్ పూనేలో ఉన్న తాలేగావ్ ప్లాంటులో పూర్తిస్థాయిలో అవంతి స్పోర్ట్స్ కారును ఉత్పత్తి చేయనుంది. డిసి డిజైన్‌కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 షోరూమ్‌లు ఉన్నాయి. డిసి అవంతి ధర రూ.25 లక్షల నుంచి రూ.29 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
DC Design has released a teaser picture of its ultra small car concept on their Facebook page, which is due for its official debut At 2014 Delhi Auto Expo.
Story first published: Monday, January 27, 2014, 13:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X