ఆటో ఎక్స్‌పో 2014: ఫియట్ అబార్త్ 500 విడుదల

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా తమ పవర్ ప్యాక్డ్ 'అబార్త్ 500' (Abarth 500)ను భారత్‌కు పరిచయం చేసింది. ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌‌పోలో ఫియట్ తమ అబార్త్ 500 పెర్ఫార్మెన్స్ కారును విడుదల చేసింది.

అబార్త్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా ఇండియాకు తీసుకు వచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. గతంలో ఫియట్ ఇండియా ఈ సెగ్మెంట్లో లభిస్తున్న మినీ కూపర్, ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ వంటి కార్ల సరసన తమ ఫియట్ 500 కారును ప్రవేశపెట్టింది.


అయితే, అప్పట్లో దీని అధిక కారణంగా ఇది మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించలేకపోయింది. అయితే, ఈ సరికొత్త ఫియట్ అబార్త్ 500 పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ద్వారా తిరిగి ఈ కారును కంపెనీ ఇండియాకు తీసుకొచ్చింది.

అబార్త్ బ్యాడ్జ్‌తో కూడిన ఫియట్ 500కు ఇండియాలో మంచి ఆదరణ లభించగలదని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతానికి ఫియట్ అబార్త్ 500 సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి అవుతోంది.

Fiat Abarth 500

కాగా.. భవిష్యత్తులో ఈ కార్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండియాకు విడిభాగాలుగా దిగుమతి చేసుకొని స్థానికంగానే అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. పియట్ తమ అబార్త్ 500 ధరను మరీ ఎక్కువగా కాకుండా, ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, సరసమైన ధరకే ఆఫర్ చేయాలని యోచిస్తోంది.

ఒకవేళ ఈ కారును స్థానికంగానే అసెంబ్లింగ్ చేసినట్లయితే, ఇది రూ.20 లక్షలకు దిగువనే లభించే అవకాశం ఉంది. అబార్త్ 500 కారులో 1.4 లీటర్ మల్టీఎయిర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 160 బిహెచ్‌పిల శక్తిని, 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Fiat has finally got it's performance packed Abarth 500 to India. The Car was launched at the recent Auto Expo. There were rumors that the Italian manufacturer was going to bring the Abarth Punto, alas they haven't. However, they still could if they find potential in the Indian market.
Story first published: Tuesday, February 18, 2014, 11:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X